అన్వేషించండి

Kadapa News: కడప జిల్లాలో తీవ్ర విషాదం - రెవెన్యూ అధికారులు మోసం చేశారంటూ కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

Andhrapradesh News: కడప జిల్లాలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర విషాదం నింపింది. తమ భూమి వేరే వారి పేరు మీద రికార్డుల్లో ఉందని.. రెవెన్యూ అధికారులు మోసం చేశారని వారు సూసైడ్ నోట్ రాశారు.

Three Family Memers Suicide in Kadapa District: కడప (Kadapa) జిల్లాలో శనివారం తీవ్ర విషాదం జరిగింది. రెవెన్యూ అధికారులు తమను మోసం చేశారంటూ ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట  (Ontimitta) మండలం కొత్త మాధవరంలో నివాసం ఉంటున్న పాల సుబ్బారావు (47)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె హైదరాబాద్ లో చదువుకుంటుండగా.. చేనేత పని చేసుకుంటూ సుబ్బారావు, భార్య పద్మావతి (41), చిన్న కుమార్తె వినయ (17)తో కలిసి ఆయన గ్రామంలో ఉంటున్నారు. ఆయనకు గ్రామంలో 3.10 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి రైతు భరోసా డబ్బులు సైతం అందుకునేవారు. అయితే, ఇటీవల పొలాన్ని అమ్ముదామని యత్నించగా రికార్డులు తారుమారయ్యాయి. అతని పొలం వేరే వారి పేరు మీద రికార్డులతో ఉంది. ఈ భూమిని తిరిగి తన పేరు మీద మార్చుకోవడానికి రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేకపోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వారు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుబ్బారావు ఒంటిమిట్ట చెరువు కట్ట సమీపంలో రైలు కింద పడి బలవన్మరణం చెందగా.. అతని భార్య, కుమార్తె ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు.

సూసైడ్ నోట్ లభ్యం

సమాచారం అందుకున్న సీఐ పురుషోత్తమరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో సూసైడ్ నోట్ గుర్తించారు. మూడెకరాల పొలం అమ్ముదామని అనుకోగా.. రికార్డులు తారుమారయ్యాయని పేర్కొన్నారు. పొలం వేరే వారి పేరుతో రికార్డుల్లో ఉందని.. రెవెన్యూ అధికారులు మోసం చేశారని.. ఏమీ చేయలేని స్థితిలో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నామని అందులో రాసి ఉంది. కాగా, ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Srikakulam News: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో ఎలుగుబంటి దాడి- ఇద్దరు మృతి, మరో మహిళకు తీవ్రగాయాలు

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Embed widget