అన్వేషించండి

పామర్రులో తొమ్మిదో తరగతి బాలికపై హత్యాచారం- నిందితుల అరెస్టు

చిన్నారి హత్యాచారం పామర్రు మండలంలో కలకలం రేగింది. ప్రేమ పేరుతో వంచించి, మాయమాటలతో లోబర్చుకుని హత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

కృష్ణా జిల్లా పామర్రులో దారణం జరిగింది. ఓ బాలికపై కొందరు దుర్మార్గులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. 

చిన్నారి హత్యాచారం పామర్రు మండలంలో కలకలం రేగింది. ప్రేమ పేరుతో వంచించి, మాయమాటలతో లోబర్చుకుని హత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దళిత బాలికపై కామాందులు సామూహిక అత్యాచారంకు పాల్పడి హత్య చేసి చేతులు దులుపుకున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

గుడివాడ డీఎస్సీ శ్రీకాంత్ చెప్పిన వివరాల ప్రకారం నాలుగు రోజుల క్రితం నిమ్మకూరు జెడ్పీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి విద్యార్థి అదృశ్యమైంది. స్కూల్‌కి వెళ్తున్నానని చెప్పి రాత్రి అయినా ఇంటికి రాలేదు. దీంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు చుట్టు పక్కల వాకబు చేశారు. ఫ్రెండ్స్‌ను అడిగారు. టీచర్స్‌కు కాల్‌ చేసి అడిగారు. అయినా ఎవరి నుంచి సరైన సమాధానం లేదు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఎనిమిది బృందాలతో దర్యాప్తు చేపట్టారు. 

విచారణలో భాగంగా పోలీసులు విస్తుపోయే విషయాలు వెలికి తీశారు. ఆ బాలికను ఈ నెల 20న పరిచయస్తుడైన లోకేశ్ అనే వ్యక్తి తీసుకెళ్లాడు. ఊయ్యారులోని రామచంద్ర లాడ్జికి ఉంచాడు. లాడ్జి గది లోపల లోకేశ్‌తోపాటు పెదనాన్న కొడుకు నరేంద్ర కూడ ఉన్నాడు. ఇద్దరు కలసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. లోకేష్ సొంత సోదరుడైన రాజేష్ బాలికను లాడ్జికి తీసుకువెళ్లేందుకు సహకరించినట్లు దర్యాప్తులో తేలిందని డీఎస్పీ చెప్పారు. 

బాలికను అదే రోజు సాయంత్రం ఐదు గంటల సమయంలో నిభానుపూడి వంతెన సమీపంలో గల కాపవరం బస్ స్టాండ్ వద్ద వదలిపెట్టి నిందితులు పరారయ్యారు. ఆ తరువాత వంతెన కింద కాలువలో బాలిక శవం అయ్యి కనిపించింది. దీంతో అందరూ ఆత్మహత్యగా భావించారు.

ప్రత్యక్ష సాక్షి కీలకం...
బాలిక వంతెనపై నడుచుకుంటూ వస్తుండగా ఒ వ్యక్తి ప్రత్యక్షంగా చూశాడు. ఆ తరువాత బాలిక శవం కనిపించటంతో ఈ వ్యవహరం సంచలనం అయ్యింది. అయితే పోలీసులు దర్యాప్తులో ప్రత్యక్ష సాక్షి ముందుకు వచ్చి బాలికను వదిలి వెళ్ళిన వారి వివరాలతోపాటుగా, బాలిక నడుచుకుంటూ వస్తున్నట్లుగా గుర్తించినట్లు వెల్లడించారు. 

కేసు దర్యాప్తు జరుగుతుండగానే బాలిక అంత్యక్రియలు నిర్వహించారు. మొవ్వ మండలం మంత్రిపాలెం సమీపంలో బాలిక అంత్యక్రియలు జరగగా, పోలీసులు మరలా బాలిక శవాన్ని తీసి పోస్ట్ మార్టం చేసి, సొమవారం మరలా అంత్యక్రియలు చేశారు. 

నిందితుల అరెస్ట్...
బాలికను మాయమాటలతో లాడ్డీకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన నిందితులపై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హజరు పరిచినట్టు డీఎస్పీ పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు ధర్మాప్తు చేయనున్నట్లు చెప్పారు. ఈ వ్యవహరం వెలుగులోకి రావటంతో నిభానుపూడిలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో అందరిని, నవ్వుతూ పలకరించే బాలిక మృతిని జీర్ణంచుకోలేక పోతున్నారు. 

అధికార పార్టీ నేతల పరామర్శ..
బాలిక కుటుంబానికి రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, మంత్రి జోగి రమేశ్, స్థానిక శాసన సభ్యుడు కైలే అనిల్ కుమార్, కృష్ణాజిల్లా కలెక్టర్ రాజాబాబు పరామర్శించారు. ప్రభుత్వం తరపున మూడు లక్షల చెక్కును మృతు రాలి తల్లికి అందజేశారు. హోంమంత్రి మాట్లాడుతూ బాలికలు, మహిళల పట్ల అత్యాచారాలకు పాల్పడే మృగాలను ఉపేక్షించమని, నిందితుల పై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు.అటు తెలుగు దేశం నేతలు బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

బందరు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, టీడీపీ నేతలు వర్ల కుమార్ రాజా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఆత్యాచారానికి గురైన బాలిక కేసును హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలన్నారు. రాష్ట్రంలో  గంజాయి, మద్యం అమ్మకాల వల్లనే ఈలాంటి దారుణాలు జరుగుతున్నాయని వారు మండిపడ్డారు. అధికార పార్టీ నేతల మెప్పు కోసం కాకుండా పోలీసులు శాంతి భదత్రల పరిరక్షణకు పనిచేయాలన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Embed widget