Odisha Health Minister Injured: ఆరోగ్యశాఖ మంత్రిపై కాల్పులు - తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స
Odisha Health Minister Injured: ఒడిశా ఆరోగ్యశాఖ మత్రీ నబకిశోర్ దాస్ పై బ్రెజరాజ్ నగర్ లోని గాంధీ చౌక్ వద్ద పలువరు దుండగులు కాల్పులు జరిపారు.
![Odisha Health Minister Injured: ఆరోగ్యశాఖ మంత్రిపై కాల్పులు - తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స Odisha Health Minister Naba Das Injured in Gun Shot Bullets on Chest Hospitalised Know Details Odisha Health Minister Injured: ఆరోగ్యశాఖ మంత్రిపై కాల్పులు - తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/29/f05f942f5de637828a4de8fb7c94021d1674979667757519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Odisha Health Minister Injured: ఒడిషా ఈరోగ్య శాఖ మంత్రిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం నాడు ఝార్సుగూడ జిల్లాలోని బ్రజరాజ్‌నగర్ సమీపంలోని గాంధీ చౌక్ సమీపంలో ఓడిశా ఆరోగ్య మంత్రి నబా దాస్‌పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరపడంతో తీవ్ర గాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే ఆయనను సమీప ఆస్పత్రికి తరలించారు. మంత్రి ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ప్రారంభోత్సవంలో పాల్గనేందుకు వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఝూర్సుగూడ జిల్లా బ్రిజరాజ్ నగర్ లోని గాంధీ చౌక్ వద్దకు చేరుకున్న నబకిశోర్.. వాహనం దిగుతున్న సమయంలో దండుగుడు కాల్పులు జరిపాడు. అయితే దాడికి కారణమేంటనే విషయం తెలియరాలేదు. దాడి విషయం తెలియగానే బీజేడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇటీవలే బిజూ జనతా దళ్ (బీజేడీ) సీనియర్ నాయకుడు నబా దాస్ మహారాష్ట్రలోని ఒక ఆలయానికి కోటి రూపాయలకు పైగా విలువైన బంగారు కలశాలను విరాళంగా ఇచ్చారు. దేశంలోని ప్రసిద్ధ శని పుణ్యక్షేత్రాలలో ఒకటైన మహారాష్ట్రలోని శని శింగనాపూర్ ఆలయానికి దాస్ 1.7 కిలోల బంగారం మరియు 5 కిలోల వెండితో చేసిన కలశాలను విరాళంగా ఇచ్చినట్లు సమాచారం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)