By: ABP Desam | Updated at : 02 Dec 2022 04:23 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
యువతి మోహన కృష్ణ
Tirupati Crime : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన యువతి మోహన కృష్ణ (19) ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. పోస్టుమార్టం రిపోర్టులో యువతి ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో గొంతు నులిమి హత్య చేశారని తేలింది. దీంతో చంద్రగిరి పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగింది?
తిరుపతి జిల్లా రెడ్డివారిపల్లెకు చెందిన ముని రాజా కుమారై మోహన కృష్ణ స్థానికంగా ఉన్న కాలేజీలో ఇంటర్ చదువుతోంది. అయితే ఆంజనేయపురానికి చెందిన వికాస్ అనే యువకుడితో ఆమె ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరి కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి రెండు కుటుంబాల పెద్దలు ఒప్పుకోలేదు. ఈ విషయంపై పోలీసుల సమక్షంలో పంచాయితీ, విద్యార్థులకు కౌన్సెలింగ్ కూడా జరిగింది. దీంతో యువతీ యువకులను వాళ్ల కుటుంబసభ్యులు దూరంగా ఉంచారు. ఉన్నట్టుండి జులై 7న యువతి మోహన కృష్ణ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అయితే యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎస్వీ మెడికల్ కాలేజీకి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో యువతిది హత్యగా తేలడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరువు హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లవర్‌తో కలిసి భర్తను చంపిన మహిళ!
ఇంతకుముందు జరిగిన క్రైమ్స్ ఆధారంగా సినిమాలు తీశేవారు.. కానీ ఇప్పుడు అవే క్రైమ్ సినిమాలు చూసి తెలివిగా నేరాలు చేస్తున్నారు కొంతమంది. తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ క్రైమ్ సీన్.. 'దృశ్యం-2' సినిమాను తలపించింది. వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు ప్రియుడితో కలిసి భార్య.. తన భర్తను హత్య చేసింది. సినిమా స్టైల్లో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించి.. చివరకు పోలీసులకు దొరికి పోయింది. బెంగళూరులోని సోలదేవనహళ్లిలో ఉండే ఓ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరూ వ్యవసాయం చేసుకుని బతుకుతున్నారు. కానీ భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. అదే సమయంలో ఆ భార్యకు.. మరో వ్యక్తితో పరిచయం అయ్యింది. ఆ తర్వాత అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడు ఎవరూ లేని సమయంలో వారి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. కొన్ని రోజులకు భార్య వివాహేతర సంబంధం గురించి భర్తకు తెలిసింది. ఇదే విషయమై ఇటీవల ఓ రాత్రి భార్యతో గొడవ పడ్డాడు. అదే సమయంలో తన భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఆమె ప్లాన్ వేసింది. ప్రియుడు ఇంటి వెనుక ద్వారం నుంచి అప్పటికే రాగా.. ఆమె తన భర్తను గొంతు కోసి చంపేసింది. ఆవుల కొట్టంలో నుంచి తాడు తెచ్చి కాళ్లు, చేతులను దగ్గరికి లాగి తాళ్లతో కట్టేసి సంచిలో వేశారు.
భర్త కనిపించడంలేదని ఫిర్యాదు
కారులో మృతదేహాన్ని రాంనగర్ వద్దకు తీసుకెళ్లారు. మృతుడి ఫోన్‌ను ఓ ఖాళీ ప్రదేశంలో పడేశారు. తర్వాత సాక్ష్యాలు దొరక్కుండా హత్యకు ఉపయోగించిన వస్తువులను ఒక్కొక్కటిగా వేరే వేరే ప్రదేశంలో విసిరేశారు. తరువాత భర్త మృతదేహాన్ని మైసూరు-బెంగళూరు హైవే పక్కన ఉన్న ఓ కాలువలో 50 మీటర్ల లోతులో మృతదేహాన్ని పాతి పెట్టారు. ఆ తర్వాత రోజు మహిళ తనకు ఏమీ తెలియనట్లుగా నటించింది. పోలీసులకు తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులకు దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిశాయి. భార్యే.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిందని దర్యాప్తులో తెలిసింది. రాంనగర్ జిల్లా కెంపేగౌడ దొడ్డి సమీపంలో అతని మృతదేహం లభ్యమైంది. దీంతో ఆమెతో సహా తన ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Peddapalli Crime : రౌడీషీటర్ సుమన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు, పాతకక్షలతో మర్డర్!
Satysai District Crime News: సత్యసాయి జిల్లాలో దారుణం - ఆరో తరగతి విద్యార్థినిపై యువకుడి అత్యాచార యత్నం
Hyderabad: ఒకరోజులో 20 ఇళ్లలో దొంగతనాలు! అవాక్కైన పోలీసులు - ఎట్టకేలకు అరెస్టు
Rompicharla: టీడీపీ లీడర్‌పై తుపాకీ కాల్పుల కలకలం- ఆ వైసీపీ ఎమ్మెల్యే పనేనంటున్న తెలుగుదేశం
Hyderabad Fire Accident: చిక్కడపల్లిలో భారీ అగ్ని ప్రమాదం, సమీప బస్తీల్లో జనం భయాందోళన
Telangana budget 2023 : కొత్త పన్నులు - భూముల అమ్మకం ! తెలంగాణ బడ్జెట్లో ఆదాయ పెంపు మార్గాలు ఇవేనా ?
Pawan Kalyan On Anam : డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు - ఆనం, కోటంరెడ్డి ఇష్యూపై పవన్ కల్యాణ్ హెచ్చరిక
YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, తమతో ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్
Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్