News
News
వీడియోలు ఆటలు
X

Mancherial News : ప్రేమ, పెళ్లి, విడాకులు- మోసం చేసిన వాడిని మళ్లీ నమ్మిన యువతి, చివరికి!

Mancherial News :మంచిర్యాల జిల్లాలో ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగింది. పెళ్లి చేసుకుంటామని మోసం చేశాడని ఆమె ఆరోపిస్తుంది.

FOLLOW US: 
Share:

Mancherial News :మంచిర్యాల జిల్లాలో ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేశాడు ప్రియుడు. దీంతో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది. తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలనని ప్రియుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగింది. 

అసలేం జరిగింది? 

 మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచలాపురం గ్రామానికి చెందిన కృష్ణ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన స్వప్న అనే యువతితో కాలేజీలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వారి మధ్య ప్రేమ పెరిగి ఇద్దరూ కలిసి ఫోటోలు దిగారు. పెళ్లి వరకు మాటలు వచ్చాయి. పెళ్లికి ఓకే అని చెప్పాడు కృష్ణ.  ఆ తర్వాత ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని స్వప్న అడిగినప్పుడల్లా పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పుతూ కాలయాపన చేశాడు. చివరికి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోవట్లేదని, కొద్దిరోజులు ఆగని చెప్పడంతో ఆ యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొద్దిరోజులు కాలం గడిచింది. 

ఫొటోలు బయటపెడతానని వేధింపులు

ఇటీవల కృష్ణ యువతికి ఫోన్ చేసి ఎందుకు పెళ్లి చేసుకున్నావు. నేను కొన్ని రోజులు తర్వాత పెళ్లి చేసుకుంటాను అన్న కదా.. ఇలా ఎందుకు చేశావు అని వేధింపులు మొదలుపెట్టాడు. నువ్వు నాతో దిగిన ఫొటోలు ఉన్నాయి. నువ్వు మీ ఆయనతో కలిసి ఆ ఫొటోలు వీడియోలు బయటపెడతా అని బెదిరించాడు. దీంతో స్వప్న మళ్లీ అతడి మాయమాటలు నమ్మి భర్తతో విడాకులకు కూడా వెళ్లింది. ఈ విషయాన్ని యువతి కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచింది.  తీరా ఇప్పుడు పెళ్లి మాట ఎత్తేసరికి కృష్ణ ఉలుకు పలుకు లేదని బాధిత యువతి ఆరోపిస్తుంది. అతడు వేరే అమ్మాయితో పెళ్లికి ఒప్పుకోవడంతో యువతి చివరికి పోలీస్ స్టేషన్ వెళ్లింది. పెద్ద మనుషుల దగ్గరకు వెళ్లి తన సమస్య చెప్పుకుంది.  అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో తన భవిష్యత్తు ప్రశ్నానార్థకంగాగా మారిందని కృష్ణ ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి స్వప్న తనకు న్యాయం కావాలని పోరాటం చేస్తోంది. ప్రేమ పేరిట మోసపోయిన ఆ యువతి తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని తెలిపింది.  

ప్రేమించి పెళ్లాడింది, మరో వివాహం చేసింది

వారిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోయిన ఇద్దరూ పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టారు. ఏడేళ్లపాటు వీరి కాపురం హాయిగా సాగింది. ఆ తర్వాత నుంచే భార్యకు కల్లు, మద్యానికి అలవాటు పడింది. బానిసగా మారింది. భర్త మెప్పు కోసం అతడికి ఓ 17 ఏళ్ల బాలికను ఇచ్చి పెళ్లి చేసింది. వ్యసనాల బారిన పడ్డ మొదటి భార్యను వదిలించుకోవడానికి అతడు స్కెచ్‌ వేశాడని గ్రహించి కౌంటర్ ప్లాన్ వేసింది. అది కూడా అతనికి ఇష్టమైన రెండో భార్యతోనే మొదటి భార్య స్పాట్‌ పెట్టింది. కడతేర్చింది. ఫుల్లుగా మద్యం తాగించి అతని మెడకు చన్నీని చుట్టి చెరోవైపు లాగి మరీ చంపేశారా ఇద్దరు సతీమణిలు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని ఓ సంచిలో కట్టి వాళ్లుంటున్న రెండో ఫ్లోర్ నుంచి కింద పడేశారు. అనంతరం చేతులు దులుపుకొని సరికొత్త డ్రామా మొదలు పెట్టారు. కానీ చివరకు బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు చిక్కారు.  ఈ ఘటన హైదరాబాద్ బహదూర్ పల్లి చోటుచేసుకుంది. 

Published at : 09 Feb 2023 04:39 PM (IST) Tags: Lover Mancherial News Marriage Cheating Woman protest

సంబంధిత కథనాలు

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Mine Collapsed: ప్రాణాలు తీసిన అక్రమ మైనింగ్, బొగ్గు గనిలో ప్రమాదం - శిథిలాల కింద బాధితులు

Mine Collapsed: ప్రాణాలు తీసిన అక్రమ మైనింగ్, బొగ్గు గనిలో ప్రమాదం - శిథిలాల కింద బాధితులు

దోసలు వేసినంత ఈజీగా చోరీలు - పట్టుకున్న పిగన్నవరం పోలీసులు

దోసలు వేసినంత ఈజీగా చోరీలు - పట్టుకున్న పిగన్నవరం పోలీసులు

Dead Body In Manhole: ప్రియురాలిని హత్య చేసి మ్యాన్‌హోల్‌లో పడేసిన పూజారి- హైదరాబాద్‌లో దారుణం

Dead Body In Manhole: ప్రియురాలిని హత్య చేసి మ్యాన్‌హోల్‌లో పడేసిన పూజారి- హైదరాబాద్‌లో దారుణం

Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య

Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్

Varun Tej Engagement: వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి

Varun Tej Engagement: వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి