అన్వేషించండి

Tenali Crime News: తెనాలి లేడీ సైనైడ్ కిల్లర్స్ చేతిలో చావునుండి జస్ట్ మిస్సయిన ముగ్గురు వీరే

Tenali Crime News | తెనాలిలో సంచలనం రేపిన సైనైడ్ హత్యల కేసు స్థానికంగా వణుకు పుట్టిస్తోంది. అయితే కొందరు వ్యక్తులు అదృష్టం కొద్దీ క్రైమ్ కిల్లర్స్ నుంచి తప్పించుకున్నారు.

Tenali Cyanide Murders | గుంటూరు పోలీసులు అరెస్టు చేసిన లేడీ కిల్లర్స్ చేసిన హత్యల గురించి వింటుంటే ఒక్కసారిగా వెన్నులో వణుకు పుడుతుంది. తెనాలిలోని యడ్ల లింగయ్య కాలనీ కి చెందిన ముడియాల వేంకటేశ్వరి అలియాస్ బుజ్జి అనే 32 ఏళ్ల మహిళ తన తల్లి రమణమ్మ మరో కొంతమంది తో కలిసి ఒక గ్యాంగ్ లా ఏర్పడి నాలుగు హత్యలు చేశారు. ఇందులో బుజ్జి అత్తగారు సహా వారికి అప్పు ఇచ్చిన మరో వృద్ధురాలు, షేక్ నాగూర్ బీ అనే పక్కింటావిడను బంగారం డబ్బు కోసం కూల్ డ్రింక్ లో సైనైడ్ కలిపి వేరు వేరు సమయాల్లో చంపేసిన విషయం తెలిసిందే.

తెనాలిలో మోషే అనే మరో వ్యక్తిని అతని భార్య సహకారంతో ఇన్స్యూరెన్స్ డబ్బులో వాటా ఇచ్చేలా మాట్లాడుకుని అతనికి మద్యం లో సైనైడ్ కలిపి తాగించి చంపేశారు. కేసు దర్యాప్తులో ఈ మహిళలు చేసిన వరుస హత్యలు తెలుసుకున్న  పోలీసులే షాక్ కు గురయ్యారని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. అయితే నిజానికి వారు మరో ముగ్గుర్ని కూడా చంపాలని ప్లాన్ చేశారు. కానీ ఆ ముగ్గురు చాలా లక్కీ గా చావునుంచి బయట పడ్డారని ఎస్పీ తెలిపారు. థ్రిల్లర్ సినిమా ట్విస్ట్ లను తలపించే ఆ ముగ్గురి డెత్ ఎస్కేప్ ఎలా జరిగిందో మీరూ తెలుసుకోండి. 

1) అన్నంలో సైనైడ్ కలిపి వాలంటీర్ ను చంపే కుట్ర - కెమికల్  రియాక్షన్ పుణ్యమా అంటూ చావు నుండి జస్ట్ మిస్ 
తెనాలి టౌన్ లో నివసించే అన్నపూర్ణ అనే ఆమె వాలంటీర్ గా పనిచేస్తుంది. గతంలో వాలంటీర్ గా పనిచేసిన ముడియాల వేంకటేశ్వరికి ఆమెతో కాస్త స్నేహం ఉంది. అన్నపూర్ణ ఇంట్లో దాదాపు 1,25,000 (లక్షా ఇరవై ఐదు వేలు) రూపాయల విలువైన బంగారం ఉందని తెలుసుకున్న వేంకటేశ్వరీ అలియాస్ బుజ్జి ఆమె తల్లి రమణమ్మ కలిసి అన్నపూర్ణ తినే ఆహారంలో సైనైడ్ కలిపారు. అన్నపూర్ణ చనిపోయాక ఆమె ఇంట్లో ఉన్న బంగారం తో పాటు అన్నపూర్ణ ఒంటిపై ఉన్న నగలు కూడా కాజేయ్యాలని బుజ్జి ఆమె తల్లి ప్లాన్ చేశారు. కానీ అదృష్టవశాత్తూ అన్నపూర్ణ తినే అన్నంలో కలిపిన సైనైడ్ కెమికల్ రియాక్షన్ కు గురై ఆ రంగు మారిపోయింది. ఆహారం పాడైంది అనుకుని దాన్ని తినకుండా బయట పారెయ్యడంతో తనకు తెలియకుండానే చావు నుంచి తప్పించుకుంది అన్నపూర్ణ. ఈ సంఘటన 2022 డిసెంబర్ లో జరిగింది.

2) భర్త ఫోన్ కాల్ రావడం తో చావు నుండి తప్పించుకున్న వరలమది 
తెనాలిలో ఉండే మురగప్ప వరలమది అనే మహిళ తన కూతురు పెళ్లి కోసం బంగారు నగలు చేయించింది. వాటిని కొట్టేయడం కోసం మంచి మాటలతో ట్రాప్ చేశారు బుజ్జి ఆమె తల్లి రమణమ్మ. ఒకరోజు మాట్లాడేపని ఉందని వరలమది నీ ఊరి బయటకు తీసుకెళ్ళారు తల్లీ కూతుళ్ళు. Thums up లో సైనైడ్ కలిపి తాగించి చంపేయాలని అనుకుంటుండగా వరలమది కి ఆమె భర్త ఫోన్ చేశాడు. ఆమె తన భర్తకు బుజ్జి,రమణమ్మ లతో కలిసి బయటకు వచ్చానని చెప్పడం విన్న బుజ్జి ఇప్పుడు వరలమది చనిపోతే తమమీద అనుమానం వస్తుందని సైనైడ్ కలిపిన థమ్స్ అప్ ఆమెకు ఇవ్వలేదు. ఇలా భర్త చేసిన ఫోన్ కాల్ భార్య వరలమదిని చావు నుంచి కాపాడింది.


3) టీలో కలిపిన మత్తు బిళ్ళలు పనిచెయ్యలేదు - బతికి పోయిన మిరాబీ 
తెనాలిలో ఉండే షేక్ మిరాబీ అనే ఆమె దగ్గర ఉన్న 20000 రూపాయలు కాజేసేందుకు ఆమె ఇంటికి వెళ్ళిన బుజ్జి రమణమ్మ ఆమెను మాటల్లో పెట్టి టీలో మత్తు బిళ్ళలు కలిపారు. మీరాబీ మత్తు లోకి వెళ్ళగానే ఆమెకు ఊపిరాడ కుండా చేసి చంపాలని ప్లాన్ చేసారు . అయితే ఆ మత్తు టాబ్లెట్లు పని చేయకపోవడం తో వాళ్ల ప్లాన్ ఫెయిల్ అయింది.

ఇలా బుజ్జి గ్యాంగ్ చేతిలో ఈ ముగ్గురు మహిళలు చావు నుంచి తృటిలో తప్పించుకోగా మిగిలిన నలుగురు మాత్రం తెనాలి లేడీ సైనైడ్ కిల్లర్స్ చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా పోలీసులు ఒంటరిగా ఉండే మహిళలు జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా ఎంత పరిచయం ఉన్న వారితోనైనా సరే జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
Also Read: Andhra Pradesh: కూల్ డ్రింక్‌లో సైనైడ్ కలిపి నలుగుర్ని చంపేసిన తెనాలి మహిళలు- కర్రీ అండ్‌ సైనైడ్ కు సీక్వెల్‌గా ఉందీ స్టోరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget