Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య

Suicide in Jogulamba Gadwal District | గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TGSP) కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు (27) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు గద్వాలలోని TGSP 10వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగానే ఆయన తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. వెంకటేశ్వర్లు ఆత్మహత్యపై ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల చోటుచేసుకున్న పోలీసుల ఆత్మహత్య ఘటనలు
హైదరాబాద్‌లో ఎస్సై ఆత్మహత్య
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఒక పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ తీవ్ర ఒత్తిడికి లోనై, వ్యక్తిగత కారణాలతో తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మెదక్ జిల్లాలో కానిస్టేబుల్ బలవన్మరణం
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల కారణంగా కొన్ని రోజుల కిందట మెదక్ జిల్లాకు చెందిన ఒక సివిల్ కానిస్టేబుల్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
వరంగల్‌లో బెటాలియన్ కానిస్టేబుల్ ఆత్మహత్య
జిల్లాలోని మామునూరు బెటాలియన్‌కు చెందిన ఒక కానిస్టేబుల్ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారని తెలిసిందే. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని, ఆత్మహత్యలు మాత్రమే పరిష్యారం కాదని పోలీసులు, అధికారులు, సిబ్బందితో పాటు ప్రజలకు సూచిస్తున్నారు. అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకుని సమస్య నుంచి బయటపడాలని చెబుతున్నారు.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)ట్రెండింగ్ వార్తలు























