అన్వేషించండి

Cyber Crime : గూగుల్ లో నెంబర్ సెర్చ్ చేస్తే రూ.1.24 లక్షలు మాయం

Cyber Crime : ఏ అడ్రస్ కావాలన్నా, ఏ వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే గూగుల్ చేస్తున్నారు. అలా ఓ వ్యక్తి చేసిన పని అతడి బ్యాంక్ బ్యాలెన్స్ మాయం చేసింది. లక్షా 24 వేల రూపాయలు అకౌంట్లోంచి డెబిట్ అయ్యేలా చేసింది.

Cyber Crime : ఆన్ లైన్ మోసాలకు అడ్డూఆపూ లేకుండా పోతోంది. ఇటీవల నెల్లూరు జిల్లాలో కూడా ఆన్ లైన్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ ఆన్ లైన్ మోసాలకు కొంత మంది గూగుల్ ని వేదికగా ఉపయోగించుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏ చిన్న అవసరం వచ్చినా ఇప్పుడు గూగుల్ చేయడం అందరికీ అలవాటైపోయింది. ఏ అడ్రస్ కావాలన్నా, ఏ ఫోన్ నెంబర్ తెలుసుకోవాలన్నా వెంటనే గూగుల్ చేస్తున్నారు. అలా ఓ వ్యక్తి చేసిన పని అతడి బ్యాంక్ బ్యాలెన్స్ మాయం చేసింది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా లక్షా 24 వేల రూపాయలు అకౌంట్లో నుంచి డెబిట్ అయ్యేలా చేసింది.  

అసలేం జరిగింది? 

నెల్లూరు నగరం చిన్నబజారు కామాటి వీధికి చెందిన చింతల సాయి గణేష్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అవుతుందని కుటుంబ సభ్యులు చెప్పారు. దాని రిపేర్ కోసం తీసుకెళ్లాలి. అయితే రిపేర్ చేసే వ్యక్తిని ఇంటికే పిలుద్దామనే ఉద్దేశంతో కంపెనీ టోల్ ఫ్రీ నెంబర్ కోసం వెదికాడు సాయి గణేష్. ఆ నెంబర్ కనిపించకపోవడంతో గూగుల్ లో సెర్చ్ చేశాడు. గూగుల్ లో కనిపించిన టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేశాడు. అవతలి వ్యక్తి కాల్ లిఫ్ట్ చేసి, మా ప్రతినిధి వెంటనే మిమ్మల్ని సంప్రదిస్తాడని చెప్పి పెట్టేశాడు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. మెల్లిగా ఉచ్చులో చిక్కుకున్నాడు సాయి గణేష్. ఈసారి ఫోన్ చేసిన ఆ ముఠా సభ్యులు సాయి గణేష్ ఫోన్  లో ఎనీ డెస్క్ యాప్ ని ఇన్ స్టాల్ చేయాలమని చెప్పారు. ఆ యాప్ ఇన్ స్టాల్ చేయగానే ఆఫోన్ ని అవతలి వ్యక్తులు హ్యాక్ చేశారు. ఆ తర్వాత వారు ఓటీపీ నెంబర్లను తెలుసుకున్నారు. దీంతో సాయి గణేష్ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయింది. మొత్తం రూ.1,24,605 తన అకౌంట్ నుంచి కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత సాయి గణేష్ మళ్లీ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయగా స్విచాఫ్ చేసినట్టు వచ్చింది. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు సంతపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇన్‌ స్పెక్టర్‌ షేక్‌ అన్వర్‌ బాషా కేసు నమోదు చేసి, వివరాలు సేకరించారు. బాధితుడిని తీసుకెళ్లి చెన్నైలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

గూగుల్ అన్నీ నిజాలు చెబుతుందా..?

గూగుల్ లో అన్నీ సరైన వివరాలే దొరుకుతాయా? గూగుల్ లో వెదికినవన్నీ కరెక్ట్ గానే ఉంటాయా ? ఇటీవల చాలామంది మోసగాళ్లు బ్యాంక్ వెబ్ సైట్లను పోలిన నకిలీ వెబ్ సైట్లను రూపొందిస్తున్నారు. గూగుల్ లో వెదికితే, అసలు వెబ్ సైట్ తో పాటు, ఈ నకిలీ వెబ్ సైట్లు కూడా ఉంటాయి. అందులో వివరాలు నమోదు చేస్తే, బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అవుతుంది. ఇలాంటిదే ఈ మోసం కూడా. ఇక్కడ నేరుగా బాధితుడు మోసగాళ్లకే ఫోన్ చేసి ఇరుక్కుపోయాడు. ఒకవేళ తెలియని వ్యక్తులతో ఫోన్లో మాట్లాడాల్సి వస్తే, మన వివరాలు పూర్తిగా చెప్పకపోవడమే మంచిది. అందులోనూ యాప్ లను ఇన్ స్టాల్ చేసుకుంటే అసలుకే మోసం వస్తుంది. ఇంటర్నెట్ వల్ల ఎంత లాభం ఉందో, అంతే నష్టం కూడా జరిగే అకాశముంది. అందుకే నిత్యం అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు పోలీసులు. ఆన్ లైన్ ఫ్రాడ్ కి సంబంధించి వెంటనే తమకు ఫిర్యాదు చేయాలంటున్నారు. 

Also Read : గుంటూరులో నకిలీ యూనివర్శిటీ - ఓ సారి మీ సర్టిఫికెట్ సరి చూసుకుంటే బెటర్ !

Also Read : తెలుగు రాష్ట్రాల్లో నయా పొలిటికల్ ట్రెండ్, ప్రత్యర్థులపై పంచ్ డైలాగ్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Siddipet Couple: భర్త ఉరి వేసుకున్నాడని తెలిసి భార్య 17వ అంతస్తు నుంచి దూకేసింది - బెంగళూరులో సిద్ధిపేట దంపతుల విషాదం
భర్త ఉరి వేసుకున్నాడని తెలిసి భార్య 17వ అంతస్తు నుంచి దూకేసింది - బెంగళూరులో సిద్ధిపేట దంపతుల విషాదం
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
Crime News: స్కూల్ విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడి.. 14 ఏళ్లకే తల్లయిన బాలిక- కర్నూలులో దారుణం
స్కూల్ విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడి.. 14 ఏళ్లకే తల్లయిన బాలిక- కర్నూలులో దారుణం

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
AP handloom weavers: ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
Kerala Assembly Elections: కేరళలో బీజేపీ అగ్రనేతల విస్తృత ప్రచారం - మార్పు కనిపిస్తోందని ధీమా!
కేరళలో బీజేపీ అగ్రనేతల విస్తృత ప్రచారం - మార్పు కనిపిస్తోందని ధీమా!
Donald Trump: దారిలోకి రాని ఇరాన్! ట్రంప్‌లో పెరిగిపోతున్న అసహనం! మిత్రదేశాలకు తీవ్ర హెచ్చరిక!
దారిలోకి రాని ఇరాన్! ట్రంప్‌లో పెరిగిపోతున్న అసహనం! మిత్రదేశాలకు తీవ్ర హెచ్చరిక!
IT Rules 2021 Amendments:డిజిటల్ మీడియాపై పట్టుకు కేంద్రం ప్రయత్నిస్తోందా? కొత్తగా తీసుకొస్తున్న మార్పులేంటీ?
డిజిటల్ మీడియాపై పట్టుకు కేంద్రం ప్రయత్నిస్తోందా? కొత్తగా తీసుకొస్తున్న మార్పులేంటీ?
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Third Temple In Israel: ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
Embed widget