News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Nellore News : లిథువేనియా యువతిపై అత్యాచారయత్నం కేసు, రికార్డు టైంలో దర్యాప్తు, న్యాయస్థానం తీర్పు

Nellore News : నెల్లూరు జిల్లాలో లిథువేనియా దేశస్థురాలిపై జరిగిన అత్యాచారయత్నం కేసును పోలీసులు 13 రోజుల్లోనే దర్యాప్తు, ట్రైల్ పూర్తి చేశారు. ఈ కేసులో న్యాయస్థానం తుదితీర్పు ఇచ్చింది. నిందితులకు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది.

FOLLOW US: 
Share:

Nellore News : లిథువేనియా(Lithuania)దేశానికి చెందిన యువతిపై అత్యాచారాయత్నం కేసులో 13 రోజుల్లోనే దర్యాప్తు, ట్రైల్ పూర్తి చేసి పోలీస్ శాఖ చరిత్ర సృష్టించిందని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత వేగంగా కేసు దర్యాప్తు జరిపిన చేసిన సందర్భాలు లేవన్నారు. ఈ కేసు నమోదు అయి ట్రైల్ పూర్తి అయ్యే వరకు నిరంతరం పర్యవేక్షించామని డీ‌జీ‌పీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. బాధితురాలు విదేశీ యువతి కావడంతో.. ఆమె దేశం విడిచి వెళ్తే జరిగే పరిణామాలను కేసు దర్యాప్తు, తీవ్రతపై పడే ప్రభావాన్ని  ముందుగానే అంచనా వేసి ఎప్పటికప్పుడు నెల్లూరు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేస్తూ ఈ కేసు దర్యాప్తు ముందుకు కొనసాగించామన్నారు. 

దిశ పోలీస్ స్టేషన్ కు కేసు బదిలీ 

నెల్లూరు జిల్లా  సైదాపురం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో తనపై అత్యాచారాయత్నానికి పాల్పడినట్లు మార్చి 8వ తేదీ ఉదయం సుమారు 11.30 గంటలకు లిథువేనియా(Lithuania)దేశానికి చెందిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు పై ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితులను మూడు గంటల్లో అరెస్టు చేశారు. డీజీపీ ఆదేశాలతో దిశ పోలీస్ స్టేషన్ కు కేసు బదిలీ చేశారు.   
కేసులో నిర్లక్ష్యానికి ఆస్కారం లేకుండా పకడ్బందీగా సాక్ష్యాధారాలను సేకరించి నిర్ణీత  గడువులోగా ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిందిగా ఎస్పీకి డీజీపీ ఆదేశాలు జారీచేశారు.

నిందితులకు 7 ఏళ్ల జైలు శిక్ష 

సైదాపురం పోలీస్ స్టేషన్ నుంచి దిశ స్టేషన్ కు కేసు  బదిలీ అయిన ఏడు రోజుల్లోనే నిర్ణీత గడువులోపే న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు. న్యాయస్థానంలో తక్షణమే ప్రాసిక్యూషన్ నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. షెడ్యూల్ మేరకు కేవలం మూడు రోజుల్లోనే న్యాయస్థానంలో విచారణను పూర్తి చేశారు. మార్చి 29 వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు సాక్షుల విచారణ, ఒక రోజులోనే సేకరించిన సాక్ష్యాధారాల పరిశీలన, రెండు రోజుల్లో ఇరు పక్షాల వాదనలను న్యాయస్థానం పూర్తి చేసింది. ఈ కేసుపై తుది తీర్పును న్యాయస్థానం మే 5న వెల్లడించింది. మనుబోలు మండలం బద్దవోలు వెంకన్నపాలేనికి చెందిన ఇంగిరాల సాయికుమార్ కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష, గూడూరు శారదనగర్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ మహ్మద్‌ అబీద్‌ కు ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున జరిమానా విధిస్తూ నెల్లూరు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

నేరస్థులకు గుణపాఠం

నేరస్థులకు ఈ విచారణ, శిక్ష ఒక గుణపాఠం అని పోలీసులు అంటున్నారు. గతంలో నేరాలకు పాల్పడితే సంవత్సరాల కొద్దీ శిక్షలు పడవు అని మహిళలపై నేరాలకు పాల్పడే వారికి ఇదొక గట్టి గుణపాఠం గా ఉంటుందన్నారు. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లోని పోలీస్, న్యాయవ్యస్థ, ప్రాసిక్యూషన్  అత్యంత వేగంగా సమన్వయంతో ఏకతాటిపై ముందుకు సాగుతూ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని విదేశీ మహిళకు న్యాయం అందించామన్నారు. 

Published at : 06 May 2022 07:51 PM (IST) Tags: ap police Nellore news Lithuania woman Sexually abused case

ఇవి కూడా చూడండి

Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ

Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ

మణిపూర్‌ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం

మణిపూర్‌ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం

ఆన్‌లైన్‌లో మెక్సికన్‌ మహిళతో పరిచయం,ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం - నిందితుడు అరెస్ట్

ఆన్‌లైన్‌లో మెక్సికన్‌ మహిళతో పరిచయం,ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం - నిందితుడు అరెస్ట్

Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో

Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో

Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య

Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య

టాప్ స్టోరీస్

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
×