By: ABP Desam | Updated at : 12 Dec 2022 11:56 AM (IST)
Edited By: jyothi
డ్రగ్ ఇన్ స్పెక్టర్ నగ్న వీడియోలు కలకలం, అసలేం జరిగిందంటే?
Inspector Nude Videos: వైదారోగ్య శాఖకు చెందిన డ్రగ్ ఇన్ స్పెక్టర్ నగ్న వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. తనతో పాటు పని చేసే మరో మహిళా అధికారిణితో కొన్నాళ్లు సహజీవనం సాగించడం. ఆ తర్వాత వదిలేయడంతో ఆమే కావాలని ఇలా చేసిందని అతను ఆరోపిస్తున్నాడు.
మహిళా అధికారిణి లోబరుచుకొని లైంగిక వేధింపులు..
ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన ఒక కళాశాల పార్టనర్‌కు అల్లుడు. ప్రస్తుతం ఏలూరు జిల్లా తణుకులో పని చేస్తున్నారు. కర్నూలులో విధులు నిర్వహించే సమయంలో తనతోపాటు పని చేసే ఒంగోలుకు చెందిన ఓ మహిళా అధికారిణిని లోబరుచుకొని లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె ప్రస్తుతం విజయవాడలో పని చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి కొంతకాలం సహజీవనం సాగించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తన భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానంటూ ఆ అధికారిణిని నమ్మించి మోసగించినట్లు తెలిసింది. ఈ విషయమై కర్నూలు జిల్లాలో పని చేసే సమయంలోనే ఆమె అక్కడి అధికారులకు ఫిర్యాదు చేయగా కౌన్సిలింగ్ నిర్వహించినట్లు సమాచారం.
అయినప్పటికీ తనకు న్యాయం జరగలేదంటూ ఆమె ఇప్పుడు మీడియాను ఆశ్రయించారు. ఈ వియమై ఆ డ్రగ్ ఇన్ స్పెక్టర్ మాట్లాడుతూ... కర్నూలులో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి ఆమెను మందలించారని తెలిపారు. కుటుంబం నుంచి తనను విడదీసేందుకే ఆ అధికారిణి ఇలా బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన నగ్న వీడియోలను ఆమె నెట్టింట వైరల్ చేసినట్లు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోల వ్యవహారం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
నెలరోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో నగ్న వీడియోలు తీసి బెదిరింపులు..
ప్రేమించానని నమ్మించి యువతి అశ్లీల చిత్రాలు తీశాడో ఓ యువకుడు. ఆ వీడియోలు కుటుంబీకులు, గ్రామస్తులకు పంపడంతో మనస్థాపంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది. ప్రేమించానని నమ్మించాడు, మాయమాటలతో యువతి లోబర్చుకున్నాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో యువతి అశ్లీల వీడియోలు రికార్డు చేశాడు. ఆ తర్వాత అసలు రంగు బయటపెట్టాడు. యువతిని వేధించడం మొదలుపెట్టాడు. తను పిలిచినప్పుడు రావాలని లేకుండా వీడియోలు ఇంటర్ నెట్ లో పెడతానని బెదిరించాడు. చివరికి అన్నంత పని చేసి వీడియో యువతి బంధువులకు పంపాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించానని చెప్పిన ఓ మృగాడి మాటలు బలైపోయింది.
నిందితుడిని కఠినంగా శిక్షించాలి : ప్రజా సంఘాలు
శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముదాలవలస మండలంలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో దళిత యువతిని లొంగదీసుకున్నాడు హరీశ్ అనే యువకుడు. ఆ తర్వాత ఆశ్లీల వీడియోలతో వేధించడం మొదలుపెట్టాడు. ఆ వీడియోలను యువతి సోదరుడు, బంధువులకు పంపించాడు. విషయం బయటకు చెబితే చంపుతానని కూడా బెదిరించాడు. ఆ అవమానాన్ని భరించలేక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గత నెల 31న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత యువతికి న్యాయం చేయాలని దళిత, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం, నడిరోడ్డుపై భార్యను కిరాతంగా హత్య చేసిన భర్త
Warangal Fire Accident : వరంగల్ లో భారీ అగ్నిప్రమాదం, స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగి 9 షాపులు దగ్ధం
Annamayya District Crime: విలేకరిపై గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు- అన్నమయ్య జిల్లాలో కలకలం
TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం
Peddapalli Crime : రౌడీషీటర్ సుమన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు, పాతకక్షలతో మర్డర్!
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Konda Murali: మాకు ఒక్క సీటు చాలు, బరిలో నిలిచేది ఎవరో కొండా మురళీ క్లారిటీ
Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?