By: ABP Desam | Updated at : 22 Dec 2022 11:21 AM (IST)
Edited By: jyothi
నవీపేట్ వధువు ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ - వరుడే నిందితుడు
Nizamabad News: నిజామాబాద్ జిల్లా నవీపేట నవవధువు ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. రవళి ఆత్మహత్యకు వరుడు సంతోష్ ప్రేరేపించినట్టుగా పోలీసుల నిర్ధారించారు. వరుడిపై పలు కేసులతో కూడిన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. నవ వధువు ఫోన్ కాల్ రికార్డింగ్ ఆధారంగానే పోలీసులు ఆధారాలు తెలుసుకున్నారు. పక్కా ఆధారాలతో సంతోషన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆపై కోర్టులో హాజరుపరిచినట్లు స్థానిక ఎస్సై రాజారెడ్డి తెలిపారు. కోర్టు నిందితునికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించగా రిమాండ్ కు తరలించామని పేర్కొన్నారు. మృతురాలి తండ్రి ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వరుడు సంతోష్ సీడీఆర్ డేటా ను పరిశీలించారు. అయితే నిందితుడు సంతోష్ వధువు రవళిని పలుమార్లు ఉద్యోగం, ఆస్తి విషయంలో ఫోన్ లో ఆరా తీసి ఆత్మహత్యకు కారణం అయ్యాడు.
అసలేం జరిగిందంటే..?
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రానికి చెందిన ర్యాగల రవళిని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సంతోశ్ కు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే అమ్మాయి, అబ్బాయిలు అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడుకునేవారు. పెళ్లి తర్వాత జీవితం చాలా బాగుంటుందని భావించిన ఆ అమ్మాయికి.. అతడిపై అనుమానం మొదలైంది. అతడు మాట్లాడే మాటలు చూస్తుంటే తనను బాగా చూసుకోలేడనే భావన కలిగింది. కానీ తన పెళ్లి అని సంతోషంగా ఉన్న ఆ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిస్తే ఎక్కడ బాధపడతారో అని తన మనసులోనే దాచుకుంది. పైకి నవ్వుతూ, పెళ్లి ఏర్పాట్లలో పాల్గొంటూనే లోలోపల మదనపడుతోంది. అయితే ఆదివారం నిజామాబాద్లో మధ్యాహ్నం 12:15 గంటలకు వివాహం జరిపేందుకు తల్లిదండ్రులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ అతనితో కలిసి అస్సలే జీవించలేనని భావించిన ఆ అమ్మాయికి ఏం చేయాలో పాలుపోలేదు. పెళ్లికి ముందే ప్రాణం తీసుకుంటే తన వల్ల కుటుంబ సభ్యుల పరువు పోదని, తనకు బాధ తప్పుతుందని భావించింది. ఇంట్లో అందరూ చుట్టాలు ఉండగానే.. ఓ గదిలోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
అయితే చాలా సేపటి నుంచి కూతురు కనిపించకపోవడంతో అందరూ ఆమె గురించి వెతికారు. చివరకు రూంలో ఉందనుకొని తలుపులు కొట్టారు. ఎంతకూ గది తలుపులు తెరవకపోవడంతో.. తలుపులు పగులగొట్టారు. మరికొన్ని గంటల్లో పెళ్లి కూతురులా ముస్తాబై, ఆనందంగా అత్తగారింటికి వెళ్లాల్సిన ఆ అమ్మాయి ఉరికి వేలాడుతూ కనిపించింది. ఇది చూసి షాకైన తల్లిదండ్రులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు. పెళ్లి చూసేందుకు వచ్చిన బంధువులు, స్నేహితులు కూడా యువతి అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వస్తోందంటూ కంటతడి పెట్టారు. స్థానికుల ద్వారా విషషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పెళ్లి కుమారుడు మానసికంగా వేధించడంతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని యువతి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పోస్టుమార్టం నిమిత్తం రవళి మృతదేహాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం, నడిరోడ్డుపై భార్యను కిరాతంగా హత్య చేసిన భర్త
Warangal Fire Accident : వరంగల్ లో భారీ అగ్నిప్రమాదం, స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగి 9 షాపులు దగ్ధం
Annamayya District Crime: విలేకరిపై గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు- అన్నమయ్య జిల్లాలో కలకలం
TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం
Peddapalli Crime : రౌడీషీటర్ సుమన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు, పాతకక్షలతో మర్డర్!
ADR Report : దేశంలో 239 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు, 486 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు - ఏడీఆర్ రిపోర్టులో సంచలనాలు
Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?