అన్వేషించండి

Road Accident : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు విశాఖ వాసులు మృతి

Road Accident : ఒడిశాలోని ఖుర్దా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొన్న ప్రమాదంలో నలుగురు విశాఖ వాసులు మృతి చెందారు.

Road Accident : ఒడిశా రాష్ట్రం ఖుర్దా రోడ్డు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి వేగంగా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ విషాద సంఘటనలో విశాఖకు చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో విశాఖ బీచ్ రోడ్డు ప్రాంతానికి చెందిన బ్యూటీషియన్ మారియా ఖాన్(24), విశాలాక్షి నగర్ ప్రాంతానికి చెందిన రాఖి(45), ఫోటోగ్రాఫర్ కబీర్ తో పాటు మరో వ్యక్తి చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. ఈ నలుగురు భువనేశ్వర్ లోని ఓ వివాహానికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు  తెలుస్తోంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మృతుల బంధువులు స్నేహితులు హుటాహుటిన ఒడిశాకు బయలుదేరి వెళ్లారు. 

లవర్స్ ను బెదిరించిన ఎస్సై, యువతి మృతి

జంటగా చేరి ఊసులాడుకునే ప్రేమికులంటే చాలామందికి బాగా అలుసు. వారి వద్దకు వెళ్లి బెదిరించడం, డబ్బులు అడగటం, లేదా వారిని ఇబ్బంది పెట్టడం చేస్తుంటారు. సరిగ్గా ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పలుకూరులో కూడా ఇలాంటి ఘటన జరిగింది. ఓ ప్రేమజంట పలుకూరు గ్రామ శివారులో కారులో ఉండగా కందుకూరు రూరల్ ఎస్సై శివ నాంచారయ్య వారి వద్దకు వెళ్లాడు. ఆ క్రమంలో అతను వారిని బెదిరించాడని, సెల్ ఫోన్లో ఫొటోలు తీసి, సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడని సమాచారం. ప్రియుడు మహేష్ డబ్బులిస్తానంటూ బతిమిలాడుకున్నా ఎస్సై వినలేదట. దీంతో మహేష్ తన ప్రేయసితో కలసి కారులో వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడని, ఎదురుగా వస్తున్న బస్సుని తప్పించబోయి, మరో బైక్ ని ఢీకొట్టి, ఆ తర్వాత చెట్టుని కారుతో ఢీకొట్టాడు మహేష్. ఈ ప్రమాదంలో ముందు సీటులో ఉన్న యువతి అక్కడికక్కడే చనిపోగా, మహేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

మహేష్ పై కేసు నమోదు..

ర్యాష్ డ్రైవింగ్ తో ప్రమాదానికి కారణం అయ్యాడంటూ పోలీసులు మహేష్ పై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మహేష్ ఎస్సైపై ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాను కారు వేగంగా నడపడానికి కారణం ఆ ఎస్సై అని, అతని వల్లే ప్రమాదం జరిగిందని మహేష్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. అయితే యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం నెల్లూరు జిల్లాలోకి రావడంతో బాధితుడి బంధువులు నెల్లూరు పోలీసుల్ని కూడా ఆశ్రయించారు. మహేష్ అనే వ్యక్తితోపాటు ఉన్న ఆ యువతి ఎవరనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. దీనిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఆ యువతికి భర్త లేకపోవడంతో మహేష్ తో చనువుగా ఉంటుందని చెబుతున్నారు. ఆ యువతి గతంలోనే ఎస్సైకి తెలుసని, ఆమెను టార్గెట్ చేసి ఎస్సై ఆ ప్రాంతంలో అక్కడికి వెళ్లాడనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద మహేష్ ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లేకపోతే ఇది కేవలం ఓ ప్రమాదంగానే మిగిలిపోయేది. ఎస్సై స్థాయి వ్యక్తి దగ్గరకు వచ్చి ఫొటోలు తీయడం, ఆ ఫొటోలు చూపించి బెదిరించడంతో మహేష్ వెంటనే తప్పించుకుని పారిపోవాలని చూశాడు. తనతోపాటు యువతిని కూడా కారులో ఎక్కించుకుని అక్కడినుంచి వేగంగా ముందుకు కదిలాడు. పోలీసుల కళ్లుగప్పి పారిపోయే క్రమంలో యాక్సిడెంట్ చేసి ఆ యువతి మరణానికి కారణం అయ్యాడు మహేష్. అయితే అసలు కారణం ఎస్సై అంటూ అతను ఆస్పత్రి నుంచే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
Stock Market: కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Embed widget