Rape on Old Woman: 99 ఏళ్ల వృద్ధురాలిపై కేర్ టేకర్ రేప్.. సీసీటీవీలో రికార్డు, ఫుటేజీ చూసి భయపడిపోయిన ఫ్యామిలీ
డిమెన్షియా అనే వ్యాధితో బాధపడుతున్న 99 ఏళ్ల ఓ వృద్ధురాలు బ్లాక్ పూల్ కేర్ హోమ్స్‌లో ఉంటోంది. ఆమెను ఎప్పుడూ కనిపెట్టుకొని ఉండాలని కుటుంబ సభ్యులు కేర్ హోమ్స్ వారికి సూచించి వెళ్లారు.
99 ఏళ్ల ఓ వృద్ధురాలిపై ఆమె సంరక్షకుడు అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఉండే గదిలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఫుటేజీని చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయపడిపోయారు. డిమెన్షియా అనే వ్యాధితో బాధపడుతున్న 99 ఏళ్ల ఓ వృద్ధురాలు యూకేలోని బ్లాక్ పూల్ కేర్ హోమ్స్‌లో ఉంటోంది. ఆమెకు మెమరీ లాస్ వంటి లక్షణాలు ఉండడం వల్ల ఎప్పుడూ కనిపెట్టుకొని ఉండాలని కుటుంబ సభ్యులు కేర్ హోమ్స్ వారికి సూచించి వెళ్లారు. దీంతో వారు ఓ కేర్ టేకర్‌ను నియమించారు. అంతేకాక, ఆ వృద్ధురాలి గదిలో సీసీటీవీ కెమెరాను కూడా అమర్చారు. ఇలా ఉండగా అక్కడే ఉండే 48 ఏళ్ల ఫిలిప్ కేరీ అనే ఓ కేర్ టేకర్ ఆ మానసిక రుగ్మతతో బాధపడుతున్న వృద్ధురాలిపై అత్యాచారం చేశారు. ఈ కేసులో కెమెరా ఫుటేజీతో పాటు, ఫోరెన్సిక్ ఆధారాలు అన్నీ కోర్టులో సమర్పించారు. మెంటల్ డిసోర్డర్ ఉన్న 99 ఏళ్ల వ్యక్తిపై తాను చేసిన నేరాన్ని కూడా ప్రిస్టన్ క్రోన్ కోర్టులో ఫిలిప్ కేరీ అంగీకరించాడు. దీంతో కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది.
ఆ తర్వాత బాధితురాలైన వృద్ధురాలి కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ బామ్మ అత్యంత భయంకర రీతిలో కేర్ టేకర్ చేతిలోనే అత్యాచారానికి గురైందని వాపోయారు. ‘‘ఆమె ప్రవర్తన మారిందని మేం గమనించాం, గతంలో మా ఇంట్లో ఉండగా.. ఆమె ఎప్పుడూ మమ్మల్ని కౌగిలించుకోదు లేదా ప్రేమగా ముద్దాడలేదు. మేం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాతో పాటు రావడం ఆమెకు ఇష్టం లేదు. అంతేకాక, కొన్ని సందర్భాల్లో ఆమె ఆందోళన కలిగించే విషయాలను మాతో చెప్పింది. తాను శిక్షింపబడాలని అంటూ ఉండేది. కేర్ హోమ్స్‌లో ఎవరైనా ఆమెతో దురుసుగా ప్రవర్తించే అవకాశం ఉంది కాబట్టి.. గదిలో ఓ సీసీటీవీ కెమెరాను అమర్చాం. దాంతో ఆమె ఏం చేస్తుందో మేం చూడగలిగేవాళ్లం. కానీ, రేప్ జరిగిన ఘటన మేం ఊహించనిది. అంతేకాకుండా ఎంతో భయంకరంగా ఉంది.
‘‘మేం వెంటనే పోలీసులకు ఫోన్ చేశాం. సీసీటీవీ కెమెరాలో జరిగిన ఈ ఘటన మొత్తం మా ఫ్యామిలీని ఎంతగానో బాధపెట్టింది. ఏం జరిగిందో తెలుసుకోవడానికి చేస్తున్న మా ప్రయత్నాలతో మా జీవితాలు మారిపోయాయి. ఇంట్లో పెద్దవారు ఉన్న వాళ్లకి మేం చెప్పేది ఒకటే.. వారు చెప్పేది వినాలి. వారిలో ప్రవర్తన మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. వారిని కనిపెట్టుకొని ఉండాలి’’ అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
‘‘ఈ కేసు విచారణలో పోలీసులు చూపిన చొరవ మరువలేనిది. దోషి అయిన ఫిలిప్ కేరీకి జీవిత ఖైదు పడడం స్వాగతించాల్సిన అంశం. అతను బయట ఉంటే ఇలాంటి ఘోరాలు మరిన్ని జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుత కోర్టు తీర్పుతో బాధిత కుటుంబానికి కొంత వరకూ న్యాయం జరిగింది. దోషిగా తేలిన వ్యక్తి కేర్ హోమ్స్‌లో తన నమ్మకాన్ని వమ్ము చేశాడు. ఆ నమ్మకం అనే దాన్ని ఎరగా వేసి 99 ఏళ్ల వ్యక్తిపై పైశాచికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. విచారణ, కోర్టులో కేసు వాదనల సమయంలో అంతటా న్యాయం కోసం పోరాడిన బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని మేం అభినందిస్తున్నాం.’’ అని అడ్వకేట్ అన్నారు.