Nandyal Crime News: ఫోన్ వస్తే చాలు వణికిపోతున్న ఉమ్మడి కర్నూలు జిల్లా మహిళలు
Nandyal Crime News: ఉమ్మడి కర్నూలు జిల్లాలో మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా న్యూడ్ కాల్స్ చేస్తూ.. బెదిరింపులకు పాల్పడడం కలకలం రేపుతోంతి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.
Nandyal Crime News: ఈ మధ్య తరచుగా మహిళలకు న్యూడ్ కాల్స్ చేస్తూ పలువురు అగంతకులు వేధిస్తున్నారు. ఫోన్ చేసిన సమయంలో వికృత చేష్టలు చేస్తూ.. నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఇది చూసిన మహిళలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కట్ చేస్తున్న తరచుగా ఫోన్‌లు చేస్తూ వేధిస్తున్నారు. అయితే ఈ విషయం బయట తెలిస్తే ఎక్కడ తమ పరువు పోతుందోనని భావించిన మహిళా బాధితులు తమలో తామే కుమిలిపోతున్నారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ధైర్యంగా బయటకు వచ్చి తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
నంద్యాల జిల్లాలో విపరీతంగా వస్తున్న న్యూడ్ కాల్స్..
నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు.. మహిళలకు న్యూడ్ కాల్స్ చేసి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. కొందరు అగంతకులు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి న్యూడ్ వీడియో కాల్స్ చేస్తున్నారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ చేసిన సమయంలో డ్యాన్సులు వేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారని వాపోతున్నారు. మహిళలు భయంతో ఆ కాల్స్‌ను కట్ చేసినా మళ్లీ ఫోన్ చేసి వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇటీవల కాలంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో న్యూడ్ కాల్ సంబంధిత బాధితులు వేధింపులకు పాల్పడ్డమే కాకుండా చాలా మొత్తంలో నగదును కూడా పోగొట్టుకున్న విషయం తెలిసిందే. కాల్ వ్యవహారంలో మహిళలు.. పురుషులకు వీడియో కాల్ చేసి నగ్నంగా బట్టలు విప్పి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ.. ఇద్దరు మాట్లాడినటువంటి నగ్న వీడియోలను రికార్డ్ చేసి సదరు వ్యక్తికే పంపించి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. కానీ ఇప్పుడు తీరు మార్చారు. మహిళలు కాల్స్ చేయడం కాకుండా.. పురుషులే కాల్స్ చేస్తూ.. మహిళలను ఇబ్బంది పెడుతున్నారు. న్యూడ్ కాల్స్ చేసే మహిళలు అందంగా ఉండటమే కాకుండా ఎదుటి వారు వారి మాట వినేలా చూసుకుంటున్నారు. చూపులతోనే వలలో వేస్కొని లక్షలకు లక్షల సొమ్మును దోచేసేవారు. న్యూడ్ కాల్ వ్యవహారంలో సామాన్య ప్రజల నుంచి ప్రజాప్రతినిధులు వరకు ఉన్నారు. రాత్రికి రాత్రే ఫేమస్ అయిన రాజకీయ ప్రముఖులు కూడా ఈ వ్యవహారంలో చిక్కుకొని అనేక ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
న్యూడ్ కాల్ బారిన పడకుండా తప్పించుకోవడం ఎలా...!
న్యూడ్ కాల్ బారిన పడకుండా ఉండాలంటే ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్‌లలో తెలిసిన వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్ లను మాత్రమే యాక్సెప్ట్ చేయడం, తెలిసిన వారితో మాత్రమే చాటింగ్, ఫోన్ లు చేయాలని చెబుతున్నారు. ముఖ్యంగా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి వాటిలో అందమైన ఫోటోలను రాజకీయ, సినీ ప్రముఖుల ఉన్నతమైన వ్యక్తుల ఫోటోలను తమ ప్రొఫైల్లో పెట్టుకొని పలువురిని టార్గెట్ చేసి మొదట హాయ్ తో మొదలెట్టి చివరకు డబ్బు వేస్తావా, వస్తావా అనే రేంజ్ లో తెగబడుతున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాత్రం భిన్నం..
న్యూడ్ కాల్ విషయంలో మహిళలు పురుషులను టార్గెట్ గా చేసి సొమ్మును డిమాండ్ చేసేవారు. అయితే కర్నూలు జిల్లాలో మాత్రం భిన్నంగా పురుషులు మహిళలకు ఫోన్లు చేస్తున్నారు. మొదట మాట్లాడటం, హాయ్ అంటూ మెసేజ్ చేయడం, మాట మాటా కలిపి వీడియో కాల్ లో మాట్లాడుకోవడం వరకు సాగుతుంది. ఆ తర్వాత ఆ వీడియో కాల్ ని చిత్రీకరించి వారికే ఆ వీడియోను పంపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో నంద్యాల జిల్లా వ్యాప్తంగా కలకల సృష్టించిందని మహిళలు ఆ చిక్కు నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు.
అగంతకుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోవడంతో కొంతమంది బాధిత మహిళలు ధైర్యంతో పోలీసుల్ని ఆశ్రయించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది మహిళల్ని బూతులు తిట్టడంతో భయడపడుతున్నారు. కొందరు పరువు పోతుందన్న భయంతో బయటకు చెప్పలేకపోతున్నారు. బాధిత మహిళలు బయటకు చెప్పుకోలేక బాధపడుతున్నారు. ఎవరైనా ఇలా ఇబ్బంది పడుతుంటే బాధితులు తమకు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఫిర్యాదు చేస్తే సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో దర్యాప్తు చేస్తామన్నారు రాబోయే రోజుల్లో ఇలాంటి కాల్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. త్వరలోనే వీడియో కాల్స్ చేస్తున్న అగంతకులను పట్టుకుని కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలుపుతున్నారు.