Nizamabad News : అందమే శాపమైంది, అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త!
Nizamabad News : అందమే ఆమె పాలిట శాపం అయ్యింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను కిరాతకంగా హత్య చేశాడు.
Nizamabad News : భార్య భర్తల మధ్య అనుమానం చిచ్చురేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎన్నో జంటలు ఆ తర్వాత అనుమానం అనే పిశాచి బలైపోతున్నారు. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలతో పిల్లలను అనాథలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను హత్య చేశాడు.
అసలేం జరిగింది?
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భార్య అందంగా ఉండడంతో అనుమానం పెంచుకున్న భర్త ఆమెను హత్య చేశాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బ్యాంకు కాలనీలో ఉంటున్న మాలపల్లికి చెందిన అనీస్ ఫాతిమా (30)ను ఆమె భర్త సయ్యద్ సుల్తాన్ చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు. భర్త అనుమానంతో వేధించడంతో ఆమె ఏడాదిన్నరగా భర్తకు దూరంగా ఉంటుంది. ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు ఫాతిమా. పిల్లలను చూసే నెపంతో ఫాతిమా ఉంటున్న ఇంటికి సయ్యద్ సుల్తాన్ వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఆమె ఇంటికి వచ్చిన సయ్యద్ భార్యతో గొడవపడి హత్య చేశాడు. ఆ తర్వాత పిల్లలను తన వెంట తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఫాతిమా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కేసు పెట్టకపోతే పిల్లలను ఇస్తానని చెప్పాడు. దీంతో ఫాతిమా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భార్యను హత్య చేసి మామకు ఫోన్
నిజామాబాద్ కు చెందిన సయ్యద్ ఖలీం కూతురు అనీస్ ఫాతిమాకు 2013లో సయ్యద్ సుల్తాన్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. ఫాతిమా, సుల్తాన్ దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. అంతసాఫీగా ఉందనుకున్న సమయంలో అనుమానం వారి మధ్య చిచ్చురేపింది. భార్యపై అనుమానం పెంచుకున్న సుల్తాన్ ఆమెను వేధించేవాడు. భర్తకు అత్త కూడా తొడవ్వడంతో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. భర్త అనుమానాన్ని తట్టుకోలేని ఫాతిమా తన ఇద్దరు పిల్లలతో కలిసి నిజామాబాద్ మూడో టౌన్ పరిధిలోని బ్యాంక్ కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటుంది. శనివారం రాత్రి 8 గంటల సమయంలో సయ్యద్ సుల్తాన్ తన మామ సయ్యద్ ఖలీంకు ఫోన్ చేసి పిల్లలను చూడటానికి వెళ్తున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేసిన సయ్యద్ ఫాతిమాను చంపేశానంటూ మామతో చెప్పాడు.
Also Read : Hyderabad: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళ, పీఎస్ కు దగ్గర్లోనే మృతదేహం!
Also Read : Nellore : వదిన-మరిది వివాహేతర సంబంధం, తమ్ముడిని కొట్టి చంపిన అన్న!