అన్వేషించండి

Crime News: నానబెట్టిన శనగలు తినలేదని భర్తపై దాడి - వేలు కొరికి మిక్సీ జార్‌తో బాదేసింది, పుణెలో షాకింగ్ ఘటన

Pune News: మహారాష్ట్రలోని పుణెలో షాకింగ్ ఘటన జరిగింది.నానబెట్టిన శనగలు తినలేదని ఓ మహిళ తన భర్తపై దాడికి పాల్పడింది. వేలు కొరికి మిక్సీ జార్‌తో చితకబాదింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

Woman Hits Her Huband For Not Eating Soaked Chana In Pune: చిన్న చిన్న విషయాలకే కొందరు దంపతుల మధ్య తగాదాలు వస్తున్నాయి. మహారాష్ట్ర పుణేలో (Pune) అలాంటి ఘటనే చోటు చేసుకుంది. నానబెట్టిన శనగలు తినలేదని ఓ మహిళ తన భర్తపై దాడికి పాల్పడింది. వేలు కొరికి మిక్సీ జార్‌తో తలపై కొట్టింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర (Maharastra) పుణెలోని సోమవార్‌పేట్ త్రిశుండ గణపతి ఆలయం సమీపంలోని ఓ ఇంట్లో భర్త (44), భార్య (40) నివాసం ఉంటున్నారు. ఈ నెల 1న  (ఆదివారం) రాత్రి నానబెట్టిన శనగల విషయంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఆ శనగలు తినాలని భార్య చెప్పగా.. తనకు ఇష్టం లేదని చెప్పి భర్త అందుకు నిరాకరించాడు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భార్య.. భర్తను దుర్భాషలాడుతూ అతనితో గొడవపడింది.

మిక్సీ జార్‌తో తలపై బాదింది

భర్త ఎదురు తిరగడంతో సుత్తితో దాడి చేసేందుకు యత్నించింది. అతను ఆ సుత్తిని లాక్కోవడంతో మిక్సీ జార్‌తో తలపై బాదింది. ఆమె దాడి నుంచి తప్పించుకునేందుకు తలకు చేతులు అడ్డం పెట్టుకోవడంతో భర్త వేలు కొరికేసింది. ఆపై కర్రతో విచక్షణారహితంగా చితక్కొట్టింది. ఎలాగోలా ఆమె నుంచి తప్పించుకున్న భర్త స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేస్తామని.. ఇంటికి వెళ్లాలని పోలీసులు బాధితునికి చెప్పగా భయంతో వణికిపోతూ అందుకు నిరాకరించాడు. రాత్రికి తనకు పోలీస్ స్టేషన్‌లోనే ఆశ్రయం కల్పించాలని కోరాడు. తన భార్య మిక్సీ జార్‌తో రెండుసార్లు తలపై కొట్టిందని.. చిటికెన్ వేలు కొరికేసిందని, కర్రతో చితకబాదిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో భర్త పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Kerala Viral News: బస్టాండ్‌లో కూర్చొని ఫోన్ చూస్తుండగా కౌగిలించుకున్న బస్‌- తృటిలో త‌ప్పిన ఘోరం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Prakasam District News: బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
PAN 2.0 - Aadhaar: పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
RBI Governor Salary: ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Embed widget