అన్వేషించండి

Crime News: హైదరాబాద్‌లో దారుణాలు - హోటల్‌లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య?, మరో చోట అనుమానంతో భార్యను చంపేసిన భర్త

Hyderabad News: హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నర్సింగ్ విద్యార్థిని ఉరి వేసుకుని మృతి చెందింది. అయితే, తమ బిడ్డను అత్యాచారం చేసి హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Nursing Student Suspicious Death In Hyderabad: హైదరాబాద్‌ గచ్చిబౌలి (Gachibowli) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ నర్సింగ్ విద్యార్థిని హోటల్ రూంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు (Judcherla) చెందిన విద్యార్థిని (23).. హైదరాబాద్‌లో (Hyderabad) గణేష్ వేడుకలను చూసేందుకు రెండు రోజుల క్రితం ముగ్గురు స్నేహితులతో కలిసి నగరానికి వచ్చారు. వీరిలో ఓ యువతి, ఇద్దరు యువకులు ఉన్నారు. వీరంతా చిన్న అంజయ్యనగర్‌లోని ఓ హోటల్‌లో దిగారు. ఆదివారం రాత్రి భోజనం అనంతరం స్నేహితులు బయటకు వెళ్లారు. తనకు తలనొప్పిగా ఉందని వారి వెంట వెళ్లకుండా విద్యార్థిని హోటల్ గదిలోనే ఉండిపోయింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు స్నేహితులు వచ్చి గది తలుపులు కొట్టగా తీయలేదు.

హోటల్ సిబ్బందికి తెలియజేయగా వారు మాస్టర్ కీ సాయంతో తలుపులు తీశారు. విద్యార్థిని లోపల ఫ్యానుకు ఉరి వేసుకుని కనిపించడంతో అంతా షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తమ కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గదిలో రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. గది మొత్తం చిందర వందరగా ఉండడంతో గొడవ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గదిలో పెద్ద ఎత్తున బీరు బాటిల్స్ ఉన్నట్లు గుర్తించారు. గదిలో మొత్తం ముగ్గురు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తుండగా.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

అనుమానం పెనుభూతమై..

ఓ వ్యక్తి అనుమానంతో భార్యను హతమార్చిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాస్ డెలివరీ బాయ్‌గా పని చేసే నర్సింహులు అనే వ్యక్తికి 13 ఏళ్ల క్రితం ఇందిరతో వివాహం జరిగింది. తన భార్యపై అనుమానంతో నగరంలోనే ఆమెను హత్య చేసిన నిందితుడు మృతదేహాన్ని స్వస్థలం ఆందోల్‌కు తీసుకొచ్చాడు. తన భార్య గుండెపోటుతో చనిపోయిందంటూ కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారికి అనుమానం వచ్చి గట్టిగా నిలదీయడంతో హత్య చేసినట్లు ఒప్పుకొన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారించారు. తాను లేనప్పుడు ఓ పోలీస్ అధికారి తరచూ ఇంటికి వచ్చే వాడని పోలీసులకు తెలిపాడు. తన భార్య గంటల తరబడి అతనితో ఫోన్‌లో మాట్లాడేదని.. వివాహేతర సంబంధం ఉండడం వల్లే ఆమెను హత్య చేసినట్లు చెప్పాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Jani Master: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget