Hyderabad News: కూకట్ పల్లిలో దారుణం - మహిళపై అత్యాచారం, హత్య?
Telangana News: హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. దుండగులు మహిళపై అత్యాచారం చేసి చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Woman Murdered In Kukatpally: హైదరాబాద్ (Hyderabad)లోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ వర్క్ షాప్ సెల్లార్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఇద్దరు దుండగులు మహిళపై అత్యాచారం చేసిన అనంతరం చంపేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలికి దాదాపు 45 ఏళ్లు ఉండొచ్చని అంచనా వేస్తుండగా.. ఆమె వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆదివారం ఉదయమే ఈ ఘటన జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు.. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





















