News
News
X

Nellore Girl Kidnap: నెల్లూరులో బాలిక కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు, గంటల వ్యవధిలో కిడ్నాపర్ అరెస్ట్

నెల్లూరు జిల్లాలో మైనర్ బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఆ బాలికను క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు పోలీసులు.

FOLLOW US: 
Share:

నెల్లూరు జిల్లాలో మైనర్ బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఆ బాలికను క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు పోలీసులు. గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ ని పట్టుకున్నారు. తల్లిదండ్రుల ఆందోళనను తీర్చారు. జిల్లా పోలీసులు చాకచక్యంతో కిడ్నాప్ కేసుని ఛేదించి మైనర్ బాలికను సురక్షితంగా విడిపించారు.

అసలేం జరిగింది..?

మంగళవారం ఉదయం నెల్లూరుజిల్లా దుత్తలూరు మండలం ఏసీ కాలనీ లో అప్పర్ ప్రైమరీ స్కీల్ లో మూడో తరగతి చదువుకునే బాలిక ను ఓ గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేసింది. బాలికకు తాను మేనత్తను అని చెప్పి స్కూల్ నుంచి పాపను తీసుకెళ్లింది. బాలికకు తినుబండారాలు కొనిచ్చి తిరిగి తీసుకొస్తానని ఆ మహిళ స్కూల్ టీచర్లకు చెప్పి పాపను తీసుకెళ్లింది. ఆ తర్వాత ఎంత సేపటికి ఆమె తిరిగి రాలేదు. దీంతో పాపకోసం వేచి చూసిన టీచర్ చివరకు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చివరకు వారు పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. దుత్తలూరు నుంచి వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు జల్లెడ పడ్డారు. చివరకు బైక్ పై మైనర్ బాలికను తీసుకెళ్తున్న ఓ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద పోలీసులకు చిక్కారు. వెంటనే పాపను పోలీసులు దుత్తలూరుకి తీసుకొచ్చారు. ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు.

ఎందుకిదంతా.. ?

మైనర్ బాలిక పెదనాన్న ఓ వ్యక్తి దగ్గర పెద్ద మొత్తం అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చాలని అడినా ఆయన తిరిగివ్వలేకపోయాడు. దీంతో పాపను కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని భావించారు. దీనికోసం పాపకు మేనత్త వరుస అయ్యే మహిళను దుండగులు సంప్రదించారు. పాపను స్కూల్ నుంచి బయటకు తీసుకొస్తే చాలని, ఆ తర్వాత తాము పని పూర్తి చేస్తామని చెప్పి ఆమెకు డబ్బు ఆశ చూపించారు. దీంతో ఆమె పాపను బయటకు తీసుకొచ్చింది. ఆ పాపను దుండగులు బైక్ పై ఎక్కించుకుని దాచేపల్లి వైపు వెళ్లారు. వెంటనే పోలీసులు అప్రమత్తం కావడంతో వ్యవహారం బయటపడింది. పోలీసులు వారిద్దర్నీ అదుపులోకి తీసుకుని పాపను రక్షించారు.

పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో ఈ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. దుత్తలూరునుంచి అన్నివైపులా జిల్లా పోలీసులు చెక్ పోస్ట్ ల వద్ద నిఘా పెట్టారు. అనుమానాస్పదంగా వెళ్లేవారిని ఆపి ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో పాపను బైక్ పై కూర్చోబెట్టుకుని ఆదుర్దాగా వెళ్తున్న జంటను దాచేపల్లి వద్ద పోలీసులు ఆపి ప్రశ్నించారు. వారు తడబడటంతో వెంటనే అదుపులోకి తీసుకుని అసలు విషయం రాబట్టారు. నిందితులు ఆ పాపను వరంగల్ తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని తేలింది. శీనయ్య, వెంకటరమణమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.

గంటల వ్యవధిలోనే ఈ కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులకు పాప తల్లిదండ్రులు కృతజ్ఞత తెలిపారు. ఇకపై స్కూల్ కి ఎవరైనా వచ్చి వారి బంధువులమంటూ పిల్లల్ని తీసుకెళ్లాలని చూస్తే, వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు పోలీసులు. అపరిచిత వ్యక్తులకు పిల్లలను అప్పగించవద్దని హెచ్చరిస్తున్నారు. అనుమానం ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

Published at : 06 Dec 2022 10:34 PM (IST) Tags: nellore police Nellore Crime girl kidnap Nellore News Nellore Girl Kidnap Case

సంబంధిత కథనాలు

Hyderabad Crime News: బర్త్ డే పార్టీలో బాలికపై యువకుల గ్యాంగ్ రేప్- హైదరాబాద్‌లో మరో దారుణం!

Hyderabad Crime News: బర్త్ డే పార్టీలో బాలికపై యువకుల గ్యాంగ్ రేప్- హైదరాబాద్‌లో మరో దారుణం!

UP News: ప్రియుళ్లతో పారిపోయిన ఐదుగురు వివాహితలు - ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే!

UP News: ప్రియుళ్లతో పారిపోయిన ఐదుగురు వివాహితలు - ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Hyderabad Crime News: ప్రేమించి పెళ్లాడింది, మరో వివాహం చేసింది - తర్వాతే అసలు కథ మొదలైంది!

Hyderabad Crime News: ప్రేమించి పెళ్లాడింది, మరో వివాహం చేసింది - తర్వాతే అసలు కథ మొదలైంది!

Kakinada Crime: జల్సాలకు అలవాటుపడి వరుస చోరీలు, నిద్రపోతున్న ప్రయాణికులే వీరి టార్గెట్!

Kakinada Crime: జల్సాలకు అలవాటుపడి వరుస చోరీలు, నిద్రపోతున్న ప్రయాణికులే వీరి టార్గెట్!

Mancherial Crime: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య ఆత్మహత్య కలకలం!

Mancherial Crime: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య ఆత్మహత్య కలకలం!

టాప్ స్టోరీస్

Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !

Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్  !

Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?

Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?

No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్‌న్యూస్‌! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్‌ తెస్తున్నారు!

No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్‌న్యూస్‌! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్‌ తెస్తున్నారు!