అన్వేషించండి

Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం - లారీ బోల్తా పడి 9 మంది మృతి! మంత్రి దిగ్భ్రాంతి

అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందారు. మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది.

Annamayya Road Accident | రాయచోటి: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది మృతిచెందగా, మరికొందరు కూలీలు గాయపడ్డారు.

రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్ కు మామిడికాయల లోడుతో లారీ వెళ్తోంది. ఈ క్రమంలో రెడ్డిపల్లి చెరువు కట్టపై లారీ అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో 16 మంది వరకు మామిడికాయలు కోసే కూలీలు ఉన్నారు. జేసీబీ సాయంతో లారీ కింద చిక్కుకుపోయిన కూలీలను బయటకు తీశారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.


Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం - లారీ బోల్తా పడి 9 మంది మృతి! మంత్రి దిగ్భ్రాంతి

 పుల్లంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులను కోడూరు మండలం శేట్టిగుంట ఎస్టి కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. మృతులు చిట్టెమ్మ (25), గజ్జల దుర్గయ్య (32), గజ్జల శీను (33), గజ్జల లక్ష్మీదేవి  (36), వెంకట సుబ్బమ్మ (37), ముని చంద్ర (38), రాధా (39),  గజ్జల రమణ(42), సుబ్బ రత్నమ్మ (45)లుగా పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంపై మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి దిగ్భ్రాంతి..

అన్నమయ్య జిల్లాలో లారీ బోల్తా పడి 8 మంది మృతి చెందడంపై జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మామిడికాయల లోడ్‌తో రైల్వేకోడూరుకు వెళ్తుండగా రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ బోల్తా పడి 8 మంది మృతి చెందడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మృతులంతా రోజువారి కూలీలు కావడం బాధాకరం అన్నారు

లారీ బోల్తా పడిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్య సహాయం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
Nizamabad Youtuber Vaishnavi husband Haribabu murder: నిజామాబాద్‌లో రివేంజ్ మర్డర్ - యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడు హరిబాబు దారుణ హత్య!
నిజామాబాద్‌లో రివేంజ్ మర్డర్ - యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడు హరిబాబు దారుణ హత్య!
Keesara Police Station ACB Trap: కీసర చెరువు వద్ద ఏసీబీ హైవోల్టేజ్ ఆపరేషన్ - రూ. 5 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన ఎస్ఐ, సీఐ! అసలు పట్టించింది బిర్యానీనే!
కీసర చెరువు వద్ద ఏసీబీ హైవోల్టేజ్ ఆపరేషన్ - రూ. 5 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన ఎస్ఐ, సీఐ! అసలు పట్టించింది బిర్యానీనే!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Land For Poor People: దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్
TMC New Name And Logo: టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
The India Story OTT : ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
రూ.10 లక్షల లోపు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌.. బలెనో, i20లో మీకు ఏది సరిపోతుందంటే?
బలెనో vs i20.. టాప్‌ వేరియంట్లలో ఏ కారు ఎక్కువ ఫీచర్లు ఇస్తుందో తెలుసా?
Embed widget