News
News
X

Nagar Kurnool News: కాళ్ల కడియాలు, పింఛన్ డబ్బు కోసం కన్నతల్లినే చితకబాదిన కుమార్తె!

Nagar Kurnool News: కని పెంచిన తల్లిపై ఓ మహిళ దాడి చేసింది. అది కూాడా పింఛన్ డబ్బులు, కాళ్ల కడియాల కోసం. వృద్ధురాలని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లుగా తిడుతూ, దాడికి పాల్పడింది

FOLLOW US: 
Share:

Nagar Kurnool News: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కాళ్ల కడియాలు, పింఛన్ డబ్బుల కోసం సొంతం తల్లినే ఓ కూతురు దుర్భాషలాడుతూ, చితకబాదిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని 13 వార్డుకు చెందిన  చంద్రమ్మ అనే వృద్ధురాలు తన ఒక్కగానొక్క కూతురు ఇంటి వద్ద ఉంటూ జీవనం సాగిస్తోంది. తాగుడుకు బానిసైన కూతురు పింఛన్ డబ్బుల కోసం మంగళవారం తల్లితో గొడవకు దిగింది. ఈ క్రమంలోనే తల్లి కాళ్లకున్న కడియాలను లాక్కోవడంతో పాటు, ఆమెను ఇష్టారీతిగా దుర్భాషలాడుతూ, వృద్ధురాలని కూడా చూడకుండా రాళ్లతో కొట్టింది. అయితే ఇదే క్రమంలో అటు వైపుగా వెళ్తున్న కొందరు ఆ దృశ్యాలను వీడియో తీశారు.

అంతే కాకుండా వృద్ధురాలిని కొడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించినప్పటికీ.. అ మహిళ పట్టించుకోకుండా తల్లిని అలాగే కొడుతూ ఉంది. ఆ మహిళ తన తల్లిని కొడుతోన్న సమయంలో పక్కనే ఉన్న ఓ పిల్లవాడు వృద్ధురాలు చేతులను పట్టుకోవడం.. అక్కడే ఉన్న అల్లుడు తనకు ఏమి పట్టదన్నట్లుగా వ్యవహరించాడు. దీంతో అక్కడ ఉన్నా  మరికొంత మంది ఆ వృద్ధురాలిని రక్షించి.. పోలీసులకు సమాచారం అందించారు. కాగా, డబ్బు కోసం కన్నపేగు బంధాన్ని మరిచి ఆ మహిళ వృద్ధురాలైన తల్లిన కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నాలుగు రోజుల క్రితమే కన్నవాళ్లను మోసం చేసిన మహిళ - తల్లిదండ్రుల నిరసన!

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం బండ గల్లీలో కన్న తల్లిదండ్రులని చూడకండా కసాయిలా ప్రవర్తిస్తోంది కన్న కూతురు. కూతురే అన్ని భావించిన తల్లి దండ్రులను మోసం చేసింది ఆ కూతురు. తల్లిదండ్రుల బరువు బాధ్యత చూసుకుంటానని వారివద్ద ఉన్న 10 లక్షల నగదు, 15 తులాల బంగారo తీసుకుంది. తీరా ఆ వృద్ధ దంపతులను కూతురు అల్లుడు ఇంట్లోంచి గెంటేశారు. డబ్బుకు ఆశపడి తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి చివరికి వృద్ధులని చూడకుండా వారిని గెంటేయటంపై ఆవేదన చెందుతున్నారు బాధితులు. కూతురు ఇంటి ముందే టెంట్ వేసుకుని న్యాయ పోరాటం చేస్తున్నారు తల్లిదండ్రులు. తమ వద్ద ఉన్న నగదు, బంగారం తీసుకుని చివరికి కన్న కూతురే అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 

"మేము ఎలా బతకాలి. ఎక్కడికి వెళ్లగలం. ముగ్గురు ఉన్నాం. మా అక్క కూడా మాతోనే ఉంటుంది. ఆమెకు నడుం ఇరిగిపోయింది. నేను కూడా ఏ పనిచేయలేకపోతున్నాను. నా బిడ్డకు డబ్బులు ఇచ్చాను. డబ్బులు తిరిగి ఇవ్వమంటే అల్లుడు కొట్టడానికి వచ్చాడు. మాకు ఆధారం ఏంటి? 10 లక్షలు , 15 తులాల బంగారం ఇచ్చాం. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు నాకు. ఒక కొడుకు చచ్చిపోయిండు. కొడుకును నమ్మకుండా బిడ్డను నమ్మి డబ్బు, బంగారం ఇచ్చాను. ఇప్పుడు బిడ్డ మోసం చేసింది. ఆరోగ్యం బాగోలేక దవఖానాకు వెళ్లాను. అప్పుడు డబ్బులు బిడ్డ దగ్గర పెట్టాను. దవఖానా నుంచి తిరిగి వచ్చాక డబ్బులు ఇవ్వమంటే ఎనిమిది దినాల్లో ఇస్తానంది. ఇప్పుడు మోసం చేసింది. డబ్బులు అడుగుతుంటే అల్లుడు కొట్టడానికి వస్తున్నాడు. " - బాధితుడు 

కూతురి ఇంటి ముందు నిరసన 

కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండల కేంద్రానికి చెందిన వీరయ్య చారి, అంజవ్వలకు ఇద్దదరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారి పెద్ద కుమారు వెంకటేశం అనారోగ్యంతో మరణించాడు. చిన్న కుమారుడు శ్రీనివాస్‌ నిజామాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వారి కుమార్తె అనిత బాన్సువాడ పట్టణం బండగల్లిలో ఉంటుంది. అయితే తల్లిదండ్రుల బాధ్యతను చూసుకుంటానని చెప్పిన అనిత వారిని బాన్సువాడలోని తన ఇంటికి తీసుకెళ్లింది. కొన్ని రోజులు అంతా సవ్యంగానే నడిచింది. ఆ తర్వాత అనిత అసలురూపం బయటపడింది. తల్లి వద్ద ఉన్న 15 తులాల బంగారం, రూ. 10 లక్షల నగదును తీసుకుని  తల్లిదండ్రులను ఇంట్లోంచి గెంటేసింది. ఇందుకు అనిత భర్త కూడా సహకరించాడు. కన్న బిడ్డే అన్యాయం చేసిందని ఆ వృద్ధ తల్లిదండ్రులు అనిత ఇంటి ముందు న్యాయపోరాటానికి దిగారు. కూతురు ఇంటి ముందు టెంట్ వేసుకుని దీక్షకు దిగారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. డబ్బులు ఇవ్వకుంటే ప్రాణాలు వదులుకోవడం తప్ప ఇంకేం చేయలేమన్నారు. 

Published at : 07 Dec 2022 09:49 AM (IST) Tags: Telangana News Nagar Kurnool Crime News Nagar Kurnool News Women Beated Mother Daughter Beats Mother

సంబంధిత కథనాలు

Hyderabad Crime News: బర్త్ డే పార్టీలో బాలికపై యువకుల గ్యాంగ్ రేప్- హైదరాబాద్‌లో మరో దారుణం!

Hyderabad Crime News: బర్త్ డే పార్టీలో బాలికపై యువకుల గ్యాంగ్ రేప్- హైదరాబాద్‌లో మరో దారుణం!

UP News: ప్రియుళ్లతో పారిపోయిన ఐదుగురు వివాహితలు - ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే!

UP News: ప్రియుళ్లతో పారిపోయిన ఐదుగురు వివాహితలు - ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Hyderabad Crime News: ప్రేమించి పెళ్లాడింది, మరో వివాహం చేసింది - తర్వాతే అసలు కథ మొదలైంది!

Hyderabad Crime News: ప్రేమించి పెళ్లాడింది, మరో వివాహం చేసింది - తర్వాతే అసలు కథ మొదలైంది!

Kakinada Crime: జల్సాలకు అలవాటుపడి వరుస చోరీలు, నిద్రపోతున్న ప్రయాణికులే వీరి టార్గెట్!

Kakinada Crime: జల్సాలకు అలవాటుపడి వరుస చోరీలు, నిద్రపోతున్న ప్రయాణికులే వీరి టార్గెట్!

Mancherial Crime: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య ఆత్మహత్య కలకలం!

Mancherial Crime: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య ఆత్మహత్య కలకలం!

టాప్ స్టోరీస్

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్‌ని కూడా !

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్‌ని కూడా !

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

RBI Policy: దాస్‌ ప్రకటనల్లో స్టాక్‌ మార్కెట్‌కు పనికొచ్చే విషయాలేంటి?

RBI Policy: దాస్‌ ప్రకటనల్లో స్టాక్‌ మార్కెట్‌కు పనికొచ్చే విషయాలేంటి?