By: ABP Desam | Updated at : 15 Jul 2022 10:50 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
పాకిస్తాన్ లో దారుణ ఘటన
Pakistan Crime : కట్టుకున్న వాడే నరరూప రాక్షకుడిగా మారిపోయాడు. భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసి ఉడకబెట్టిన ఘటన పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో చోటుచేసుకుంది. ఈ దేశ మీడియా నివేదిక ప్రకారం పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌లో వ్యక్తి తన ఆరుగురు పిల్లల ముందు భార్యను కాల్చి చంపి ఉడకబెట్టిన దారుణమైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. సింధ్ ప్రావిన్స్ గుల్షన్-ఎ-ఇక్బాల్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో నర్గీస్ అనే మహిళను ఆమె భర్త బుధవారం హత్య చేసి వంటగదిలో ఉడకబెట్టాడని పోలీసులకు సమాచారం అందిందని స్థానిక మీడియా తెలిపింది.
ముగ్గురు పిల్లలతో పరారీ
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బజౌర్ ఏజెన్సీకి చెందిన ఆషిక్ ఓ పాఠశాలలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఆ పాఠశాల తొమ్మిది నెలలు మూతపడి ఉంది. ఈ పాఠశాలలోని సర్వెంట్ క్వార్టర్‌లో అతడు కుటుంబంతో నివసిస్తున్నాడు. ఈ దారుణ ఘటన తర్వాత ఆషిక్ ముగ్గురు పిల్లలతో పారిపోయాడు. అయితే బాధితురాలి కుమార్తె పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. జిల్లా ఈస్ట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అబ్దుర్ రహీమ్ షెరాజీని స్థానిక మీడియాతో మాట్లాడుతూ ముగ్గురు పిల్లలను సంరక్షణ కేంద్రానికి తరలించామన్నారు.
హత్య చేసి ఆపై
పిల్లలు చాలా భయపడిపోయారని, వారికి గాయాలు కూడా అయ్యాయని ఎస్ఎస్పీ షెరాజీ అన్నారు. మెడికో-లీగల్ ఫార్మాలిటీస్ కోసం పోలీసులు మృతదేహాన్ని జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్‌కు తరలించామని షెరాజీ చెప్పారు. ప్రాథమిక విచారణ, పిల్లల వాంగ్మూలాల ప్రకారం నిందితుడు తన భార్యను గొంతుకోసి చంపినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. మహిళ కాలు కూడా ఆమె శరీరం నుంచి వేరుచేయబడి ఉందని ఎస్ఎస్పీ చెప్పారు. ఈ ఘటన వెనుక కారణం ఇంకా తెలియాల్సి ఉందన్నారు.
వివాహేతర సంబంధం పెట్టుకోవాలని బలవంతం
అయితే ఆషిక్ తన భార్యను వివాహేతర సంబంధాలు పెట్టుకోవాలని బలవంతం చేశాడని, ఆమె నిరాకరించడంతో హత్య చేశాడని స్థానికులు అంటున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. సుమారు 11 ఏళ్ల క్రితం 2011 నవంబర్‌లో తన అనుమతి లేకుండా మరో మహిళను పెళ్లి చేసుకోవాలని భావించి తన భర్తను హత్య చేసి, అతని శరీర భాగాలను వండడానికి ప్రయత్నించింది ఓ మహిళ. దాదాపుగా ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. నిందితుడి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Bullet Bike Thieves: బుల్లెట్ బైకులంటే ప్రాణం, ఎక్కడ కనిపించినా అదే పనిచేస్తారు!
Mla Jeevan Reddy : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యాయత్నం కేసు, దాడికి అసలు కారణమిదే?
Palnadu News : పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన కానిస్టేబుల్, రూ.5 లక్షలతో పరారీ
Murder in Ghaziabad: పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడి గొంతు కోసిన మహిళ- చివరికి ట్విస్ట్!
Man Suicide: మొదటి భార్య మరణాన్ని తట్టుకోలేక, ఆమె సమాధి వద్దే ఆత్మహత్య!
India vs Australia History: ఏ ఆట అయినా, ఏ టోర్నమెంట్ అయినా ఈ ఆస్ట్రేలియన్స్ వదలరా మనల్ని..?
Parvathipuram AmmaVari Temple : ఇప్పల పోలమ్మ ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు | ABP Desam
A little boy got angry on his teacher : గోదావరియాసలో మాస్టారిపై కంప్లైంట్ చేసిన పిల్లాడు | ABP Desan
Tenali School Students : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కోసం తెనాలి విద్యార్థులు | ABP Desam