News
News
X

Tadepalligudem News : తాడేపల్లిగూడెంలో ఘోర ప్రమాదం, బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు, నలుగురు మృతి!

Tadepalligudem News : పశ్చిమగోదావరి జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

FOLLOW US: 
 
Tadepalligudem News : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కడియద్దలో బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నాయి.  ప్రమాదం సంభవించినప్పుడు బాణాసంచా కర్మాగారంలో 10 మంది ఉన్నట్లు తెలుస్తోంది.  మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ బాణాసంచా కర్మాగారం అన్నవరం అనే వ్యక్తికి చెందినది పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. సుమారు 5 సంవత్సరాల నుంచి కడియద్ద గ్రామంలో అన్నవరం అనే వ్యక్తి  బాణాసంచా తయారుచేస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.    ఇలాంటి బాణా సంచా తయారీ ప్రాంతాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని తాడేపల్లిగూడెం ప్రజలు వాపోతున్నారు. ఈ పేలుడు ధాటికి తాడేపల్లిగూడెం పట్టణం వరకూ భూమి కంపించిందని స్థానికులు అంటున్నారు. 

హోంమంత్రి దిగ్భ్రాంతి 

తాడేపల్లిగూడెం అగ్ని ప్రమాద ఘటనాస్థలిని మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. బాధితులకు సాయం అందిస్తామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారాన్ని సీఎం జగన్ ప్రకటించారని తెలిపారు. తాడేపల్లిగూడెం అగ్నిప్రమాద ఘటనపై  హోంమంత్రి తానేటి వనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.  పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ముమ్మర సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన హోంమంత్రి... గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.  

కరెంటు తీగలు తగిలి హార్వెస్టర్ దగ్ధం

News Reels

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావు పేట గ్రామంలో ఓ రైతు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. కురుమపల్లికి చెందిన గంటల రాజు అనే వ్యక్తి హార్వెస్టర్ తో వరి కోత ముగించుకొని తిరిగి వస్తుండగా  కరెంటు తీగలు తగలడంతో అక్కడికక్కడే కాలిపోయింది. అయితే అప్రమత్తమైన యువకుడు సకాలంలో స్పందించి కిందకి దూకేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. హార్వెస్టర్ పూర్తిగా దగ్ధమైంది.

తమిళనాడులో ఘోర ప్రమాదం 

 తమిళనాడులో భారీ ప్రమాదం జరిగింది. మధురై జిల్లాలో ఓ ప్రైవేట్ బాణసంచా ఫ్యాక్టరీలో గురువారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి.  ఉసిలంబట్టి సమీపంలో బాణసంచా ఫ్యాక్టరీ ఉంది. ఇందులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 10 మందికి గాయాలైనట్లు మదురై ఎస్పీ ధ్రువీకరించారు. పేలుడులో గాయపడిన 10 మందిని జిల్లాలోని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను అమ్మవాసి, వల్లరసు, గోపి, వికీ, ప్రేమగా గుర్తించారు. ఈ బాణసంచా కర్మాగారం వలైయప్పన్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రాథమిక విచారణ అనంతరం బాణాసంచా ఫ్యాక్టరీ యజమాని వలైయప్పన్ అని పోలీసులు గుర్తించారు. తదుపరి విచారణ జరుగుతోంది.

Published at : 10 Nov 2022 09:07 PM (IST) Tags: AP News Tadepalligudem Fire Accident Fire works

సంబంధిత కథనాలు

Dating App Cheating: డేటింగ్‌ యాప్స్‌లో కొత్త రకం మోసాలు, కిడ్నాప్‌ అవుతున్న యువకులు, ఉద్యోగులు!

Dating App Cheating: డేటింగ్‌ యాప్స్‌లో కొత్త రకం మోసాలు, కిడ్నాప్‌ అవుతున్న యువకులు, ఉద్యోగులు!

Nuzvid Police Station : నూజివీడు పోలీస్ స్టేషన్ పై మహిళలు దాడి, భారీగా పోలీసుల మోహరింపు!

Nuzvid Police Station : నూజివీడు పోలీస్ స్టేషన్ పై మహిళలు దాడి, భారీగా పోలీసుల మోహరింపు!

Ludo Game Woman Bets Self : లూడో గేమ్ లో తనను తాను పందెంగా కాసిన మహిళ, ఓడిపోయి ఓనర్ కు వశమైంది!

Ludo Game Woman Bets Self : లూడో గేమ్ లో తనను తాను పందెంగా కాసిన మహిళ, ఓడిపోయి ఓనర్ కు వశమైంది!

Men Suicide Cases: పెళ్లి కావడం లేదని యువకుల ఆత్మహత్యలు! తెలుగు రాష్ట్రాల్లోనే సూసైడ్‌లు ఎక్కువ, కానీ ఎందుకిలా?

Men Suicide Cases: పెళ్లి కావడం లేదని యువకుల ఆత్మహత్యలు! తెలుగు రాష్ట్రాల్లోనే సూసైడ్‌లు ఎక్కువ, కానీ ఎందుకిలా?

Kamareddy News: కామారెడ్డి జిల్లాలో దారుణం - సెల్ టవర్ ఎక్కి మరీ రైతు ఆత్మహత్య

Kamareddy News: కామారెడ్డి జిల్లాలో దారుణం - సెల్ టవర్ ఎక్కి మరీ రైతు ఆత్మహత్య

టాప్ స్టోరీస్

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?