అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Siddipet Gun Fire: సిద్ధిపేట కాల్పుల కలకలం... నిందితుల్ని 24 గంటల్లో పట్టుకుంటామని సీపీ శ్వేత ప్రకటన

సిద్ధిపేట కాల్పుల కేసును 24 గంటల్లో ఛేదిస్తామని సీపీ శ్వేత అన్నారు. సిద్ధిపేట రిజిస్ట్రేషన్ ఆఫీసు వద్ద కాల్పులు జరిపి ఇద్దరు నిందితులు రూ.43 లక్షలతో పరారయ్యారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన సిద్ధిపేట కాల్పుల కేసును 24 గంటల్లో ఛేదిస్తామని సిద్దిపేట సీపీ శ్వేత ధీమా వ్యక్తం చేశారు. సిద్ధిపేట పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కాల్పులు జరిగిన ప్రదేశాన్ని సీపీ పరిశీలించారు. సీపీ శ్వేత మాట్లాడుతూ నిందితులను పట్టుకోవడానికి 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల పరిశీలిస్తున్నామని, నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద సోమవారం కాల్పులు జరిపి ఓ రియల్టర్ వద్ద భారీ మొత్తంలో నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. సిద్ధిపేటలోని ఓ ప్లాట్ విక్రయానికి చేర్యాలకు చెందిన రియల్టర్ నర్సయ్య, ఆయన డ్రైవర్ పర్శరాములు కారులో రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వచ్చారు. ప్లాట్ విక్కయించగా వచ్చిన రూ. 43 లక్షలు నర్సయ్య తీసుకొని డ్రైవర్‌కు ఇచ్చి కారులో పెట్టాడు. సంతకం చేయడానికి నర్సయ్య ఆఫీస్ లోపలికి వెళ్లగానే ఇద్దరు దుండగులు పల్సర్ బైక్‌పై వచ్చి ఇన్నోవా కారు అద్దాలు పగుల కొట్టి డ్రైవర్ పై కాల్పులు జరిపారు. మరో వ్యక్తి కారు ఉన్న రూ.43 లక్షల నగదు తీసుకుని పరారయ్యారు. నిందితులు గన్‌ను కారులోనే వదిలేశారు. పోలీసులు కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. 

అసలేం జరిగిందంటే....

సిద్దిపేటలో తుపాకీ కాల్పులు స్థానికుల్ని బెంబేలెత్తించాయి. సిద్దిపేట పట్టణంలోని రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో ఓ ఆగంతుకుడు జనాన్ని ఈ భయానికి గురి చేశాడు. అంతేకాదు, ఆ తుపాకీ కాల్పుల అనంతరం మరో వ్యక్తికి చెందిన భారీ సొత్తును ఎత్తుకుపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. తుపాకీ కాల్పులకు ఎవరు పాల్పడ్డారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలులోకి వస్తుండడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఆస్తుల కొనుగోలు దారులు ముందస్తుగానే తమ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే చేర్యాల ప్రాంతానికి చెందిన నర్సయ్య అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా తన ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం అక్కడికి వచ్చారు. సిద్దిపేటలోని ఓ ప్లాట్ లావాదేవీ కోసం నర్సయ్య, ఆయన డ్రైవర్ పర్శరాములు కారులో వచ్చారు. దాదాపు రూ.48.5 లక్షల నగదు వారి వద్ద ఉంది. ప్లాటు విక్రయించగా వచ్చిన డబ్బులు రూ.43 లక్షలు కొనుగోలు దారు నుంచి తీసుకొని డ్రైవర్‌కు ఇచ్చి కారులో పెట్టాలని నర్సయ్య చెప్పారు.

ఈ లోపు సంతకం చేయడానికి నర్సయ్య ఆఫీస్ లోపలికి వెళ్లాడు. ఇంతలో ఇద్దరు ఆగంతకులు పల్సర్ బైక్‌పై వచ్చి ఇన్నోవా కారు అద్దాలు పగుల కొట్టి డ్రైవర్ తొడపై గన్‌తో కాల్చారు. మరో వ్యక్తి కారు డోర్లు తీసి రూ.43 లక్షల నగదు తీసుకుని పారిపోయారు. కాగా.. నిందితులు గన్‌ను కారులోనే వదిలి పారిపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆగంతుకుల గురించి ఆరా తీస్తున్నారు. పూర్వం ప్లాటు క్రయ విక్రయాల్లో విభేదాలు వచ్చినవారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలో బాధితులను ప్రశ్నిస్తున్నారు.ఈ దుండగులు కారును ఫాలో అయి ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరు నంబ‌ర్ ప్లేటులేని బైక్‌పై వ‌చ్చారు. కారు అద్దాన్ని ప‌గుల‌గొట్టి.. డ్రైవ‌ర్ ప‌రుశురామ్ కాలిపై కాల్పులు జరిపాడు. మ‌రో వ్యక్తి అవ‌త‌లి వైపు నుంచి వ‌చ్చి న‌గ‌దు ఉన్న బ్యాగును అప‌హ‌రించారు. అనంత‌రం తుపాకీని అక్కడే వ‌దిలిపెట్టి బైక్‌పై పారిపోయారు. ఘ‌ట‌నాస్థలంలో బుల్లెట్లను, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. గాయ‌ప‌డ్డ డ్రైవ‌ర్‌ను చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి త‌ర‌లించారు. అయితే దుండ‌గులు కంట్రీమేడ్ గ‌న్‌తో కాల్పులు జ‌రిపిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు మూడు బృందాల‌ను పోలీసులు రంగంలోకి దింపారు.

Also Read:  పబ్బుల్లో డ్రగ్స్ తో పట్టుబడితే మీ వెనకాల ఎవరున్నా ఉపేక్షించం... సౌండ్స్ పరిమితికి లోబడే పెట్టాలి... మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget