అన్వేషించండి

Hyderabad: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళ, పీఎస్ కు దగ్గర్లోనే మృతదేహం!

Hyderabad: వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని.. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చిందో మహా ఇల్లాలు. అనంతరం మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ కు సమీపంలో పడేసి ప్రియుడితో పారిపోయింది.

Hyderabad: హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చిందో భార్య. అనంతరం పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో మృతదేహాన్ని పడేసి పారిపోయింది. తాజాగా ఈ ఘటన  సంచలనం రేపుతోంది. 

లంగర్ హౌస్ కి చెందిన షేక్ ఫరీద్.. తన భార్యతో కలిసి జవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆమె మరో వ్యక్తితో పరిచయం పెంచుకుంది. తరచుగా అతడిని కలుస్తూ.. వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే ఈ విషయం భర్త ఫరీద్ కు తెలిసింది. దీంతో భార్యని మందలించాడు. పరువు పోతుందని ఈ పని మానుకొమ్మని సూచించాడు. అప్పటి నుంచి ప్రియుడిని కలవనీయకుండా చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్న భర్తను తొలగించుకోవాలనుకుంది. ప్రియుడికి ఫోన్ చేసి విషయం గురించి తెలిపింది. ఇద్దరూ కలిసి ఫరీద్ ను చంపేందుకు పథకం వేశారు. అనుకున్నట్లుగానే అతడిని చంపేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని లంగర్ హౌస్ లోని పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో పడేసి ప్రియుడితో కలిసి పారిపోయింది. 

అయితే పోలీస్ స్టేషన్ కు దగ్గర్లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు అయిన ఫరీద్ భార్యను, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు. 

తాజాగా కామారెడ్డిలోనూ ఇలాంటి ఘటనే..!

తాజాగా కామారెడ్డి జిల్లాలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో భర్తను హత్య చేయించిందో భార్య.. రుద్రూర్ లో  జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. రుద్రూర్ గ్రామానికి చెందిన కుమ్మరి పోశెట్టి వయస్సు 40 కి ధర్మాబాద్ బాలాపూర్ కు చెందిన సావిత్రితో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. దంపతులు ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ జీవించే వారు. ఈ క్రమంలో గృహ నిర్మాణ పనులు చేసే జెఎస్సీ కాలనీకి చెందిన బట్టు శ్రీనివాస్ తో సావిత్రికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఈ విషయం ఇటీవల సావిత్రి భర్త పోశెట్టికి తెలియడంతో భార్యతో ఘర్షణ పడ్డాడు. చెడు అలవాట్లు మానుకోవాలని సావిత్రికి చెప్పాడు. సావిత్రి బుద్ధి మార్చుకోనందున తరుచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో సావిత్రి తల్లి చంద్రభాగ ఇటీవల రుద్రూర్ వచ్చింది. కూతురుతో తరుచూ గొడవ పడుతున్న పోశెట్టిని తప్పించాలని తల్లి కూతుళ్లు శ్రీనివాస్ ను ప్రేరేపించారు. దీంతో ఈ నెల 2న పోశెట్టిని ఇంటి నుంచి శ్రీనివాస్ బైక్ పై  తీసుకుని వెళ్లాడు. కల్లు దుకాణంలో కల్లు తాగించాడు.

ఎట్టకేలకు భర్త కనిపించడం లేదని ఫిర్యాదు..

అనంతరం మద్యం షాపులో మందు తీసుకొని నక్కల ఒర్రెకు వెళ్లారు. అక్కడ పోశెట్టికి పూటుగా మద్యం తాగించి చెరువు బ్యాక్ వాటర్ ఒర్రెలోకి తోసేశాడు. చనిపోయాడని నిర్ధారించుకుని ఇంటికి వెళ్లి సావిత్రికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. అనంతరం సావిత్రి ఏమి తెలియనట్లు నటించింది. రెండు రోజులుగా పోశెట్టి కనిపించడం లేదని ఇరుగు పొరుగు వారు ప్రశ్నిస్తే సమాధానం దాటవేసింది. చివరకు పోలీస్ స్టేషన్ లో తన భర్త కన్పించడం లేదని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్సై రవీందర్ దర్యాప్తు చేయగా శ్రీనివాస్ సావిత్రికి ఉన్న సంబంధం బయట పడింది. శ్రీనివాస్ ను విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఘటనా స్థలికి రుద్రూర్ సీఐ జాన్ రెడ్డి, ఎస్సై రవీందర్ వెళ్లి మృతదేహాన్ని చెరువులో నుంచి వెలికి తీయించారు. మృతుడి భార్య సావిత్రి, అత్త చంద్రబాగ, శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget