అన్వేషించండి
Advertisement
Nizamabad News :అమాయకులను టార్గెట్ చేస్తూ ఆన్ లైన్ మోసాలు, అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచన
అమాయకులను టార్గెట్ చేస్తున్నఆన్ లైన్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులంటూ వచ్చే ప్రకటనలకు మోసపోవద్దంటున్నారు.
టెక్నాలజీని మిస్ యూస్ చేస్తూ... ఈజీ మనీకి అలవాటు పడిన కేటుగాళ్లు అమాయకులను ఇట్టే మోసం చేస్తున్నారు. సెల్ ఫోన్ల వాడకం పెరిగిన ఈ రోజుల్లో విద్యావంతులు కూడా ఈజీగా మోసపోతున్నారు. లోన్ యాప్ ల పేరిట చీటింగ్ బాగా పెరిగిపోయింది. డబ్బులు అవసరమున్న వాళ్లు వీటికి ఆకర్షితులై ఇటు సమాజంలో తలఎత్తుకోలేకుండా అవుతోంది. ఇదే అదునుగా సైబర్ దొంగలు రెచ్చిపోతున్నారు. కొత్తకొత్త మార్గాల్లో ప్రజల డబ్బు మాయం చేస్తున్నారు. జిల్లాలో ప్రతిరోజు ఆన్లైన్ మోసాలు, లోన్ యాప్ మోసాలకు చాలా మంది బలవుతున్నారు. ఈ మోసాలు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బాగా పెరిగిపోయాయి. ఇటీవలే నిజామాబాద్ నగరంతో పాటు వర్ని మండలంలో సుమారు వంద మంది వరకు ఆన్లైన్లో మోసపోయారు. సైబర్ మాయగాళ్ల ఉచ్చులో పడి ఓటీపీలు చెప్పడం, లోన్ యాప్ ఆగడాలతో ప్రజలు నష్టపోతున్నారు. మనీ వ్యూ, నావి, క్యాషి, ఇన్ స్టా మనీ వంటి లోన్ యాప్ లు గతంలో లోన్ తీసుకున్న వారు ఈ మోసాలకు ఎక్కువగా గురి అవుతున్నారు.
ముందుగా కొంత డబ్బు అకౌంట్లో వేసి, తర్వాత ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అకౌంట్లో డబ్బులు వేసి, మా యాప్ లో లోన్ తీసుకున్నారని ఫోన్ చేస్తున్నారు. అనంతరం డబ్బు చెల్లించకపోతే మీ అంతు చూస్తాం అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. లోన్ యాప్ లో దరఖాస్తు చేసుకున్న నంబర్ ద్వారా కొంత నగదు పంపి, ఆ తర్వాత గడువులోగా చెల్లించాలని వాట్సప్ మెసేజ్ చేస్తున్నారు. వాటికి సమాధానం ఇవ్వకపోతే బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు తమ ఫొటోలను మార్పింగ్ చేసి పంపిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ సైబర్ మోసాలు ఇప్పుడు కరోనా వైరస్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇందులో మరో మోసం కూడా ఉంది. మొదట కొంత అమౌంట్ ను చెల్లిస్తే వారికి నెలకు ఇంత సొమ్ము అదనంగా కూడా వస్తుందని ఆశ చూపి రెండు మూడు నెలలు అదనంగా అమౌంట్ ఇస్తారు. దానికి ఆశపడిన వారు డబ్బును ఎక్కువ పే చేస్తారు. దాని తర్వాత వారికి అసలు డబ్బులు పంపరు. ఇలాంటి మోసాలకు గ్రామీణ ప్రాంతాల్లో బాగా మోసపోతున్నారు.
ఇలాంటి సైబర్ నేరాల కేసులు పోలీస్ స్టేషన్లలో ఎక్కువవుతున్నాయ్. దీంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు. బుధవారం 11 గంటల నుంచి 12 గంటల వరకు గంట పాటు 9490618029 నెంబర్ ద్వారా ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించారు సీపీ. పోన్ ఇన్ కార్యక్రమం ద్వారా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పలువురికి సలహాలు, సూచనలు చేశారు సీపీ. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కకుండా జాగ్రత్తలపై ఫోన్ ఇన్ కార్యక్రమంలో సీపీ నాగరాజు మాట్లాడారు. గుర్తు తెలియని వ్యక్తులకు పర్సనల్, బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఇవ్వకూడాదని ... గుర్తు తెలియని వ్యక్తులు పంపించే అన్ లైన్ లింకులను ఓపెన్ చేయకూడదని చెప్పారు. ఎవరైనా ఆన్ లైన్ లో మోసపోయినట్లు తెలిస్తే 24 గంటల లోపు 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు సంప్రదించాలి లేకుంటే దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయని లేదంటే ఫ్రీ కూపన్లు ఇస్తున్నామని ఇతర ఎలాంటి మెసేజ్ లకు స్పందించకూడదని సీపీ నాగరాజు తెలిపారు. సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా ప్రజలే ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ నాగరాజు సూచించారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
న్యూస్
టెక్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion