News
News
వీడియోలు ఆటలు
X

Chain Snatchers: చైన్ స్నాచర్స్ అరాచకం,మహిళను రోడ్డుపై లాక్కెళ్తూ చోరీకి యత్నం

Chain Snatchers: కోయంబత్తూర్‌లో చైన్ స్నాచర్లు మహిళను రోడ్డుపై లాక్కెళ్లిన ఘటన సంచలనం సృష్టించింది.

FOLLOW US: 
Share:

Chain Snatchers: 

కోయంబత్తూర్‌ 

చైన్ స్నాచింగ్‌ కేసులు పోలీసులకు సవాలు విసురుతున్నాయి. కొన్ని ముఠాలను పట్టుకుంటున్నా...మళ్లీ ఎక్కడి నుంచో కొత్త ముఠాలు పుట్టుకొచ్చి చైన్ స్నాచింగ్‌కి పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో కొందరు బాధితులు హత్యకూ గురవుతున్నారు. మరి కొందరు తీవ్ర గాయాల పాలవుతున్నారు. చెన్నైలోని కోయంబత్తూర్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. 33 ఏళ్ల మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కార్‌లో వచ్చిన నిందితులు ఉన్నట్టుండి ఆమె గొలుసుని లాగేశారు. అది తెగేంత వరకూ ఆమెను అలా రోడ్డుపైనే లాక్కుంటూ తీసుకెళ్లారు. అయినా..వాళ్లతో పెనుగులాడి చైన్‌ కొట్టేయకుండా పోరాటం చేసింది బాధితురాలు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వెంటనే విచారణ చేపట్టి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. రోడ్డుపై నడిచి వస్తుండగా...కార్‌లో వచ్చిన నిందితులు కాస్త స్లో చేసి విండో మిర్రర్ కిందకు దించారు. చేతులు బయట పెట్టి ఠక్కున ఆమె చైన్‌పై చేయి వేసి లాగారు. కార్‌తో పాటు ఆమెని కొంత దూరం వరకూ లాక్కెళ్లి ఓ చోట ఆపారు. చైన్‌ చేతుల్లోకి రాకపోవటం వల్ల అక్కడి నుంచి వెంటనే పరారయ్యారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఫుటేజ్ ఆధారంగా కార్‌ నంబర్‌ని నోట్ చేసుకున్న పోలీసులు...ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.  ఈ నిందితులపై గతంలోనూ చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. వీరిలో ఒకరు ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నారు. 

Published at : 17 May 2023 03:03 PM (IST) Tags: Tamil Nadu Coimbatore Chain Snatchers Chain Snatching Drags Woman

సంబంధిత కథనాలు

Delhi murder:  ఢిల్లీలో నడిరోడ్డుపై అందరూ చూస్తూండగానే బాలిక హత్య -  నిందితుడు అరెస్ట్ !

Delhi murder: ఢిల్లీలో నడిరోడ్డుపై అందరూ చూస్తూండగానే బాలిక హత్య - నిందితుడు అరెస్ట్ !

Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !

Andhra News  :  జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం  !

Gang Arrest : ఐటీ అధికారుల పేరుతో బంగారం దోపిడీ - గ్యాంగ్ ను పట్టుకున్న పోలీసులు ! ఈ స్కెచ్ మమూలుగా లేదుగా

Gang Arrest :   ఐటీ అధికారుల పేరుతో బంగారం దోపిడీ - గ్యాంగ్ ను పట్టుకున్న పోలీసులు !  ఈ స్కెచ్ మమూలుగా లేదుగా

Kurnool News: కుమారులు అంటే భయం- భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించిన భార్య

Kurnool News: కుమారులు అంటే భయం- భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించిన భార్య

Loan Apps Scam: పేటీఎం ద్వారా డబ్బులు పంపి, మహిళకు చుక్కలు చూపిస్తున్న ఆగంతకులు!

Loan Apps Scam: పేటీఎం ద్వారా డబ్బులు పంపి, మహిళకు చుక్కలు చూపిస్తున్న ఆగంతకులు!

టాప్ స్టోరీస్

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

Jogi Ramesh: డర్టీ బాబు, టిష్యూ మేనిఫెస్టో - మంత్రి వ్యాఖ్యలు, చించేసి చెత్తబుట్టలో వేసి మరీ

Jogi Ramesh: డర్టీ బాబు, టిష్యూ మేనిఫెస్టో - మంత్రి వ్యాఖ్యలు, చించేసి చెత్తబుట్టలో వేసి మరీ

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి

Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి