Crime News: అమెరికాలో రోడ్డు ప్రమాదం - తెనాలి యువతి దుర్మరణం
Andhra News: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి యువతి మృతి చెందారు. ఈ ఘటనతో స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Tenali Young Woman Died In America: అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి (Tenali) చెందిన ఓ యువతి మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలికి చెందిన వ్యాపారి గణేష్, రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీవందన పరిమళ .. ఎంఎస్ చేసేందుకు (26) 2022, డిసెంబరులో అమెరికా వెళ్లారు. అక్కడి టెన్నెసీ రాష్ట్రంలో చదువుతున్నారు. శుక్రవారం రాత్రి ఆమె తన స్నేహితులతో కలిసి వెళ్తుండగా.. రాక్‌వుడ్ ఎవెన్యూ సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పరిమళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనలో నికిత్, పవన్ అనే మరో ఇద్దరు తెలుగు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని వీలైనంత త్వరగా తెనాలి పంపించడానికి తానా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారని బంధువులు తెలిపారు. ఈ ఘటనతో స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Also Read: Viral News: దెయ్యం దెబ్బకు అక్కడ మొత్తం ఇళ్లు ఖాళీ, రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే ఆ ఊరి పేరు