అన్వేషించండి

Strange Thief: 'మీకు దండం బాబూ ఒక్క రూపాయీ లేదు' - సీసీ కెమెరా ముందు దొంగ సైగలు, పెర్ఫార్మెన్స్ అదుర్స్

Rangareddy News: ఓ దొంగ పక్కా ప్లాన్‌తో ఓ హోటల్‌లో చోరీకి వెళ్లాడు. అయితే, అక్కడ ఒక్క రూపాయి కూడా దొరక్క సీసీ కెమెరాల ముందు విచిత్రంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Strange Thief Expressions Infront Of Cameras In Maheswaram: ఓ వ్యక్తి హోటల్‌లో చోరీ చేసేందుకు పక్కా ప్లాన్‌తో సిద్ధమయ్యాడు. పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరక్కూడదనే ఉద్దేశంతో ముఖానికి మంకీ క్యాప్, చేతులకు గ్లౌజ్ ధరించి మొత్తానికి స్పాట్ వద్దకు చేరుకున్నాడు. సీరియస్‌గా చాకచక్యంగా తాళం పగలగొట్టిన దొంగ చాలాసేపు అక్కడ వెతికినా ఒక్క రూపాయి కూడా దొరకలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురై సీసీ కెమెరా ముందు విచిత్రమైన హావభావాలు ప్రదర్శించాడు. రంగారెడ్డి (Rangareddy) జిల్లా మహేశ్వరంలో (Maheswaram) ఈ ఘటన జరగ్గా.. సదరు దొంగ సీసీ కెమెరాల ముందు చేసిన  ఫెర్మార్మెన్స్ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

విచిత్ర రిక్వెస్ట్
Strange Thief: 'మీకు దండం బాబూ ఒక్క రూపాయీ లేదు' - సీసీ కెమెరా ముందు దొంగ సైగలు, పెర్ఫార్మెన్స్ అదుర్స్
Strange Thief: 'మీకు దండం బాబూ ఒక్క రూపాయీ లేదు' - సీసీ కెమెరా ముందు దొంగ సైగలు, పెర్ఫార్మెన్స్ అదుర్స్

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఎమ్మార్వో ఆఫీస్ ముందున్న ఓ హోటల్‌లో దొంగ చోరీ చేసేందుకు ముఖానికి మంకీ క్యాప్, చేతులకు గ్లౌజులతో సిద్ధమయ్యాడు. పకడ్బందీగా స్పాట్‌కు వెళ్లి పని కానిచ్చేద్దాం అనుకున్నాడు. తీరా తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి చాలాసేపు వెతికినా కనీసం ఒక్క రూపాయి కూడా దొరకలేదు. తీవ్ర నిరాశకు గురైన సదరు దొంగ సీసీ కెమెరాల ముందు విచిత్రంగా పెర్ఫార్మెన్స్ చేశాడు. 'ఏం సామీ మీకు దండం. ఒక్క రూపాయి కూడా దొరకలేదు. ఇంటికి వెళ్లేటప్పుడు హోటల్ యజమాని ఓ పదో పరకో పెట్టి వెళ్లకపోతే ఎలా.?' అన్న రీతిలో కెమెరాల ముందు హావభావాలు ప్రదర్శించాడు. అంతే కాకుండా ఫ్రిడ్జ్‌లో వాటర్ బాటిల్ తీస్తూ.. 'ఇది తప్ప ఇంకే దొరకలేదు' అన్న రీతిలో కెమెరా ముందు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. మళ్లీ తిరిగి వచ్చి టేబుల్‌పై రూ.20 పెట్టి 'ఇదుగో వాటర్ బాటిల్ డబ్బులు కూడా పెట్టి వెళ్లిపోతున్నా'  అంటూ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. సినిమాల్లో కమెడియన్లను మించిన పెర్ఫార్మెన్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ తెగ నవ్వుకుంటున్నారు.

Also Read: Telangana ACB Raids: తెలంగాణలో ఏసీబీ దాడులు - లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇద్దరు అధికారులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
Embed widget