Nalgonda: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- బైక్, కారు ఢీకొని ఐదుగురు మృతి
Nalgonda Crime News: నల్గొండ జిల్లాలో బైకు, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు.
Nalgonda Crime News: నల్గొండ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
అసలేం జరిగిందంటే..
అతివేగంగా దూసుకొచ్చిన కారు బైకును ఢీకొట్టింది. చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద బుధవారం సాయంత్రం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తన్న మల్లికార్జున్, మణిపాల్ మృతి చెందారు. బైకు మీద వెళ్తున్న ప్రసాద్ అనే వ్యక్తి, అతడి భార్య రమణమ్మ, కుమారుడు అవినాష్ కూడా తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్న బాధితులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఘోర రోడ్డు ప్రమాదం, అందులోనూ ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేుపట్టారు.