Tekkali SI Dance : టెక్కలి ఎస్సై కృష్ణ లీలలు, పోలీస్ స్టేషన్ ముందే యువతులతో అశ్లీల నృత్యాలు!
Tekkali SI Dance : టెక్కలి ఎస్సై హరికృష్ణ యువతులతో కలిసి అశ్లీల నృత్యాలు చేశారు. ఎమ్మెల్సీ పుట్టిన రోజు వేడుకలను టెక్కలి పీఎస్ ఎదురుగా ఉన్న స్థలంలో నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎస్సై రెచ్చిపోయారు.
![Tekkali SI Dance : టెక్కలి ఎస్సై కృష్ణ లీలలు, పోలీస్ స్టేషన్ ముందే యువతులతో అశ్లీల నృత్యాలు! Srikakulam Tekkali SI Hari krishna obscene dance with women infront of Police station DNN Tekkali SI Dance : టెక్కలి ఎస్సై కృష్ణ లీలలు, పోలీస్ స్టేషన్ ముందే యువతులతో అశ్లీల నృత్యాలు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/05/02f654b208a29c46adb3bb4bd53cb3531667657242727235_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tekkali SI Dance : శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎస్సై హరికృష్ణ స్వామి భక్తి చాటుకున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జన్మది వేడుకల్లో భాగంగా యువతులతో అశ్లీల నృత్యాలు ఏర్పాటుచేశారు. ఇటువంటి కార్యక్రమాల్ని ఆపాల్సిన ఎస్సై ఒళ్లు మైమరిచి యువతులతో కలిసి డ్యాన్స్ లు చేశారు. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల్ని అదుపుచేయాల్సిన పోలీసు అధికారి ఇలా అశ్లీల నృత్యాలు చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారం అంతా టెక్కలి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలంలోనే జరగడం గమనార్హం.
In Tekkali town of Srikakulam Dist, an overjoyed Police SI shakes a leg with dancers. The occasion was the birthday celebration of #YSRCP MLC Duvvada Srinivas. The party lasted till Friday late night. #AndhraPradesh pic.twitter.com/EnAhRCKCT6
— Ashish (@KP_Aashish) November 5, 2022
పోలీస్ స్టేషన్ ఎదురుగానే
టెక్కలి ఎస్సై హరికృష్ణకృష్ణలీలలు చూపారు. ఎమ్మెల్సీ పుట్టినరోజు వేడుకల్లో ఒళ్లు మరచి నృత్యాలు చేశారు. ఇలాంటి అశ్లీల డ్యాన్సులను అదుపు చేయ్యాల్సిన పోలీస్ అధికారి మైమరిచి యువతులతో అశ్లీల నృత్యాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ వ్యవహారం అంతా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జన్మదిన వేడుకల్లో భాగంగా జరిగినట్లు తెలుస్తోంది. టెక్కలి వెంకటేశ్వర కాలనీలో పోలీస్ స్టేషన్ ఎదురుగా అమ్మాయిలతో అర్ధనగ్న నృత్యాలు చేస్తుంటే ఆపాల్సిన టెక్కలి ఎస్సై వారితో జత కలిసి స్వామి భక్తి చాటుకున్నారు. యువతులతో కలిసి ఒళ్లు మరిచి స్టెప్పులేశారు. అధికారం ఆడవారితో అశ్లీల నృత్యాలు చేయించుకోవడానికా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పట్టణ నడిబొడ్డున అర్ధరాత్రి వరకు సాగిన ఈ వికృత చేష్టలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
సీఐ రాసలీలలు
హైదరాబాద్ లో మరో సీఐ రాసలీలలు వెలుగుచూశాయి. హైదరాబాద్ సౌత్ జోన్ కంట్రోల్ రూమ్ లో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రాజు అక్రమ సంబంధాన్ని భార్య గుట్టు రట్టు చేసింది. గుర్రం గూడ సమీపంలో చెట్ల పొదల్లో అర్ధరాత్రి కారులో ఏకాంతంగా ఉన్న సమయంలో భార్య అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో కొన్ని సీఐను ఆయన భార్య ఫాలో అవుతోంది. గురువారం అర్ధరాత్రి సీఐను పిల్లలతో సహా ఫాలో అయిన ఆయన భార్య మరో మహిళతో ఏకాంతం ఉన్న సమయంలో పట్టుకుంది. చెట్లపొదల్లో పిల్లల అరుపులు వినపడడంతో అటుగా వెళ్తోన్న పెట్రోలింగ్ పోలీసులు సీఐ వద్దకు వెళ్లారు. అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా అతడు కానిస్టేబుల్ , హోంగార్డుపై దాడికి పాల్పడ్డాడు. సీఐ దాడిలో గాయపడిన కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీఐను అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో పాటు సీఐను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2002 బ్యాచ్ కి చెందిన రాజు అనే ఇన్స్పెక్టర్ ని అరెస్ట్ చేసినట్లు వనస్థలిపురం పోలీసులు తెలిపారు. రాజు ఇన్స్పెక్టర్ సొంత ఊరు కందుకూరు మండలం బేగంపేట గ్రామం. ఇన్స్పెక్టర్ రాజుకి ఒక భార్య పాప, బాబు ఉన్నారు. మద్యం మత్తులో పోలీసులపై దాడికి పాల్పడిన రాజును పోలీసులు అరెస్టు చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)