అన్వేషించండి
Advertisement
దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం- వైఎస్‌ఆర్ జిల్లాలో ఏడుగురు మృతి
దేవుడిని దర్శించుకొని వద్దామనుకున్నారు కానీ దేవుని వద్దకే వెళ్లిపోతున్నామని అనుకోలేదు. వస్తున్న మార్గ మధ్యలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.
తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. వైఎస్‌ఆర్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన కొందరు, కర్ణాటకలోని బళ్లారికి చెందిన మరికొందరు మొత్తం 14 మంది తిరుమలేశుడి దర్శనానికి వెళ్లారు. దర్శనం చేసి తుఫాన్ వాహనంలో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
కడప తాడిపత్రి ప్రధాన రహదారిలో కొండాపూర్ మండలం ఏటూరు గ్రామానికి సమీపంలో ప్రమాం జరిగింది. బాధితులు ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో స్పాట్‌లోనే ఏడుగురు చనిపోయారు. గాయపడ్డ ఐదుగుర్ని స్థానికులు తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
న్యూస్
న్యూస్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion