News
News
వీడియోలు ఆటలు
X

Mobile Theft: ఈ చిన్న టెక్నిక్‌తో మిస్సైన 50 ఫోన్ల రికవరీ, ఫోన్ పోతే ఈసారి మీరూ ఇలా చేయండి!

50 మంది బాధితులను పిలిచి ఫోన్ల అప్పగింత

నల్గొండ పోలీసులపై అభినందనలు

FOLLOW US: 
Share:

ఈ రోజుల్లో ఫోన్ పోయిందంటే మాగ్జిమం మరిచిపోవాల్సిందే! మళ్లీ దొరికిదంటే అదృష్టమే! ఎఫ్‌ఐఆర్‌లు వగైరా, టైం వేస్ట్ వ్యవహారం! దానికంటే కొత్తది కొనుక్కోవడం బెటర్! బేసిగ్గా అందరి ఆలోచనా ఇదే! కానీ, అలాంటి నిరాశ పనికిరాదని నిరూపించారు నల్గొండ ఎస్పీ అపూర్వరావు! ఒక సింపుల్ టెక్నిక్ ఉపయోగించి, ఏకంగా 50 మంది బాధితులకు వాళ్లు పోగొట్టుకున్న ఫోన్లను అందజేశారు. ఇంతకూ ఏంటా టెక్నిక్??

ఫోన్ పోగొట్టుకోగానే, చేయాల్సిన పని ఇదే

కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖా ఆద్వర్యంలో  CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ప్రవేశపెట్టింది. ఇందుకోసం www.ceir.gov.in  వెబ్ సైట్‌లోకి లాగిన్ కావాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ లింక్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయాలి. పోయిన మొబైల్లోని నంబర్లు, IMEI నంబరు, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్‌లోడ్ చేయాలి. మొబైల్ ఏ రోజు పోయింది? ఎక్కడ పోయింది? రాష్ట్రం, జిల్లా, పోలీసు స్టేషన్ లో  ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈ-మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఓటిపి (OTP) కోసం మరో ఫోన్ నెంబర్ ఇవ్వాలి.

ఇదంతా పూర్తయిన తర్వాత ఒక ఐడీ నెంబర్ వస్తుంది. ఆ ఐడి మిస్సయిన ఫోన్ స్టేటస్ తెలుపుతుంది. అది ఎక్కడుంది? ఎవరి చేతుల్లో ఉంది అనే వివరాలను ఐడెంటిఫై చేస్తుంది. మొబైల్ ఏ కంపెనీది అయినా సీఈఐఆర్ విధానం ద్వారా ఆ ఫోన్ పని చేయకుండా చేస్తుంది. ఈ సాంకేతికను ఉపయోగించి మొబైల్ ఫోన్లను వెతికి పట్టుకున్నారు నల్గొండ 2 టౌన్ పోలీసులు. వాళ్లదగ్గరికి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా, ఈ టెక్నాలజీతో ఫోన్లను ట్రేస్ చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 50 ఫోన్లను వెతికిపట్టుకున్నారు. ఈ టాస్క్‌లో సక్సెస్ అయిన టూ టౌన్ సబ్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, సిబ్బంది బాలకోటి, శంకర్‌ తదితరులను ఎస్పీ అపూర్వరావు  అభినందించారు. 50 మంది బాధితులను ఒకేసారి పిలిచి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫోన్లను అప్పగించారు. పోయిన మొబైల్స్ తిరిగి వచ్చినందుకు బాధితులు ఆనందం వ్యక్తం చేశారు.

ఫోన్ దొరకగానే టాస్క్ అక్కడితో ఆగిపోదు

ఫోన్ దొరికిన తర్వాత సదరు ఫిర్యాదుదారుడు చేయాల్సిన మరోపని- అన్ బ్లాక్! దీనికి ఇంకో ప్రాసెస్ ఉంటుంది. ఫోన్ దొరికిన అదే వెబ్‌ సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ అన్ బ్లాక్/ఫౌండ్ మొబైల్ అనే లింక్ పై క్లిక్ చేయాలి. అడిగిన ఐడి నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుంది. లేకుంటే ఫోన్ ఆన్ కాదు. ఫోన్ పనిచేస్తున్న విషయాన్ని దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలి.

వెబ్ సైట్ గురించి అందరికీ తెలియాలి

CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు జిల్లా ఎస్సీ అపూర్వ రావు. మొబైల్ ఫోన్ పోయినా, చోరికి గురైనా www.ceir.gov.in పోర్టల్లో పిర్యాదు చేసుకోవాలన్నారు. ఆ సైట్‌పై ప్రత్యేక అవగాహన కలిగిఉండాలని అన్నారు. దీని ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుంది అని ఎస్పీ తెలిపారు. ఈ సైట్ ఆపరేషనకు సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్లలో అధికారులకు  శిక్షణ ఇచ్చామని చెప్పారు. ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నామని ఎస్పీ అపూర్వరావు తెలిపారు.

Published at : 04 May 2023 08:37 PM (IST) Tags: Nalgonda Police Mobile Lost Mobile Theft CEIR Trace out Central Equipment Identity Register SP Apurva Rao Central Portal Ministry of Telecom Mobile numbers IMEI number

సంబంధిత కథనాలు

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి

Anakapalli Lovers: లాడ్జిలో రూం తీసుకొని లవర్స్ ఆత్మహత్యాయత్నం, యువతి మృతి, కొనఊపిరితో యువకుడు!

Anakapalli Lovers: లాడ్జిలో రూం తీసుకొని లవర్స్ ఆత్మహత్యాయత్నం, యువతి మృతి, కొనఊపిరితో యువకుడు!

Guntur News: రెండేళ్ల కన్నకూతుర్ని బడకేసి కొట్టిన తండ్రి! స్పాట్‌లోనే చిన్నారి మృతి

Guntur News: రెండేళ్ల కన్నకూతుర్ని బడకేసి కొట్టిన తండ్రి! స్పాట్‌లోనే చిన్నారి మృతి

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్

Canada Gangster Murder : కెనడాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ సింగ్ మర్డర్ - అచ్చం సినిమాల్లోలాగే !

Canada Gangster Murder :   కెనడాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ సింగ్ మర్డర్ - అచ్చం సినిమాల్లోలాగే !

టాప్ స్టోరీస్

AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

AP Cabinet Meeting :  ఏడో తేదీన ఏపీ కేబినట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Andhra Politics : వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?

Andhra Politics :  వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?

Shaitan Web Series : గేరు మార్చిన మహి - కామెడీ కాదు, సీరియస్ క్రైమ్ గురూ!

Shaitan Web Series : గేరు మార్చిన మహి - కామెడీ కాదు, సీరియస్ క్రైమ్ గురూ!