అన్వేషించండి

Vizianagaram: ప్రియురాలి రెండేళ్ల కూతురిపై లవర్ పైశాచికత్వం - బుగ్గలు, కాళ్లు కొరికేసి, తల్లి చేసిన పని షాక్

రెండేళ్ల బాలిక ముద్దులొలికే పలుకులు వింటూ ఎవరైనా ఆనందిస్తారు. చిట్టి నడకతో ఇల్లంతా తిరుగుతూ అల్లరి చేస్తుంటే మురిసిపోతారు. కానీ, ఈ కర్కశుడు ఆ బాలిక పట్ల యముడిలా ప్రవర్తించాడు.

కన్న కూతురి కన్నా వివాహేతర సంబంధమే ముఖ్యమని అనుకుంది. ప్రియుడు రెండేళ్ల కుమార్తెను ఎన్ని చిత్ర హింసలు పెట్టినా అడ్డు చెప్పకుండా నెలల తరబడి అతనితో సహజీవనం చేసింది. అతని పైశాచికత్వం మరీ పెరిగిపోయి చిన్నారిని మరింత తీవ్రంగా హింసించినా నోరు మెదపలేదు. పైగా విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసింది. స్థానికులు ఈ విషయం గుర్తించడంతో విషయం బయటకు పొక్కింది. చివరకు శిశు సంరక్షణ అధికారులకు తెలియడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.

సాధారణంగా రెండేళ్ల చిన్నారి అంటే.. అభం శుభం తెలియని ఆ బాలిక ముద్దులొలికే పలుకులు వింటూ ఎవరైనా ఆనందిస్తారు. చిట్టి నడకతో ఇల్లంతా తిరుగుతూ అల్లరి చేస్తుంటే మురిసిపోతారు. కానీ, ఈ కర్కశుడు ఆ బాలిక పట్ల యముడిలా వ్యవహరించాడు. తన ప్రియురాలి కుమార్తె అయిన రెండేళ్ల బాలికను 7 నెలలుగా చిత్రహింసలు పెడుతూనే ఉన్నాడు. గురువారం ఆ ప్రియుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం కొత్తపేట సమీపంలో 26 ఏళ్ల వివాహిత నివాసం ఉంటోంది. ఈమెకు గత నాలుగేళ్ల క్రితమే పెళ్లి జరిగింది. కానీ, కొద్ది కాలం క్రితం ఆమె భర్త ఆమెను వదిలేశాడు. అప్పటికే ఆమెకు రెండేళ్ల వయసు ఉన్న చిన్నారి ఉంది. పొట్ట పోషించుకొనేందుకు ఆమె కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు అదే జిల్లా నెల్లిమర్లలో ఓ శుభకార్యంలో ఎలక్ట్రీషియన్‌ గా పని చేసే చిన్నా అనే 29 ఏళ్ల యువకుడు పరిచయం అయ్యాడు. ఈమెకు భర్త ఉన్నా వదిలేయడంతో అది క్రమంగా సహజీవనానికి దారి తీసింది. 

ఇద్దరూ ఓ ఇల్లు అద్దెకు తీసుకొని మరీ నివాసం ఉంటున్నారు. అయితే, తల్లితో పాటే ఉంటున్న రెండేళ్ల కుమార్తెను ఏడు నెలలుగా ప్రియుడు చిన్నా కొట్టడం, రక్కడం వంటి వికృత చేష్టలకు పాల్పడేవాడు. అయినా ఆ కఠిన మనస్తత్వం ఉన్న తల్లి మనసు కనికరించలేదు. చిన్నా ఆమెపై ఘోరాలకు పాల్పడుతున్నా ఆమె అడ్డు చెప్పలేదు. బుధవారం రాత్రి తల్లి ఇంట్లో లేనప్పుడు ఆ చిన్న పాప బుగ్గలు, చేతులు, కాళ్లను చిన్నా కొరికేశాడు. ఆమె ఇంటికి వచ్చేసరికి పాప ఏడుస్తుండటంతో చుట్టుపక్కల ఏమైందని అడిగారు. దీంతో ఆమె విషయాన్ని దాటవేసి ప్రియుడ్ని వెనకేసుకొచ్చింది. స్థానికుల ద్వారా అంగన్‌వాడీ సిబ్బందికి విషయం తెలియడంతో స్థానిక మహిళా సంరక్షణ పోలీసుకు సమాచారం అందించారు. తల్లి ఫిర్యాదు మేరకు చిన్నాను రిమాండుకు తరలించామని దిశ పోలీసులు వెల్లడించారు. బాలికను వైద్య చికిత్సలకు ఆసుపత్రికి తరలించామని, తల్లికి వ్యక్తిత్వ, మానసిక నిపుణుల వద్ద కౌన్సెలింగ్‌ చేయిస్తామని వెల్లడించారు.

టాప్ హెడ్ లైన్స్

Alluri Blasting News: అల్లూరి జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు దుర్మరణం- హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు దుర్మరణం- హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
Hyderabad Crime News: మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా ఫోన్, వీడియోలు రికార్డ్.. కవాడిగూడ పవర్ గ్రిడ్‌ ఆఫీసులో కలకలం
మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా ఫోన్, వీడియోలు రికార్డ్.. కవాడిగూడ పవర్ గ్రిడ్‌ ఆఫీసులో కలకలం
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
Hyderabad Crime News: ప్రియుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య.. ఉప్పల్ పీఎస్ పరిధిలో ఘటన
ప్రియుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య.. ఉప్పల్ పీఎస్ పరిధిలో ఘటన

వీడియోలు

IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
World's First Mixed-Gender Cricket Tournament | ఒకే క్రికెట్ మ్యాచ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు
Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SEC Serious On Vidadala Raniji Incident: చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
Telugu Duo Tilak ,Nitish Brilliance: ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
Sonia Gandhi Rajiv Love Story: రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
బీఆర్ఎస్ ఎల్‌నీనో వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్.. KCR ఫాంహౌస్‌లో అద్భుత దీపం ఉందా? అంటూ విమర్శలు
బీఆర్ఎస్ ఎల్‌నీనో వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్.. KCR ఫాంహౌస్‌లో అద్భుత దీపం ఉందా? అంటూ విమర్శలు
AP Local Body Elections: ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
Piyush Goyal: పర్యావరణాన్ని నాశనం చేసింది మీరే.. యూరప్ నేతలకు క్లైమేట్ క్లాస్ పీకిన పీయూష్ గోయల్!
పర్యావరణాన్ని నాశనం చేసింది మీరే.. యూరప్ నేతలకు క్లైమేట్ క్లాస్ పీకిన పీయూష్ గోయల్!
Fauzi Chandrabose : 'ఫౌజీ'లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ - పాత్రలో ఒదిగిపోయిన నటుడు... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
'ఫౌజీ'లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ - పాత్రలో ఒదిగిపోయిన నటుడు... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
US Iran Tensions: ఇరాన్‌పై మరో ఎపిక్ ఫ్యూరీకి కాలుదువ్వుతున్న ట్రంప్.. ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని ఇరాన్ హెచ్చరిక
ఇరాన్‌పై మరో ఎపిక్ ఫ్యూరీకి కాలుదువ్వుతున్న ట్రంప్.. ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని ఇరాన్ హెచ్చరిక
Embed widget