Shivamogga Murder: బజరంగ్ దళ్ కార్యకర్త దారుణ హత్య- 'హిజాబ్' వేళ మరో ఘటన
కర్ణాటకలో ఓ బజరంగ్ దళ్ కార్యకర్తను కొంతమంది హత్య చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Karnataka: కర్ణాటక శివమొగ్గలో బజరంగ్ దళ్ (Bajrang Dal) కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతుడు 24 ఏళ్ల హర్షగా పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు 144 సెక్షన్ విధించినట్లు శివమొగ్గ డిప్యూటీ కమిషనర్ డా.సెల్వమణి తెలిపారు.
ఆగ్రహం
ఈ విషయం తెలిసిన వెంటనేే నిన్న రాత్రి కొంతమంది ఆ ప్రాంతంలోని వాహనాలకు నిప్పుపెట్టారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా రాష్ట్రంలో హిజాబ్ వివాదం నడుస్తుండటంతో దానికి ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Also Read: Covid Update: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 16 వేల కేసులు






















