News
News
వీడియోలు ఆటలు
X

Nalgonda Lovers Suicide: నల్గొండ జిల్లాలో విషాదం... ప్రేమను చంపుకోలేక ప్రాణాలు తీసుకున్నారు...

పెద్దలను కాదనలేక ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. యువతికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించడంతో ఆ ప్రేమజంట ఆయువుతీసుకుంది.

FOLLOW US: 
Share:

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని తిరుమలగిరి మండలం తెట్టేకుంట గ్రామంలో  ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తెట్టేకుంట గ్రామానికి చెందిన మిట్టపల్లి కొండల్(22), సంధ్య(19) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. యువతి యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. 

Also Read: నడిరోడ్డుపై ఆగిపోయిన కారు.. డోర్ తీసి చూస్తే డెడ్ బాడీ... కూపీ లాగితే సంచలన విషయం

మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయం

మిట్టపల్లి కొండల్, సంధ్య గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం పెద్దలకు తెలిసి యువతికి ప్రేమించిన వ్యక్తిని కాదని వేరొకరితో వివాహం నిశ్చయించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. యువకుడి ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వారిద్దరినీ చికిత్స కోసం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ ఆదివారం మరణించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను సాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. 

Also Read: పెళ్లైన రెండు నెలలకే భార్యను అమ్మేసిన భర్త.. ఆమెకు ఏం చెప్పి అమ్మాడో తెలుసా!

రూ.2 వేల అప్పు దొరకలేదని ఆత్మహత్య

తెలంగాణ మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం పొన్నాల్‌లో విషాద ఘటన జరిగింది. అప్పు తీర్చేందుకు రూ.2 వేలు దొరకలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పొన్నాల్‌‌కు చెందిన మర్యాల ఆనంద్‌(23) తుర్కపల్లిలోని ఓ కంపెనీ పనిచేస్తున్నాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌కు చెందిన కుంచెరుకలి వద్ద రూ.10 వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పును తీర్చాలని కొందరు వ్యక్తులు ఈ నెల 22న పొన్నాలలోని ఆనంద్‌ ఇంటికి వచ్చారు. అయితే తన వద్ద ప్రస్తుతానికి డబ్బులు లేవని, త్వరలో ఇస్తానని చెప్పాడు. అయినా వాళ్లు వినలేదు తీవ్ర ఒత్తిడి చేశారు. కనీసం రూ.2 వేలు ఇస్తే కొత్త నోటు రాసి ఇస్తామని ఒత్తిడి చేశారు. దీంతో రూ.2 వేల కోసం ఆనంద్‌ చాలామందిని అడిగాడు. ఎక్కడా అప్పు దొరకలేదు. 

Also Read: మహిళ వాట్సాప్ కు నీలి చిత్రాలు... కిటికీ దగ్గర వింత అరుపులు... యువకుడి వెకిలి చేష్టలు

డబ్బు ఇచ్చే వరకూ తమతో రావాలని అతన్ని శనివారం తుర్కపల్లి వరకు తీసుకెళ్లారు. చివరకు తెలిసిన వాళ్లు వెయ్యి రూపాయలు ఇస్తే ఆ డబ్బులతో కొత్త నోటు రాసుకుని వెళ్లిపోయారు. ఇంటికొచ్చిన ఆనంద్‌ రూ.2 వేల కోసం తనను ఎవరూ నమ్మలేదని మనస్తాపంతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 24 Oct 2021 05:23 PM (IST) Tags: telangana crime news TS News lovers suicide Nalgonda crime

సంబంధిత కథనాలు

Coromandel Express Accident: వెల్లివిరిసిన మానవత్వం - రైలుప్రమాద బాధితులకు రక్తమిచ్చేందుకు క్యూ కట్టిన యువకులు !

Coromandel Express Accident: వెల్లివిరిసిన మానవత్వం - రైలుప్రమాద బాధితులకు రక్తమిచ్చేందుకు క్యూ కట్టిన యువకులు !

Coromandel Express Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి! - ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం

Coromandel Express Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి! - ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం

Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ- రైల్వే మంత్రికి ఫోన్!

Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ- రైల్వే మంత్రికి ఫోన్!

Odisha Train Accident: 50 అంబులెన్సులు కూడా సరిపోలేదు! మమతా బెనర్జీ దిగ్భ్రాంతి- Helpline Numbers ఇవీ

Odisha Train Accident: 50 అంబులెన్సులు కూడా సరిపోలేదు! మమతా బెనర్జీ దిగ్భ్రాంతి- Helpline Numbers ఇవీ

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

టాప్ స్టోరీస్

Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?

Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?

KCR Nirmal Tour: నేడు నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ టూర్, బహిరంగ సభ కూడా

KCR Nirmal Tour: నేడు నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ టూర్, బహిరంగ సభ కూడా

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Weather Latest Update: తెలంగాణలో ఈవారం ఠారెత్తనున్న ఎండ, ఐఎండీ హెచ్చరిక - ఏపీలో ఈ జిల్లాల్లో వడగాడ్పులు!

Weather Latest Update: తెలంగాణలో ఈవారం ఠారెత్తనున్న ఎండ, ఐఎండీ హెచ్చరిక - ఏపీలో ఈ జిల్లాల్లో వడగాడ్పులు!