By: ABP Desam | Updated at : 05 Mar 2023 05:50 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కోడలితో మామ జంప్
Rajasthan News : రాజస్థాన్ లో వింత ఘటన జరిగింది. కోడలితో ప్రేమాయణం స్టార్ట్ చేసిన మామ... చివరికి ఆమెను తీసుకుని ఇంట్లోంచి పారిపోయాడు. ఈ వింత ప్రేమకథ లో మరో ట్విస్ట్ ఏంటంటే కొడుకు బైక్ పై వారిద్దరూ జంప్ అయ్యారు. రాజస్థాన్‌లోని బుండీ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన కోడలును ప్రేమించి, ఆమెతో పారిపోయిన విచిత్రమైన సంఘటన జరిగింది. భార్యతో కలిసి తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడని తెలుసుకున్న కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా తన తండ్రి పారిపోయేందుకు తన బైక్‌ను దొంగిలించాడని కొడుకు పేర్కొన్నాడు. బుండి జిల్లాలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిలోర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. తన భార్య విడాకులు ఇచ్చేందుకు తండ్రి రమేష్ వైరాగి ప్రయత్నించాడని పవన్ వైరాగా కేసు పెట్టాడు. పవన్ చెప్పినట్లుగా, అతని తండ్రి తన భార్యను తన నుండి దూరం చేయడానికి ప్రయత్నించాడని స్థానికులు అంటున్నారు. అయితే పోలీసులు ఈ కేసును సీరియస్‌గా దర్యాప్తు చేయడం లేదని పవన్ ఆరోపిస్తున్నాడు.
ఆరు నెలల కూతుర్ని వదిలేసి
పవన్‌కు ఆరు నెలల కూతురు ఉంది. గతంలో కూడా రమేష్ వైరాగా అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డాడని తెలుస్తోంది. తన తండ్రి బైక్ దొంగిలించాడని, తన భార్యతో కలిసి ఆ బైక్ పై వెళ్లిపోయాడని పవన్ పేర్కొన్నాడు. అంతేకాకుండా, తన భార్య తన తండ్రి చేతిలో మోసపోయిందని, అమాయకురాలు అని పేర్కొన్నాడు. పని కారణంగా, తాను గ్రామానికి దూరంగా ఉండడానికి ప్రధాన కారణమని పవన్ తెలిపాడు. మొత్తం పరిస్థితిని సీరియస్‌గా పరిశీలిస్తున్నామని సదర్ స్టేషన్ ఆఫీసర్ అరవింద్ భరద్వాజ్ తెలిపారు. విచారణ కొనసాగుతోందని, పారిపోయిన మామ కోడలు, పవన్ బైక్‌ను గుర్తించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అరవింద్ తెలిపారు. వారి ఆచూకీకి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బీహార్ లో భర్తల ఎక్స్ఛేంజ్
బీహార్ రాష్ట్రంలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. అప్పుడప్పుడు సినిమాల్లో చూపించినట్లు ఒకరి భర్తను మరొకరు ప్రేమించారు. అక్కడితో ఆగకుండా భర్తలను ఎక్స్ఛేంజ్ కూడా చేసుకున్నారు. అంటే ఒకరి భర్తను మరొకరు పెళ్లి చేసుకున్నారు. దీనినే కొందరు నెటిజన్లు భర్తల మార్పిడి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. బీహార్ లో రెండు విచిత్రమైన ప్రేమకథలు చర్చనీయాంశంగా మారాయి. ఇద్దరు వివాహితలు ఒకరి భర్తను మరొకరు వివాహం చేసుకున్నారు. బీహార్‌లోని ఖగారియా జిల్లా ఈ వింత ప్రేమకథలకు కేంద్రం అయింది. ఎన్నో మలుపులు తిరిగిన ఈ ప్రేమకథలకు చివరికి పెళ్లితో ఫుల్ స్టాప్ పడింది. అయితే ఈ విచిత్ర సంఘటనను చూసి స్థానికులు అవాక్కయ్యారు.
అసలేం జరిగింది?
ఇక్కడ మరో విచిత్రం కూడా ఉందండోయ్. ఇద్దరు మహిళల పేర్లు కూడా ఒక్కటే... అదే రూబీ దేవి. స్థానిక మీడియా కథనాల ప్రకారం, చౌతం పోలీస్ స్టేషన్ పరిధిలోని పస్రాహా గ్రామానికి చెందిన రూబీ దేవి 2009లో నీరజ్ కుమార్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే ఆమెకు అదే గ్రామానికి చెందిన ముఖేష్ కుమార్ సింగ్ అనే వ్యక్తితో సంబంధం ఏర్పడింది. ముఖేష్ కూడా వివాహం చేసుకున్నాడు. అతడి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి భార్య పేరు కూడా రూబీ దేవి. అయితే ప్రేమించుకున్న ముఖేష్, రూబీ దేవి గతేడాది ఫిబ్రవరి 6న ఇంట్లోంచి పారిపోయి పెళ్లిచేసుకున్నారు. ఇలా వెళ్లిపోయిన రూబీ తనతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెను తీసుకుని వెళ్లింది.
వింత ప్రేమాయణం
దీంతో కోపోద్రిక్తుడైన నీరజ్ కుమార్ సింగ్ ముఖేష్‌పై స్థానిక పోలీసు స్టేషన్ లో కిడ్నాప్ కేసు పెట్టాడు. నీరజ్ కుమార్ సింగ్ ముఖేష్ సింగ్ ముందు భార్య రూబీ దేవి ఫోన్ నంబర్ సంపాదించాడు. ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇలా వారి మధ్య సంబంధం ఏర్పడింది. తాజాగా వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 18న కోర్టు అనుమతితో నీరజ్ కుమార్ సింగ్, రూబీ దేవి వివాహం చేసుకున్నారు.
Hyderabad News: తోటి విద్యార్థితో కూతురి ప్రేమ పెళ్లి - తట్టుకోలేక తల్లి ఘోరమైన పని!
Hyderabad News: కానిస్టేబుల్ ప్రేమ పెళ్లి - వరకట్నం కోసం వేధింపులు, తాళలేక మహిళ బలవన్మరణం
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
TSPSC : పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?
Tirupati Crime News: మైనర్‌పై వాలంటీర్ అత్యాచారయత్నం, నిందితుడిపై పోక్సో కేసు నమోదు
Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే
Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్
Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?
షాకింగ్ లుక్: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్!