UP Road accident: యూపీ, మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదాలు, 14 మంది దుర్మరణం
యూపీ, మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 14 మంది మరణించారు. వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబలించింది.
UP Road accident: రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 14 మంది మరణించారు. కారును గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యూపీలో ఏడుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలోనూ ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, ఓ తీవ్రంగా గాయపడింది.
Mathura road accident: వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబలించింది. ఢిల్లీ నుంచి వస్తున్న కారును యమునా ఎక్స్‌ప్రెస్ వేపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిని సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మథుర జిల్లా పోలీసులు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ మథురా జిల్లాలోని నౌజహిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి, ముగ్గురు పురుషులు ఉన్నారని పోలీసులు తెలిపారు. నోయిడాలో ఓ వివాహ వేడుకకు కారులో వెళ్తుండగా మార్గంమధ్యలో ఈ విషాదం చోటుచేసుకుంది.
Uttar Pradesh | Seven people died & two injured after a vehicle hit their car on Yamuna Expressway near Mathura
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 7, 2022
SP (Rural), Shrish Chandra says, "Three women, three men & one child died on spot while another child & a man are hospitalised. They were going to a wedding in Noida." pic.twitter.com/G36q1tQaGc
Nagpur Road Accident: అతివేగం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అతివేగంగా దూసుకొచ్చిన టవేరా, ట్రక్కు ఢీకొనడంతో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు మహిళలు సహా ఏడుగురు మృతి చెందారు. ఓవర్ స్పీడ్‌తో ట్రక్కును ఓవర్ టెక్ చేసే సమయంలో టవేరా ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని ఉమ్రేద్ మార్గంలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.