Srikalahasti News: 13ఏళ్ల బాలికపై నలుగురు యువకుల అత్యాచారం! తరచూ అదే పని, గర్భం దాల్చిన బాధితురాలు
AP News: బాలిక చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడంతో అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుతోంది. ఈ బాలిక పేదరికాన్ని ఆవకాశంగా తీసుకున్న నలుగురు యువకులు ఆమెపై తరచూ అత్యాచారం చేస్తూ వచ్చారు.
Latest News in Telugu: శ్రీకాళహస్తిలో 13ఏళ్ల బాలికపై నలుగురు కామాంధులు తరచూ అత్యాచారం చేయడంతో... ఆమె గర్భవతి అయిన సంఘటన శ్రీకాళహస్తిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనపై శ్రీకాళహస్తి రెండవ పట్టణ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. దీంతో నిందితులు పరారీ అయ్యారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని బహదూర్ పేటకు చెందిన మైనర్ బాలిక చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో అమ్మమ్మ ఇంట్లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతోంది. అయితే బాలిక పేదరికాన్ని, కుటుంబ పరిస్థితులను ఆవకాశంగా తీసుకున్న నలుగురు యువకులు ఆమెపై తరచూ అత్యాచారం చేస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలో బాలికపై అత్యాచార విషయం ఇటీవల వెలుగులోకి రాగా అక్కడి పెద్దలు యువకులను మందలించి రాజీ చేశారు. అయితే బాలిక గర్భవతి అయిందన్న సంగతి తెలుసుకున్న అమ్మమ్మ గురువారం రాత్రి శ్రీకాళహస్తి టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు మధు, సునీల్, చంద్రతో పాటు తిరుపతికి చెందిన మరో యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆమెను తిరుపతి రుయాకు వైద్యులు రెఫర్ చేశారు.