అన్వేషించండి
Nellore: నెల్లూరు జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా, డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం
Telugu News: విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న స్లీపర్ కోచ్ బస్సు డివైడర్ ను ఢీకొని కావలి వైపు వెళ్తున్న లారీని ఢీకొనడంతో బస్సు బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు.
![Nellore: నెల్లూరు జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా, డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం Nellore news Private travels Bus met with an Accident driver dies on spot Nellore: నెల్లూరు జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా, డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/22/818bca3b863a010f5326f5df47a6b1541716348267317234_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బోల్తా పడ్డ ప్రైవేటు బస్సు
Nellore Bus Accident: నెల్లూరు జిల్లాలో ఘోరమైన బస్సు ప్రమాదం జరిగింది. జిల్లాలోని సున్నపు బట్టి ప్రాంతంలో 45వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టి, ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టడంతో బస్సు డ్రైవర్ మరణించాడు. 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న స్లీపర్ కోచ్ బస్సు డివైడర్ ను ఢీకొని కావలి వైపు వెళ్తున్న లారీని ఢీకొనడంతో బస్సు బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. జాతీయ రహదారిపై 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
సినిమా
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion