అన్వేషించండి
Advertisement
Palnadu News : గ్యాస్ సిలిండర్ పేలి అగ్నిప్రమాదం, కాలి బూడిదైన నగదు, బంగారం
Palnadu News : పల్నాడు జిల్లా గంగిరెడ్డి పాలెంలో ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో సుమారు 9 లక్షల ఆస్తినష్టం వాటిళ్లింది.
Palnadu News : పల్నాడు జిల్లా మాచవరం మండలంలోని గంగిరెడ్డి పాలెం గ్రామంలో సిలిండర్ పేలిన ఘటనలో సుమారు రూ.9 లక్షల ఆస్తి నష్టం జరిగింది. గంగి రెడ్డి గ్రామానికి చెందిన రాచూరి నాగరాజు భార్య సుశీల ఇంటిలో పాలు కాస్తుండగా ప్రమాదం సంభవించింది. గ్యాస్ లీకై మంటలు చుట్టుముట్టడంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు బయటికి వచ్చేశారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇంటి పైకప్పుపై ఉన్న రేకులు కాలిపోయాయి. ఇంటిలో ఉంచిన మూడు లక్షల రూపాయల నగదు కాలిపోయింది. నాలుగు లక్షల విలువైన బంగారం అగ్నికి ఆహుతి అయింది. ఆస్థి నష్టం సుమారు 9 లక్షల రూపాయలు జరిగిందని ఇంటి యజమాని నాగరాజు తెలిపారు. ప్రమాద సమారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలో దిగారు. అగ్ని కీలలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా కట్టడి చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion