Crime News: ఫ్రెండ్ భార్యతో ఎఫైర్.. పార్టీ చేసుకుందామని తీసుకెళ్లారు.. చివరకు..
స్నేహితుడి భార్యతోనే ఓ వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ విషయం స్నేహితుడికి తెలిసింది.
రోజూ కలిసి పనిచేసే.. స్నేహితుడి భార్యకు దగ్గరయ్యాడు ఓ వ్యక్తి. మెుదట్లో మాటలతో మెుదలైన వాళ్ల బంధం.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం స్నేహితుడికి తెలిసి.. చివరకు ప్రాణాల మీదకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
అనంతపురం రూరల్ మండలం నందమూరి నగర్‌కు చెందిన నల్లబోతుల రాజేష్ (33), సుజాతకు కొన్నేళ్ల కిందట పెళ్లైంది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బేల్దారి పనులు చేస్తూ.. కుటుంబాన్ని పోషించుకునేవారు. సుందరయ్యా కాలనీకి చెందిన.. గురుమూర్తి, బాలరాజు... రాజేశ్ కు స్నేహితులు. చాలా రోజుల నుంచి మిత్రులుగా ఉన్నారు. ఆ నమ్మకంతోనే.. గురుమూర్తి ఇంటి నిర్మాణ పనుల గురించి.. రాజేశ్ కు చెప్పాడు. వాళ్లకున్న స్నేహంతో.. గురుమూర్తి ఇంటి నిర్మాణాన్ని.. రాజేశ్ దగ్గరగా ఉండి మరీ చేయించాడు. ఈ క్రమంలోనే.. గురుమూర్తి భార్యతో రాజేశ్ కు పరిచయం ఏర్పడింది. అది కాస్త... చనువు పెరిగి.. వివాహేతర సంబంధానికి దారి తీసింది.
తన భార్యతో అలా చేయడం తప్పని.. గురుమూర్తి.., రాజేశ్ ను హెచ్చరించాడు. ఎన్నిసార్లు చెప్పినా.. వినకపోవడంతో.. చంపేయాలని భావించాడు. డిసెంబర్ 17వ తేదీన.. రాజేశ్ ను ఇంటి నుంచి తీసుకెళ్లారు గురుమూర్తి, బాలరాజు. వివాహేతర సంబంధంపై వారి మధ్య వాగ్వాదం నడిచింది. మరోవైప చీకటి పడుతున్నా.. భర్త ఇంటికి రాకపోవడంతో సుజాత ఫోన్ చేసింది. తామంతా మందు పార్టీలో ఉన్నామని, త్వరగా ముగించుకుని వస్తానని రాజేష్ తెలిపాడు. ఇక అవే చివరి మాటలు.. రాత్రైనా రాజేశ్ ఇంటికి రాలేదు.
డిసెంబర్ 18న.. కామారుపల్లి సమీపంలోని లే అవుట్‌లో వ్యక్తి చనిపోయి ఉన్నారన్న సమాచారం పోలీసులకు వచ్చింది. ఇటుకలపల్లి సీఐ విజయభాస్కర గౌడ్, రూరల్ ఎస్‌ఐ మహానంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. మెడపై కొడవలితో నరికినట్లుగా గాయాలున్నాయి. విషయం తెలుసుకున్న సుజాత అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించింది. తన భర్త రాజేష్‌దేనని ధ్రువీకరించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలరాజు, గురుమూర్తి ఎక్కడ ఉన్నారో తెలియాల్సి ఉంది.
Also Read: Chittoor News: చిత్తూరు జిల్లాలో విషాదం... స్వర్ణముఖి నదిలో ముగ్గురు బాలురు గల్లంతు
Also Read: Khammam: కొడుకును ఖననం చేసిన మరుసటిరోజే ఉరేసుకున్న తండ్రి.. సమాధి వద్దనే అఘాయిత్యం
Also Read: 12 ఏళ్ల క్రితం తప్పిపోయి.. పాక్ జైల్లో తేలాడు.. భార్యకు మరో పెళ్లైంది.. ఇంకో ట్విస్టు ఏంటంటే