National Police Academy : నేషనల్ పోలీస్ అకాడమీలో 7 కంప్యూటర్లు చోరీ, ఇంటి దొంగ పనే కానీ!
National Police Academy : రాజేంద్రనగర్ నేషనల్ పోలీస్ అకాడమీలో కంప్యూటర్లు చోరీ కలకలం రేపుతోంది. పటిష్ట భద్రత ఉన్న ఎన్పీఏలో ఏడు కంప్యూటర్లు చోరీ అయ్యాయి.
National Police Academy : హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో దొంగతనం జరిగింది. కట్టుదిట్టమైన భద్రత కలిగిన IPS ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ అకాడమీలో కంప్యూటర్లు మాయం అయ్యాయి. భద్రతా బలగాల కళ్లు గప్పి 7 కంప్యూటర్లను కేటుగాడు మాయం చేశాడు. కట్టుదిట్టమైన భద్రత కలిగిన IPS ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ నుంచి చాకచక్యంగా కంప్యూటర్లు దొంగలించడం కలకలం రేపుతోంది. కంప్యూటర్లు చోరీకి గురవ్వడంతో అధికారులు సీసీటీవీ ఫూటేజ్ పరిశీలిస్తున్నారు. సీసీ ఫూటేజ్ లో దొంగతనం దృశ్యాలు రికార్టు అయ్యాయి. అకాడమీలో ఐటీ సెక్షన్ లో పనిచేస్తున్న చంద్రశేఖర్ గా అనే వ్యక్తి కంప్యూటర్లు చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఎన్పీఏ అధికారులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కంప్యూటర్లలోని డేటా కోసమా?
హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో దొంగతనం జరిగింది. పోలీస్ అకాడమీలోని ఏడు కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి. కట్టుదిట్టమైన భద్రత ఉంటే పోలీస్ అకాడమీలోనే చోరీ జరగటంతో తీవ్ర కలకలం రేగింది. ఐపీఎస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లోని ఏడు కంప్యూటర్లు చోరీ అవ్వటంపై అధికారులు విచారణ చేపట్టారు. సీసీ టీవీలో దృశ్యాలను పరిశీలించిన అధికారులు అకాడమీ ఐటీ సెక్షన్ ఉద్యోగి చంద్రశేఖర్ కంప్యూటర్లను దొంగతనం చేసినట్లుగా గుర్తించారు. చంద్రశేఖర్ పై రాజేంద్రనగర్ పోలీసులకు ఎన్పీఏ అధికారులు ఫిర్యాదు చేశారు. అయితే కంప్యూటర్ లోని డేటా కోసం చోరీ జరిగిందా? ఇంకేమైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పటిష్టమైన భద్రత, సీసీకెమెరాలు ఉంటాయని తెలిసినా ఏడు కంప్యూటర్లు మాయం చేసిన చంద్రశేఖర్ ఈ చోరీకి పాల్పడడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
జల్సాల కోసం చోరీలు
విలాసవంతమైన జీవితం కోసం ఓ వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. గతంలో మోటార్ సైకిళ్లే లక్ష్యంగా చోరీలు చేసే అతడు చాలా సార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. అయినప్పటికీ అతని ప్రవర్తన మార్చుకోకుండా దొంగతనాలకు పాల్పడుతూనే ఉన్నాడు. తాజాగా తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలు చేశాడు. ఓ ఇంటి తాలం పగులగొట్టి 5 వేల రూపాయల నగదు, ఓ మొబైల్ ఫోన్ దొంగిలించాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కష్టపడి నిందితుడిని పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి తండ్రి చంద్రయ్య మందమర్రిలోని సింగరేణి బొగ్గు గనులలో పని చేస్తున్నాడు. నిందితునికి ఏడుగురు అన్నదమ్ములు కూడా ఉన్నారు. అయితే ఇతడు మాత్రం చిన్నతనం నుంచే బడి మానేసి ఆవారాగా తిరుగుతూ బెల్లంపల్లిలో మోటార్ సైకిళ్లను దొంగలించగా బెల్లంపల్లి పోలీసులు పట్టుకొని జువైనల్ హోంకు తరలించారు. ఆ తర్వాత జువైనల్ హోం నుంచి బయటకు వచ్చినా అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. మళ్లీ దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇలా నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ లోని జైల్లో శిక్ష అనుభవించాడు. వరంగల్ జైలులో ఉండగా రామకృష్ణపూర్ పోలీసులు ఇతనిపై పీడి యాక్ట్ కూడా నమోదు చేశారు. అన్ని కేసుల్లో జైలు శిక్ష అనుభవించి నవంబర్ 18వ తేదీ 2022రోజు జైలు నుంచి బయటకు వచ్చాడు.
ఈ క్రమంలోనే ఆసిఫాబాద్ వెళ్లిన సదరు నేరస్థుడు నవంబర్ 21వ తేదీ 2022 రోజున అర్ధరాత్రి ఓ ఇంటి ముందు పార్కు చేసి ఉన్న హీరో గ్లామర్ మోటార్ సైకిల్ ను దొంగలించినట్లు పోలీసులు తెలిపారు. దొంగలించిన మోటార్ సైకిల్ పై డిసెంబర్ నెల మొదటి వారంలో వరంగల్ కు వచ్చి శివనగర్ ఏరియాలో తిరుగుతూ.. అర్ధరాత్రి ఒక తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తించి అక్కడ కూడా చోరీకి పాల్పడినట్లు తెలిపారు. అయిదే ఇంటి తాళం పగులగొట్టిన నిందితుడు.. లోనికి ప్రవేశించి బీరువా తెరచి అందులోని ఉన్న డబ్బులతో పాటు వివో సెల్ ఫోన్ ను దొంగలించుకొని పారిపోయినట్లు వివరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.