(Source: ECI/ABP News/ABP Majha)
Tirupati Crime: డైకీన్ పరిశ్రమలో చోరీ కేసులో 9 మంది నిందితుల అరెస్టు, భారీగా నగదు స్వాధీనం
శ్రీసిటీ పారిశ్రామిక వాడలోని డైకీన్ ఏసి తయారీ పరిశ్రమలో గత వారం విలువైన కాపర్ 800 మీటర్ల మెటీరియల్ చోరీ కాగా, ఈ కేసులో 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
- డైకీన్ పరిశ్రమలో చోరీకి పాల్పడిన 9 మంది అరెస్టు
- 200 మీటర్ల కాపర్ మెటీరియల్, 1.80 లక్షల నగదు స్వాధీనం..
తిరుపతి జిల్లా, శ్రీసిటీ పారిశ్రామిక వాడలోని డైకీన్ ఏసి తయారీ పరిశ్రమలో గత వారం విలువైన కాపర్ 800 మీటర్ల మెటీరియల్ చోరీ అయింది. దీనిపై పరిశ్రమ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీస్ లు ఈ కేసుకు సంబంధించి 9 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. లక్షా ఎనభై వేల నగదుతో పాటు 200 మీటర్ల కాపర్ మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. డైకీన్ ఏసి తయారీ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న నలుగురు, మరో ఐదు మందితో కలిసి కాపర్ వైర్ చోరీకి పాల్పడ్డారు. ఇదే పరిశ్రమలో పని చేస్తున్న కొంత మంది సిబ్బంది వారిని పట్టుకుని, దేహశుద్ది చేసి నివారించే ప్రయత్నం చేయగా వారు తప్పించుకుని పరార్ అయ్యినట్లు ప్రాధమిక విఛారణలో తెలిసిందని ఎస్ఐ తెలిపారు. డైకీన్ పరిశ్రమ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న నిందితులు 9 మందిని పట్టుకుని, వారి వద్ధ నుంచి 200 మీటర్ల కాపర్ మెటీరియల్, రూ.1.80 వేలు నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా పేర్కోన్నారు.
నిందితుల్లో ఇద్ధరు పాత ముద్దాయిలు ఉన్నట్లు గా కూడా తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించడం జరిగిందన్నారు. అయితే ఈజీ మని పద్ధతిలో సంపాదించాలనే ఆలోచనతో చట్టవ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్ధంటూ యువతకు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ సూచించారు. నేరాలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని, చట్టపరంగా కఠిన చర్యలు అమలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం
ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రాణాలను బలిగొన్న ఘటన తిరుపతి జిల్లాలో కలకలం రేపుతుంది. తమ్ముడు చేసి తప్పుకి కప్పి పుచ్చేందుకు ప్రయత్నం చేసిన అన్నపై కక్ష తీర్చుకున్నారు సొంత గ్రామస్తులు. అయితే చంద్రగిరి సమీపంలో శనివారం రాత్రి వెదురుకుప్పంకు చెందిన నాగరాజు అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన నిప్పంటించి చంపేశారు. మాట్లాడుకుందామని పిలిచి గంగుడుపల్లి కురపకణం వద్ద కారులో కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. నాగరాజు తమ్ముడు పురుషోత్తం గ్రామంలో అక్రమ సంబంధం కారణంగా అక్కడి సర్పంచ్ వ్యవహారంపై నాగరాజును మాట్లాడదామని పిలిచి ఇలా చేశారని స్థానికులు ఆరోపణ. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నాగరాజు (36) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగరాజు తమ్ముడు పురుషోత్తం. పురుషోత్తం స్వగ్రామంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ ఆ ఊరి సర్పంచ్ చాణక్యకు మరదలు (తమ్ముడి భార్య). కరోనా వల్ల లాక్ డౌన్ పెట్టిన సమయంలో వీరిద్దరికీ వివాహేతర సంబంధం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో మహిళ బంధువులకి పురుషోత్తంకి మధ్య తరచూ గొడవలు అవుతున్నాయి. ఇకపై గొడవలు లేకుండా చేస్తామని నమ్మించి అన్న నాగరాజును మద్యం తాగించటానికి తీసుకువెళ్లి హత్య చేశారని భావిస్తున్నారు. అయితే, నాగరాజును సర్పంచ్ చాణిక్య హత్య చేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.