(Source: ECI/ABP News/ABP Majha)
Political Dialogs : తెలుగు రాష్ట్రాల్లో నయా పొలిటికల్ ట్రెండ్, ప్రత్యర్థులపై పంచ్ డైలాగ్స్
Political Dialogs : రాజకీయం చేయాలంటే ప్రత్యర్థుల కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదవాలంటారు. మాటలతో మాయ చేసే నేతలు స్టైల్ మారుస్తున్నారు. ప్రాసలు, సినిమా డైలాగ్స్ తో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు.
Political Dialogs : సినిమా డైలాగుల కన్నా ఈ మధ్యన పొలిటీషియన్ల డైలాగులే సూపర్ గా జనాల్లోకి వెళ్తున్నాయి. ఊరమాస్ కి తగ్గట్టు కొందరు, ప్రాసలతో ఇంకొందరు అదరగొడుతున్నారు. అలా చాలారోజుల తర్వాత ఒక్కరోజే ప్రముఖ రాజకీయ నేతల నుంచి వచ్చిన పంచ్ డైలాగులు మరోసారి ఆసక్తికరంగా మారాయి. తెలంగాణ విషయానికొస్తే పంచ్ డైలాగులు చెప్పడంలో సీఎం కేసీఆర్ ని మించిన వాళ్లు లేరు. హిందీ, ఇంగ్లీషు, తెలంగాణ, ఆంధ్రా ఏ భాషలోనైనా సరే ఆ ప్రాంతానికి తగ్గట్టు మాట్లాడటం కేసీఆర్ నైజం. ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలోనూ, ప్రజలకు ఏ విధంగా చెబితే పనవుతుందో కేసీఆర్ కి తెలిసినంత మరెవరికీ తెలియదు. అందుకే తెలంగాణ సీఎంని మాయల మాటగాడు అని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. ఇప్పుడలానే మరోసారి తన మాటలతో తెలంగాణ ప్రజలను ఆలోచనలో పడేశాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కేసీఆర్ పంచ్ డైలాగ్
రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్ లో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనం, టీఆర్ఎస్ ఆఫీసుని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతల మతవిద్వేషపూరిత మాటలపై తనదైన శైలిలో విమర్శించారు. ఆయన మాట్లాలో అందరినీ ఆకట్టుకున్న డైలాగ్ పంటల తెలంగాణ కావాలా..మంటల తెలంగాణ కావాలా అని ప్రజలను అడిగిన తీరుతో మరోసారి కేసీఆర్ పంచ్ డైలాగ్ ఇంట్రస్టింగ్ గా మారింది.
సీఎం జగన్ కూడా
ఇక ఆంధ్ర విషయానికొస్తే సీఎం జగన్ కూడా విపక్షాలపై ఓ పంచ్ డైలాగ్ వదిలారు. మొన్నా ఆ మధ్య నా వెంట్రుక కూడా పీకలేరన్న డైలాగ్ తో కాకరేపిన సీఎం జగన్ ఇప్పుడు ప్రతిపక్షాల స్టైల్లోనే దోచుకో..తినుకో..పంచుకో అన్న విధంగా గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మరోవైపు విపక్ష నేత చంద్రబాబు కూడా జగన్ పై కోపాన్ని చూపించారు. ఆ ఆవేశంలోనే ఖబడ్దార్ అని హెచ్చరించారు కూడా. ఈ మాట కొత్త కాకపోయినా ఆయన చెప్పిన విధానం జనాల్లో ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు ధర్మపోరాటం చేస్తానంటూ రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపిన తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. కుప్పంలో పర్యటనలో తనపై, టీడీపీ శ్రేణులపై ప్రభుత్వం, పోలీసులు, వైసీపీ శ్రేణులు అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతూ చంద్రబాబు మరోసారి తన స్టైల్లో జగన్ ని ఏకిపారేశారు. ఇలా తెలుగు రాష్ట్రాల ప్రముఖ నేతలు కాకరేపే మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఎవరికి వారు తమ అభిమాన నేతల మాటలను సినిమా క్లిప్స్ తో జతకలుపుతూ వైరల్ చేస్తున్నారు. సినిమా డైలాగ్స్ తో పాటు పొలిటికల్ లీడర్స్ డైలాగ్స్ ను ట్రోలర్స్ బాగా వాడుతున్నారు.
Also Read : TS High Court : బండి సంజయ్ పాదయాత్రను ఆపండి, హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్
Also Read : TRS Tension : టీఆర్ఎస్ లీడర్లలో టెన్షన్ టెన్షన్ ! బీజేపీపై ఆ దూకుడు చూపించలేకపోతున్నారా ?