News
News
X

Tirupati News: ప్రియురాలి భర్తకు గుండు కొట్టించి, ఆపై మూత్ర విసర్జన చేసిన యువకుడు !

Tirupati News: ప్రియురాలి భర్తపై కోపం పెంచుకున్న వ్యక్తి.. బలవంతంగా అతడికి గుండు కొట్టించాడు. ఆపై అతడి మీద మూత్ర విసర్జన చేశాడు. సైలెన్సర్ తో కాల్చి మరీ చిత్రహింసలకు గురి చేశాడు. అసలేం జరిగిందంటే..!

FOLLOW US: 
Share:

Tirupati News: ఓ మహిళోతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న ఆమె భర్త.. భార్యకు తీరు మార్చుకొమ్మని నచ్చజెప్పాడు. అియినప్పటికీ వారు వినకపోవడంతో వారి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. దీంతో కోపం పెంచుకున్న ఆమె ప్రియుడు...  ప్రియురాలి భర్తపై పగ తీర్చుకున్నాడు. ఒంటరిగా అతడిని పట్టుకొని కిడ్నాప్ చేశాడు. ఆపై సైలెన్సర్ తో దాడి చేసి మరీ బలవంతంగా అతడికి గుండు కొట్టించాడు. ఆపై అతడి మీద మూత్ర విసర్జన చేసి పగ తీర్చుకున్నాడు. 

అసలేం జరిగిందంటే..?

స్థానికుల కథనం మేరకు.. తిరుపతి‌ జిల్లా, చంద్రగిరి మండలంలోని ఏ.రంగంపేటకు చెందిన హరి కృష్ణ నాయుడు కుమారుడు వంశీ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన ఓ మహిళను మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఆటో యజమాని తిరుపతి రూరల్ మండలం, ముస్లింపేటకు చెందిన అన్వర్ తరచూ వంశీ వద్దకు వచ్చి వెళ్తూ ఉండేవాడు. అదే సమయంలో వంశీ భార్యతో అన్వర్ కి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వంశీ ఇంట్లో‌లేని సమయంలో అన్వర్ వచ్చేవాడు. వంశీ భార్యతో కలిసి చాలా సమయం గడిపేవాడు. అయితే ఈ విషయాన్ని చుట్టు పక్కల వాళ్లకు వంశీకి తెలియజేయడంతో తన భార్య అక్రమ సంబంధం వ్యవహారం గురించి భర్త తెలుసుకున్నాడు. భార్యను నిలదీశాడు. దీంతో వంశీ భార్య రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోతున్నానని చెప్పి ప్రియుడు అన్వర్ చెంతకు చేరింది.

స్నేహితులతో కలిసి కిడ్నాప్.. ఆపై దాడి, తలపై మూత్ర విసర్జన

భార్య వదిలేసి పోవడంతో వంశీ ఆటో నడపడం మానేసి, బెంగళూరులో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే నెలన్నర క్రితం తన భార్య ఫేస్ బుక్ లో అన్వర్ తోనే ఉన్నట్లు గుర్తించాడు. గత నెల 13వ తేదీన తన భార్యతో పాటు అన్వర్ చనిపోయాడంటూ ఫేస్ బుక్ లో ఓ పోస్టు చేశాడు. దీన్ని జీర్ణించుకోలేని ఆన్వర్, చంద్రగిరికి చెందిన తన స్నేహితుడు హర్షతో కలిసి బెంగళూరులోని వంశీని కిడ్నాప్ చేసి చంద్రగిరికి తీసుకొచ్చారు. కొంతమంది స్నేహితులతో కలిసి వంశీని చిత్ర హింసలకు గురి చేశారు. అంతే కాకుండా సైలెన్సర్ తో శరీరం అంతా కాల్చారు. ఆపై తలపై మూత్రం పోశారు. అంతటితో ఆగకుండా వంశీకి గుండు కొట్టించి వీడియోలు చిత్రీకరించారు. అనంతరం బాధితుడిని బెదిరించి అన్వర్ అనే వ్యక్తిపై తప్పుగా పోస్టులు పెట్టానని, అందుకు ప్రాయశ్చితంగా గుండు కొట్టించుకున్నట్లు బలవంతంగా ఓ వీడియోను చిత్రీకరించి వైరల్ చేశారు. అన్వర్ దురాగతంపై శుక్రవారం వీడియో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీనిపై పిర్యాదు రాక పోయినప్పటికీ కేసు నమోదు చంద్రగిరి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. బాధితుడిని గుర్తించి జరిగిందేంటో అడగ్గా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఈ వార్త సంచలనం రేపుతోంది. 

Published at : 04 Mar 2023 09:26 AM (IST) Tags: AP Crime news Tirupati News Man Shaved Wife husband Man Urinated on Wife husband Tirupati Latest Viral News

సంబంధిత కథనాలు

Karimnagar Fire Accident: కరీంనగర్ లో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు, రిటైర్డ్ ఎంపీడీవో సజీవ దహనం!

Karimnagar Fire Accident: కరీంనగర్ లో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు, రిటైర్డ్ ఎంపీడీవో సజీవ దహనం!

Karimnagar Crime News: కరీంనగర్ లో దారుణం - యువకుడి గొంతుకోసి దారుణ హత్య, మందు పార్టీ కొంపముంచిందా? 

Karimnagar Crime News: కరీంనగర్ లో దారుణం - యువకుడి గొంతుకోసి దారుణ హత్య, మందు పార్టీ కొంపముంచిందా? 

Eluru Crime: పండుగపూటే విషాదం - ఆటోపై విరిగిపడిన తాటిచెట్టు, రెండేళ్ల పాప దుర్మరణం

Eluru Crime: పండుగపూటే విషాదం - ఆటోపై విరిగిపడిన తాటిచెట్టు, రెండేళ్ల పాప దుర్మరణం

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్, చర్లపల్లి జైలుకు నిందితుల తరలింపు

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్, చర్లపల్లి జైలుకు నిందితుల తరలింపు

Gold Seized in Vijayawada: విజయవాడలో రూ.7.48 కోట్ల బంగారం పట్టివేత - బస్సులో, రైళ్లో తరలిస్తుండగా నిందితుల అరెస్ట్!

Gold Seized in Vijayawada: విజయవాడలో రూ.7.48 కోట్ల బంగారం పట్టివేత - బస్సులో, రైళ్లో తరలిస్తుండగా నిందితుల అరెస్ట్!

టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!