Srikakulam Trian Accident : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం, కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఢీకొని ఐదుగురి మృతి
Srikakulam Trian Accident : శ్రీకాకుళుం జిల్లా జి.సిగడాం-చీపురుపల్లి మధ్య ఘోర రైలు ప్రమాదం జరిగింది. ట్రాక్ దాటుతున్న ప్రయాణికుల మీదుకు కోణార్క్ ఎక్స్ ప్రెస్ దూసుకురావడంతో ఐదుగురు మృతి చెందారు.
At least 5 run over by Konark Express in Srikakulam: శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు చైన్ లాగడంతో గౌహతి ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ట్రాక్ పై దిగారు. కొందరు ప్రయాణికులు పట్టాలు దాటుతున్న సమయంలో విశాఖ నుంచి వస్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. జి.సిగడాం-చీపురుపల్లి మధ్య జరిగిన రైలు ప్రమాదంపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తక్షణమే స్పందించారు. ఆర్.డి.ఓ, తహశీల్దార్ ను ప్రమాద స్థలానికి హుటాహుటిన వెళ్లాలని ఆదేశించారు. అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య సిబ్బందిని కూడా కలెక్టర్ అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. అంబులెన్స్ ను ప్రమాద స్థలానికి పంపినట్లు తెలిస్తోంది. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అసలేం జరిగిందంటే.. (Konark Express Accident)
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా సిగడాం, విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలాల మధ్య బాతువ సమీపంలో సోమవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఐదుగురు ప్రయాణికులను ఢీకొట్టడంతో అక్కడి కక్కడే దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు నుంచి సిల్చెర్ వెళ్తున్న గువాహటి ఎక్స్‌ప్రెస్ చీపురు పల్లి దాటిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు చైన్ లాగి రైలు ఆపేశారు. కొందరు కిందకు దిగి పట్టాలపై నిల్చున్నారు. ఇదే సమయంలో భువనేశ్వర్ నుంచి విశాఖ వైపు వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ వేగంగా దూసుకొచ్చి పట్టాలపై ఉన్న ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ఘటనలో మృతుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
రంగంలోకి దిగిన అధికారులు, సిబ్బంది
మృతుల్లో ఇద్దరు అస్సాంకు చెందినవారుగా గుర్తించారు. మిగిలిన వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. గాయపడిన వ్యక్తిని శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తు న్నారు. ఇతను ఒడిశా రాష్ట్రంలోని బ్రహ్మపుర ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆ ప్రాంతమంతా చిమ్మచీకటిగా ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. రైల్వే, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తు న్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లర్కర్ సహాయక చర్యల్లో పాల్గొనాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
Also Read: Nellore News: పోలీసులకు "దిశ" దశ లేదా? యూనిఫామ్‌తో రోడ్డెక్కిన కానిస్టేబుల్
Also Read: Jharkhand Ropeway Accident: రోప్‌వేలో కేబుల్ కార్లు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి- చిక్కుకుపోయిన 42 మంది