News
News
వీడియోలు ఆటలు
X

Family Kidnap : అప్పు తీసుకున్నందుకు కుటుంబాన్నే కిడ్నాప్, గ్రామస్తుల ఎంట్రీతో సీన్ రివర్స్!

Family Kidnap : సత్యసాయి జిల్లాలోని ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. కారులో కుటుంబాన్ని బలవంతంగా తీసుకెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకోని పోలీసులకు సమాచారం అందించారు.

FOLLOW US: 
Share:

Family Kidnap : సత్యసాయి జిల్లాలోని సోమందేపల్లి గ్రామంలో ఓ కుటుంబాన్ని రాత్రి పూట  కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన సంఘటన కలకలం రేపింది. ధర్మవరం పట్టణంలో ఓ నిరుపేద కుటుంబం 90 వేల రూపాయలు అప్పు చేసి ఓ యజమాని దగ్గర పనికి కుదిరారు. కొన్ని అనివార్య కారణాలతో యజమానులకు చెప్పకుండా  ధర్మవరం నుంచి సోమందేపల్లి గ్రామానికి కుటుంబం మొత్తం చేరుకున్నారు. వీరి చిరునామాను కనుగొన్న యజమానులు కారులో అర్ధరాత్రి వచ్చి కుటుంబం మొత్తానికి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. ఇద్దరి మైనర్ అమ్మాయిలను కార్ లో కిడ్నాప్ చేసి వెళుతుండగా దీనిని గమనించిన స్థానికులు కారును అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారుతో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన అర్ధరాత్రి జరగడంతో పోలీసులు ఎటువంటి సమాచారాన్ని మీడియాకు అందించలేకపోయారు.

టీవీ రిపోర్టర్ కిడ్నాప్ 

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండల కేంద్రానికి చెందిన సుధాకర్(37) అనే వ్యక్తిని ఒంగోలులో కిడ్నాప్ చేసి బాపట్ల జిల్లా చెరుకుపల్లి గ్రామ శివారులోని ఓ గదిలో బంధించారు ఆగంతకులు.  బాధితుడు సుధాకర్ ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు చెందిన ఓ టీవీ రిపోర్టర్ గా పోలీసులు గుర్తించారు.  శనివారం సాయంత్రం రూము నుంచి తప్పించుకొన్న సుధాకర్ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మొత్తం 6 వ్యక్తులపై కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదుచేశామని చెరుకుపల్లి ఎస్ఐ కొండారెడ్డి  తెలిపారు. నిందితులు పారిపోతుండగా స్పెషల్ బ్రాంచి అధికారి ఆదినారాయణ చేజ్ చేసి పట్టుకున్నారు. 

యువతి కిడ్నాప్ 

హైదరాబాద్ నగరంలోని కొండపూర్ లో దారుణం చోటుచేసుకుంది. తన భర్తకు యవతితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ మహిళ యువతిని కిడ్నాప్ చేసి చిత్ర హింసలకు గురిచేసింది. బాధితురాలి ఫిర్యాదుతో వివాహితతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కొండాపూర్ కు చెందిన వివాహిత తన భర్తతో మరో యువతితో సంబంధం ఉందనే అనుమానంతో యువతిని కిడ్నాప్ చేయించిందని తెలుస్తోంది. యువతిని బంధించి నలుగురితో అత్యాచారయత్నం చేయించినట్టుగా బాధితురాలు ఆరోపించినట్టు ఫిర్యాదులో పేర్కొంది. తనను గదిలో బంధించి నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసినట్టుగా బాధితురాలు పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వివాహితతో పాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

Published at : 29 May 2022 03:01 PM (IST) Tags: AP News Crime News kidnap Satyasai district news family kidnap

సంబంధిత కథనాలు

Manipur Violence: మణిపూర్‌ అల్లర్లపై అమిత్‌షా కీలక ప్రకటన, విచారణకు స్పెషల్ కమిటీ

Manipur Violence: మణిపూర్‌ అల్లర్లపై అమిత్‌షా కీలక ప్రకటన, విచారణకు స్పెషల్ కమిటీ

Road Accident News : తెలుగు రాష్ట్రాలో ఘోర రోడ్డు ప్రమాదాలు - వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది మృతి!

Road Accident News : తెలుగు రాష్ట్రాలో ఘోర రోడ్డు ప్రమాదాలు - వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది మృతి!

Tamil Nadu Crime: అత్తను దారుణంగా హత్య చేసిన కోడలు, సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులు షాక్!

Tamil Nadu Crime: అత్తను దారుణంగా హత్య చేసిన కోడలు, సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులు షాక్!

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు

Nellore Tragedy: నెల్లూరులో విషాదం, పిల్లలను కాపాడి ఇద్దరు తల్లులు దుర్మరణం!

Nellore Tragedy: నెల్లూరులో విషాదం, పిల్లలను కాపాడి ఇద్దరు తల్లులు దుర్మరణం!

టాప్ స్టోరీస్

Telangana New Party : తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

Telangana New Party :  తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

విజయసాయి రెడ్డిపై బృహత్తర బాధ్యత- బాలినేనిని జగన్ పిలిచింది అందుకే!

విజయసాయి రెడ్డిపై బృహత్తర బాధ్యత- బాలినేనిని జగన్ పిలిచింది అందుకే!

Rahul US Visit: హలో మిస్టర్ మోడీ, ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ కౌంటర్

Rahul US Visit: హలో మిస్టర్ మోడీ, ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ కౌంటర్

కేశినేని నానీ, ఏందయ్యా నీ బిల్డప్‌, సోది ఆపు: పీవీపీ

కేశినేని నానీ, ఏందయ్యా నీ బిల్డప్‌, సోది ఆపు: పీవీపీ