అన్వేషించండి

Kurnool News: స్కూల్ టాయిలెట్‌లో మద్యం సీసాలు - సమాచారం ఇచ్చారని విద్యార్థులపై టీచర్ దాడి, కర్నూలు జిల్లాలో ఘటన

Andhra News: కర్నూలు జిల్లా హొళగుంద మండలంలోని స్కూల్‌లో టాయిలెట్‌లో మద్యం సీసాలు గుర్తించిన విద్యార్థులు ఉపాధ్యాయుడికి చెప్పగా ఆయన వారిని చితకబాదాడు.

Drunken Teacher Beats Up Students In Kurnool District: కర్నూలు జిల్లాలో (Kurnool District) దారుణం జరిగింది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే దారి తప్పాడు. మద్యం మత్తులో వారిని చితకబాదాడు. ఈ విషయం మంత్రి లోకేశ్ దృష్టికి వెళ్లగా.. ఆయన ఆదేశాలతో ఉన్నతాధికారులు సదరు టీచర్‌ను సస్పెండ్ చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. హొళగుంద మండలం ముద్దటమాగి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 160 మంది విద్యార్థులు చదువుతుండగా.. జయరాజు అనే టీచర్ ఏకోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. పాఠశాల టాయిలెట్‌లో మద్యం సీసాలను గుర్తించిన విద్యార్థులు.. టీచర్‌కు చెప్పగా ఆయన ఆగ్రహంతో ఊగిపోయాడు. విద్యార్థులను ప్లాస్టిక్ పైప్‌తో చితకబాదాడు.

తల్లిదండ్రుల ఆందోళన

ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎంఈవో పాఠశాల వద్దకు చేరుకుని తల్లిదండ్రులను కలిసి మాట్లాడారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుడు నిత్యం మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నారని ఎంఈవో వద్ద విద్యార్థులు వాపోయారు.

స్పందించిన మంత్రి లోకేశ్

అటు, ఈ ఘటనపై మంత్రి లోకేశ్ స్పందించారు. మద్యం మత్తులో ఉపాధ్యాయుడు విద్యార్థులను చితకబాదాడన్న వార్త తనను తీవ్ర విస్మయానికి గురి చేసిందన్నారు. సదరు టీచర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా విద్యా శాఖ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మంత్రి ఆదేశాల మేరకు ఉపాధ్యాయున్ని సస్పెండ్ చేస్తూ డీఈవో ఆదేశాలిచ్చారు.

విద్యార్థుల కిడ్నాప్

మరోవైపు, ఇదే కర్నూలు జిల్లాలో విద్యార్థుల కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. సి.బెళగల్‌లోని గురుకుల పాఠశాలలో విద్యార్థులను దుండగులు అపహరించారు. భోజన విరామ సమయంలో బయట ఆడుకుంటున్న 6, 7 తరగతి విద్యార్థులు సూర్యతేజ, నవీన్‌ను కిడ్నాప్ చేశారు. జీపులో వచ్చి వీరిని అపహరించినట్లు స్థానికులు తెలపగా.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కిడ్నాప్ అయిన ఇద్దరు విద్యార్థులూ బంధువులేనని.. కుటుంబ కలహాలతోనే వీరిని అపహరించి ఉండొచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం తీవ్ర గాలింపు చేపట్టి.. ఎమ్మిగనూరులో వీరిని గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు.

Also Read: Amazon Pawan Kalyan: అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Hyderabad Crime News: కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget