అన్వేషించండి

Viveka Murder Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం, నిందితుడు శివశంకర్‌రెడ్డికి బెయిల్ మంజూరు

Siva Sankara Reddy: వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం ఆయన చంచల్‌గూడ జైలు నుంచి విడుదల

YS Viveka Murder Case: మాజీమంత్రి వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి(Devireddy Siva Sankarareddy)కి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమవారం సీసీఎస్  పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు(Telangana High Court). పాస్ పోర్టును కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

శివశంకర్‌రెడ్డికి బెయిల్‌
మాజీ మంత్రి వివేకా హత్యకేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయనకు బెయిల్ రావడం యాధృచ్చికమే. 2019 మార్చి 15 న పులివెందులలో ఆయన ఇంట్లోనే మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Viveka) అనుమానాస్పద స్థితితో చనిపోయారు. ఆయన తొలుత గుండెపోటుతో మరణించారని బయట ప్రపంచానికి చెప్పినా... ఆ తర్వాత హత్యగా తేల్చారు. ఈ ఘటనపై అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సీబీఐ(CBI) విచారణకు సైతం డిమాండ్‌ చేశారు. హత్యకేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు... దస్తగిరి(Dasthagiri), ఉమాశంకర్‌రెడ్డి సహా కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసు సీబీఐ(CBI) విచారణ చేపట్టగా తెలిసిన వారి పనేనని తేలింది. నిందితులుగా చేర్చి. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తో పాటు, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి కీలక సీబీఐ విచారించింది.

ఈ కేసులో కీలక నిందితుడు దస్తగిరి సీబీఐ(CBI) అప్రూవర్‌గా మారి సాక్ష్యమిచ్చారు. తమకు డబ్బు ఆశ చూపి భాస్కర్‌రెడ్డితోపాటు, అవినాష్‌రెడ్డి కీలక అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఈ హత్య చేయించినట్లు విచారణలో అంగీకరించారు. సీబీఐ 2021 సెప్టెంబర్ 17న హైదరబాద్‌లో శివశంకర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించింది. అనంతరం ఆయన రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అప్పటి నుంచి బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ... నిందితులు బయట ఉంటే సాక్ష్యులను బెదిరించే అవకాశం ఉందన్న సీబీఐ వాదనతో కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. మరోసారి శివ శంకర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవడంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి సోమవారం సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌లో హాజరుకావాలని స్పష్టం చేసింది. సీబీఐ కోర్టులో ట్రయిల్‌ జరిగేటప్పుడు ఏపీలో ఉండకూడదని హైకోర్టు షరతు విధించింది. అలాగే ఆయన పాస్‌పోర్టును కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. వీటన్నింటికీ శివశంకర్‌రెడ్డి అంగీకరించడంతో తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలై శివశంకర్‌రెడ్డి పులవెందులకు వెళ్లనున్నారు.

ఎన్నికలకు ముందు బెయిల్
సరిగ్గా ఎన్నికల ముందు శివశంకర్‌రెడ్డికి బెయిల్ మంజూరుకావడంపై ఈ కేసులో కీలక సాక్షులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు కడప జైలులో ఉండగా తనను బెదిరించాడని సీబీఐ అఫ్రూవర్‌గా మారిన దస్తగిరి ఆరోపించారు. రూ.20 కోట్లు ఇస్తామని ఆశ చూపారన్నారు. సీబీఐ తనను కొట్టి బలవంతంగా అబద్ధపు సాక్ష్యం చెప్పించిందని చెప్పాలని ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు బెదిరింపులకు పాల్పడినట్లు దస్తగిరి ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితమే దస్తగిరి తండ్రిపై దాడి జరిగింది. ఇదంతా తమను మట్టుబెట్టేందుకు జరుగుతున్న కుట్రేనని దస్తగిరి ఆరోపించారు. ఈ కేసులో కీలక నిందితులు బయట ఉంటే ప్రమాదమని రెండు క్రితం ఆయన ఆరోపించారు. తన తండ్రిపై జరిగిన దాడి..తనను చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని దీనిపై సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని ఆయన చెప్పిన మరుసటి రోజే ఈ కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి బెయిల్ రావడం విశేషం.

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget